సాప్ట్‌వేర్ ఇంజనీర్ అల్లుడుని కిరోసిన్ పోసి తగలబెట్టిన మామ

Posted By: Staff

సాప్ట్‌వేర్ ఇంజనీర్ అల్లుడుని కిరోసిన్ పోసి తగలబెట్టిన మామ

చెన్నై: ఆ సాప్ట్‌వేర్ ఇంజనీర్ తరుపున మామగారే బద్ద శత్రువు అయ్యారు. చేచేతులారా కన్న కూతురి పసుపు కుంకమ చెరిపివేశారు. వివరాలలోకి వెళితే 23సంవత్సరాల వయసు కలిగినటువంటి పార్దసారధి అనే సాప్ట్‌వేర్ ఇంజనీర్‌ని మామే స్వంతంగా రౌడీలను పెట్టి మరీ చంపించారు. మే రెండవ తారీఖున కనిపించకుండా పోయినటువంటి పార్దసారధి జూన్ 2వ తారీఖున చనిపోయాడన్న వార్త తెలిసి తన భార్య కంగుతింది. పార్దసారధి భార్య శరణ్య తన భర్త కనిపించడం లేదని కేసు పెట్టడంతో అసలు విషయం బయటకు వచ్చింది. సిటి పోలీసుల ప్రకారం తనకు ఇష్టం లేని పెళ్శి చేసుకున్నందుకు గాను తన కూతురు భర్తని తానే హత్య చేశానని శరణ్య తండ్రి నరసింహాన్ పోలీసులు ముందు వెల్లడించడం జరిగింది. నరసింహాన్ మెట్రో వాటర్‌లో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు.

నరసింహాన్ చెప్పిన వివరాల ప్రకారం పోలీసులు ఈ విధంగా వెల్లడించారు. నరసింహాన్ కూతురు అయినటువంటి శరణ్య యమ్‌బిబిఎస్ చదువుతుంది. ఈసమయంలో శరణ్యకి నరసింహాన్ వేరే వాళ్శతో పెళ్శి నిశ్చయించగా అది నచ్చనటువంటి శరణ్య తను ప్రేమించినటువంటి పార్దసారధిని ఇంట్లో వాళ్శకి చెప్పకుండా పెళ్శి చేసుకుంది. పార్దసారధి వేరే కులం కావడంతో ఇది నచ్చనటువంటి పార్దసారధి ఎలాగైనా తన అల్లుడుని చంపాలని నిర్ణయించుకోని తన స్నేహితుల సాయంతో జానకి రామ్, దిలిప్ కుమార్, రామ్ కుమార్ అనే ముగ్గురు కిరాయి గుండాలను పంపించడం జరిగింది.

నరసింహాన్ కిరాయి గుండాలకు పార్దసారధిని చంపితే రెండు లక్షలు ఇవ్వడానికి ఒప్పుకోవడంతోపాటు, అడ్వాన్స్‌గా రూ 25,000 ఇవ్వడం కూడా జరిగిందన్నారు. ఈ గ్యాంగ్ ముగ్గురు కలసి పార్దసారధిని మే 2వ తారీఖున ఆఫీసు నుండి బయటకు వస్తున్న సమయంలో కిడ్నాప్ చేసి కారులో ఎక్కించుకోని తిరుచికి దగ్గరలో ఉన్న సమయపురంకి తీసుకోని వెళ్శి చెన్నైకి తిరిగి వస్తున్న మార్గం మద్యలో అతనిని బాగా కొట్టి రొడ్డు ప్రక్కన ఉన్న చెట్ల పొదలోకి పడవేసి అతని మీద కిరోసిన్ పోసి తగలబెట్టడం జరిగిందని నరసింహాన్ వెల్లడించారు. కిడ్నాప్‌కి ఉపయోగించినటువంటి కారుని కూడా సీజ్ చేయడం జరిగిందని ఐజి సి శైలేంద్రబాబు వివరించారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting