సింపుల్‌గా ఆత్మహత్య చేసుకోవటం ఎలా?, గూగుల్‌ను అడిగిన యువతి
ఓ యువతి తనని తాను అంతం చేసుకోవాలని భావించి గూగుల్‌ను ఆశ్రయించింది.
బాయ్‌ఫ్రెండ్ మోసం చేయటంతో పూర్తిగా డిప్రెషన్‌కు లోనైన ఓ యువతి తనని తాను అంతం చేసుకోవాలని భావించి గూగుల్‌ను ఆశ్రయించింది. తొలిత ఈమె యుమునా నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఆ చావు మరింత భయానకంగా ఉంటుందని భావించిన ఆమె సులువైన పద్దతి కోసం గూగుల్‌లో సెర్చ్ చేయటం మొదలు పెట్టింది.
జనవరి 19న రెడ్మీ నోట్ 4

ఈ క్రమంలో తన మొబైల్‌లోని గూగుల్ పేజీలో "How to commit suicide" అని టైప్ చేసింది. అయితే సెర్చ్ రిజల్ట్స్‌లో సలువుగా ఆత్మహత్య చేసుకునే టిప్స్‌కు బదులు "Suicide Helpline Numbers" కనిపించాయి. ఇంకేమి ఆలోచించకుండా వెంటనే వాటిలో ఓ నెంబర్‌కు ఆమె డయల్ చేసింది. ఆ కాల్‌ను రిసీవ్ చేసుకున్న డిప్యుటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అమెకు నచ్చజెప్పీ మనసు మార్చే ప్రయత్నం చేసారు.
నోకియా 6 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో 5 ఆసక్తికర ఫీచర్లు

డిఐజీ మాటలకు మనసు మార్చుకున్న ఆ యువతి ఆ తరువాత డీఐజీ కార్యాలయానికి వెళ్లి తన మనోవేదనను చెప్పుకుంది. దీంతో, డిఐజీ ఆమెకు మహిళా ఇన్‌స్పెక్టర్ సమక్షంలో స్పెషల్ కౌన్సిలింగ్ ఇప్పించి ఆమెను మోసం చేసిన వ్యక్తిని కన్విన్స్ చేసి మళ్లీ ఇద్దరిని కలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సంఘటనతో యువతి ప్రాణాలను కాపాడేలా చేసిన గూగుల్ ను ప్రతిఒక్కరు అభినందిస్తున్నారు.
మార్కెట్లోకి సామ్‌సంగ్ గేర్ ఎస్3 స్మార్ట్‌వాచ్, ఆసక్తికర విషయాలు..


Click it and Unblock the Notifications








