సింగపూర్, టోక్యోలు ఇక సముద్రంలోకే..

Posted By:

రానున్న కాలంలో సింగపూర్,టోక్యో ఫ్లోరిడా వంటి నగరాలు సముద్రంలో కలిసిపోతాయి..ఈ వార్త విన్న వారెవరికైనా షాక్ తగలాల్సిందే..కాని అదినిజమేనని నాసా చెబుతోంది. రానున్న సంవత్సరాల్లో ఈ నగరాలన్నీ పూర్తిగా సముద్రంలో మునిగిపోయే ప్రమాదముందని నాసా శాస్ర్తవేత్తలు హెచ్చరిస్తున్నారు.వీటితో పాటు ఇంకా కొన్ని ద్వీపాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం కూడా పొంచి ఉందని నాసా చెబుతోంది. ఇంకా చెప్పాలంటే 15 కోట్ల మంది వారు ఉన్న ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలి వెళ్లకపోతే వారంతా సముద్రంలో కలిసిపోతారని నాసా చెబుతోంది..మరి నాసా ఎందుకు అలా చెప్పిందో కింద స్టోరి చదివితే మీకే అర్థమవుతుంది.

Read more: ఇవి అదో టైపు..!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సముద్ర మట్టం 3 అడుగుల మేర పెరగే అవకాశం

వచ్చే వంద నుంచి రెండు సంవత్సరాల వ్యవధిలో సముద్ర మట్టం 3 అడుగుల మేర పెరగనుందని,భూమండలం అధిగమించలేని అతిపెద్ద ప్రమాణాల్లో ఇదొకటని నాసా సైంటిస్టులు వెల్లడించారు.

తెలియజేస్తున్న గణాంకాలు

తాజా శాటిలైట్ గణాంకాల మేరకు సముద్ర మట్టం సుమారు మీటరు పెరగనుందని అంచనా

మైఖేల్ ఫెర్లిచ్ వెల్లడి

గ్రీన్ ల్యాండ్ అంటార్కిటికాల్లో మంచుదిబ్బలు శరవేగంగా కరుగుతుండటమే ఇందుకు కారణమని నాసా ఎర్త్ సైన్స్ డివిజన్ డైరక్టర్ మైఖేల్ ఫెర్లిచ్ వివరించారు.

మరో ప్రాంతానికి వెళ్లక తప్పదు

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడున్న సముద్ర మట్టానికి ఒక మీటరు ఎత్తులో 15 కోట్ల మంది నివసిస్తున్నారని వారందరూ మరో ప్రాంతానికి వెళ్లక తప్పదని ఆయన చెబుతున్నారు.

సింగపూర్,టోక్యో తదితర నగరాలు సముద్రంలో

అమెరికాలోని ఫ్లోరిడాతో పాటు సింగపూర్,టోక్యో తదితర నగరాలు సముద్రంలో కలిసిపోతాయని కొన్ని ఫసిపిక్ ద్వీపాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయని ఆయన వివరించారు.

పర్యావరణ పరిరక్షణ చర్యలు

పర్యావరణ పరిరక్షణ చర్యలు విస్తృ తంగా చేపడితే ఈ ప్రమాదాన్ని మరికొంతకాలం వాయిదా వేయవచ్చని అంచనా వేశారు.

గిజ్ బాట్ పేజిని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజిని లైక్ చేయడం ద్వారా మీరు టెక్నాలజీకి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ పొందవచ్చు.

https://www.facebook.com/GizBotTelugu

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Scientists say warming waters and melting ice were to blame for levels rising faster than 50 years ago and ‘it’s very likely to get worse’
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot