కొత్త ఫోన్‌లతో జియోనీ దూసుకొస్తోంది

|

చైనా ఫోన్‌ల కంపెనీ జియోనీ ఆరు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో లాంచ్ చేయబోతోంది. ఈ బ్రాండ్ లేటెస్ట్‌గా అభివృద్ధి చేసిన జియోనీ ఎం7 ప్లస్ కొద్ది గంటల క్రితమే టీనా వెరిఫికేషన్ వెబ్‌సైట్‌లో దర్శనమిచ్చింది. సరిగ్గా నెలక్రితమే జియోనీ ఎఫ్6 కూడా ఇదే డేటా బేస్‌లో స్పాట్ అవటం విశేషం.

 
కొత్త ఫోన్‌లతో జియోనీ దూసుకొస్తోంది

చైనా మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ Weiboను వేదికగా చేసుకుని జియోనీ తన అప్‌కమ్మింగ్ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి ఓ టీజర్ ఇమేజ్‌ను కూడా రిలీజ్ చేసినట్లు డీల్ఎన్‌టెక్ పేర్కొంది. ఈ టీజర్ ప్రకారం జియోనీ నుంచి 6 కొత్త స్మార్ట్‌ఫోన్‌లు నవంబర్ 26న మార్కెట్లో రిలీజ్ కానున్నాయి. ఎం7 ప్లస్, ఎఫ్6, ఎఫ్205, ఎస్11, ఎస్115, స్టీల్ 3 మోడల్స్‌లో ఈ ఫోన్‌లు అందుబాటులో ఉంటాయి. ఈ ఆరు స్మార్ట్‌ఫోన్‌లు బీజిల్-లెస్ డిజైన్‌తో పాటు 18:9 డిస్‌ప్లేలతో వచ్చే అవకాశముందని తెలుస్తోంది.

గతంలో రివీల్ అయిన కొంత డేటా ప్రకారం జియోనీ ఎఫ్205 స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి.. 5 అంగుళాల డిస్‌ప్లే, మీడియాటెక్ ఎంటీ6739 సాక్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

ఉబర్‌కి షాకిచ్చిన హ్యాకర్లు.. రూ. 65 కోట్లు చెల్లింపుఉబర్‌కి షాకిచ్చిన హ్యాకర్లు.. రూ. 65 కోట్లు చెల్లింపు

మరో మోడల్ జియోనీ ఎఫ్6.. 5.7 అంగుళాల హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే, 1.4GHz ఆక్టా కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా, 2970mAh బ్యాటరీ వంటి ఫీచర్లతో వచ్చే అవకాశం ఉంది.

మరో మోడల్ జియోనీ ఎమ్7 ప్లస్.. 7.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే, క్వాల్కమ్
స్నాప్‌డ్రాగన్ 660 ఆక్టా కోర్ ప్రాసెసర్, 6జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 16 మెగా పిక్సల్ + 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా వంటి భారీ స్పెసిఫికేషన్‌లతో వచ్చే అవకాశం ఉంది.

మరో మోడల్ జియోనీ ఎస్11.. 5.7 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, మీడియాటెక్ MT6763 సాక్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా వంటి శక్తివంతమైన ఫీచర్లతో రాబోతోంది.

Best Mobiles in India

Read more about:
English summary
Gionee has teased that they will launch six new smartphones at an event on November 26.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X