గేమ్ పిచ్చిలో తండ్రిని చావబాదిన చిన్నారి, ఖంగుతిన్న తల్లిదండ్రులు

By Anil
|

టెక్నాలజీ రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ విషయం అందరికీ ఆనందం కలించేదే అయినప్పటికీ కొన్ని విషయాలో తీరని విషాదాలను మిగులుస్తోంది. ముఖ్యంగా చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా సమస్యలను ఎదుర్కుంటున్నారు. గేమ్స్ మాయలో పడీ పిల్లలు ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి నేడు కనిపిస్తోంది. ఈ కథనానికి ఊతమిస్తూ ఓ 9 ఏళ్ల బాలిక గేమ్ పిచ్చిలో పడి తన తండ్రిపైనే యుధ్దానికి దిగింది. ఏం చేస్తుందో తెలియని స్థితిలో తండ్రి మీదకు దాడికి దిగింది. ఈ కధనం పూర్తి వివరాల్లోకెళితే...

కొమియో నుంచి సరికొత్త సీ1 ప్రో కేవలం రూ.5599 మాత్రమే..ఫీచర్లివిగో !

గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే
9 ఏళ్ళ చిన్నారి
 

9 ఏళ్ళ చిన్నారి

రెహబ్ లో నివసించే ఓ 9 ఏళ్ళ చిన్నారి గేమ్స్ కు చాలా అడిక్ట్ అయ్యి పోయింది, గేమ్ ఆడుతున్నప్పుడు ఆపడానికి ప్రయత్నించినా వాళ్ళ సొంత తండ్రినే కొట్టేసింది. ఆ చిన్నారి గేమ్ కి ఎంత లా అడిక్ట్ అయి ఉంది అంటే బాత్రూం కి వెళ్తే గేమ్ ఆడడం మిస్ అవుతుందేమో అని బాత్రూం కి కూడా వెళ్లకుండా సోఫానే తడిపేసేది.

పాప రూములోకి వెళ్లి చూడగా ..

చిన్నారి ఎంతకు తన రూంలో నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన తన తండ్రి ఆ పాప రూములోకి వెళ్లి చూడగా ఆ పాప గేమ్ కి అడిక్ట్ అయి తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలియని మైకంలోకి వెళ్లింది.

రోజుకి 10 గంటలకు పైగా..

కాగా ఈ చిన్నారి ఇంట్లో అందరూ నిదురించే సమయంలో ఒంటరి గా గేమ్ అడ్తూ ఎన్నో రాత్రులు నిద్రపోకుండా గడిపేదని తెలుస్తోంది. రోజుకి 10 గంటలకు పైగా గేమ్ పైన సమయం గడిపేదని, ఈ గేమ్ పైన నెలకు సుమారు 50 డాలర్ల దాకా వెచ్చించేదని తెలుస్తోంది.

రెండు నెలలలోనే..
 

రెండు నెలలలోనే..

తన తండ్రి సరదా కోసం ప్లే స్టేషన్ కొనిచ్చిన రెండు నెలలలోనే ఆ పాప పూర్తిగా మరో ప్రపంచంలోకి వెళ్లిపోయింది. స్కూల్ లో దేని పైన దృష్టి పెట్టేది కాదు. చివరికి ఆదివారం వాళ్ళ తల్లితండ్రులతో చర్చి కి కూడా వెళ్లకుండా ప్లే స్టేషన్ లో గేమ్ అడ్తూ కూర్చునేది.

psychiatrist దగ్గరికి తీసుకొని వెళ్లగా..

పాప అలా గేమ్ కి అడిక్ట్ అవడంతో ఖంగుతిన్న తల్లిదండ్రులు ఆ చిన్నారిని ని psychiatrist దగ్గరికి తీసుకొని వెళ్లగా ఆ psychiatrist ఆ పాప గేమ్ కి అడిక్ట్ అయిన విషయాన్ని తెలుసుకున్నాడు. అదే విషయాన్ని తల్లిదండ్రలుకు చెప్పాడు.

చిన్న పిల్లలు ప్లే స్టేషన్ గేమ్స్ కి అడిక్ట్ అయినప్పుడు వాళ్ళ symptoms ఎలా ఉంటాయో ఇలా తెలుసుకోండి:

చిన్న పిల్లలు ప్లే స్టేషన్ గేమ్స్ కి అడిక్ట్ అయినప్పుడు వాళ్ళ ప్రవర్తన మారిపోతుంది ఎవరితోనూ కలవకుండా ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరి గా ప్లే స్టేషన్ ముందు గడిపేస్తుంటారు. తిండి నిద్ర మానేసి ఎప్పుడు ప్లే స్టేషన్ ముందే కూర్చొని ఉంటారు.

చిన్న పిల్లలు ప్లే స్టేషన్ గేమ్స్ కి అడిక్ట్ అవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

చిన్న పిల్లలకి ప్లే స్టేషన్ ను కొనివ్వకండి ఒక వేళా కొనిచ్చిన దాని ముందు గంటల తరబడి కూర్చోనివ్వకండి. సాధ్యమైనంత వరకు పిల్లలతో మీరే గడపండి.పార్క్ కో సినిమా కో పిక్నిక్ కో తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నించండి. ఇంట్లో అందరూ పడుకున్నాక అర్ధ రాత్రి మీ పిల్లలు పడుకున్నారో లేదో ఓ కంట కనిపెట్టండి.

కేవలం 11 నెలల కాలంలోనే..

ఈ గేమ్ గత సంవత్సరం జులై లో లాంచ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. కేవలం 11 నెలల కాలంలోనే ఈ గేమ్ ని దాదాపు 40 మిలియన్ల మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారు. దీనిని బట్టి ఈ గేమ్ ఎంత పాపులారిటీ సంపాదించుకుందో అలాగే ఎంతమంది దీనికి అడిక్ట్ అయ్యారో ఇట్టే తెలుసుకోవచ్చు.

గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

Read more about:
English summary
A nine-year-old girl is in rehab after becoming so addicted to a video game she wet herself to avoid moving and hit her father when he tried to stop her playing.

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more