Home
News

Gmail నుంచి నమ్మశక్యం కాని ఫీచర్లు, భద్రతకే పెద్ద పీట

గూగుల్ సంచలనం Gmail జీమెయిల్ ఇప్పుడు సరికొత్తగా యూజర్లను అలరించబోతోంది. కొత్త ఫీచర్లతో న్యూ లుక్ తో రానున్న వారాల్లో వినియోగదారులకు సరికొత్త అనుభూతిని అందించే దిశగా గూగుల్ కసరత్తులు చేస్తోంది.

By Hazarath Aiah

గూగుల్ సంచలనం Gmail జీమెయిల్ ఇప్పుడు సరికొత్తగా యూజర్లను అలరించబోతోంది. కొత్త ఫీచర్లతో న్యూ లుక్ తో రానున్న వారాల్లో వినియోగదారులకు సరికొత్త అనుభూతిని అందించే దిశగా గూగుల్ కసరత్తులు చేస్తోంది. ఈ మేరకు జీమెయిల్ కి సంబంధించిన కొన్ని వివరాలు సోషల్ మీడియాలో లీక్ అయి సంచలనం రేపుతన్నాయి. కొత్తగా రానున్న ఫీచర్లలో ఈమెయిల్స్ స్నూజ్ చేసుకోవడం అలాగే ఇన్ డైరక్ట్ గూగుల్ క్యాలండర్ యాక్సెస్ , డెస్క్ టాప్ స్మార్ట్ రిప్లయి లాంటివి ఉన్నాయని లీకయిన చిత్రాలను బట్టి తెలుస్తోంది. కాగా ఈ లీకులను The Verge సైటు బయటకు తీసుకువచ్చింది. మరి గూగుల్ నుంచి రానున్న ఇతర ఫీచర్లు ఏంటో ఓ సారి చూద్దాం..

Confidential Mode

Confidential Mode

కొత్త మెయిల్ Confidential Modeలో రానుంది. దీని ప్రకారం మీరు ఎవరికైనా మెయిల్ పంపిస్తే ఆ మెయిల్ ను వారు మరొకరికి ఫార్వార్డ్ చేయకుండా చేసుకోవచ్చు.అంతేకాదు, మీరు పంపిన మెయిల్ ను కాపీ చేయడం కానీ, ప్రింట్ తీసుకునే అవకాశం కానీ ఉండదు.

Image source : the verge

మెయిల్స్ ను ఓపెన్ చేసి చదవాలంటే..

మెయిల్స్ ను ఓపెన్ చేసి చదవాలంటే..

అలాగే, వచ్చిన మెయిల్స్ ను ఓపెన్ చేసి చదవాలంటే పాస్ కోడ్ అవసరం. ఈ పాస్ కోడ్ ను టెక్ట్స్ సందేశం ద్వారా గూగుల్ పంపిస్తుంది. అంతేకాదు, పంపిన మెయిల్స్ కు ఎక్స్ పయిరీ తేదీ కూడా సెట్ చేసుకోవచ్చు. అంటే నిర్ణీత సమయం తర్వాత అవి డిలీట్ అయిపోతాయి.

source : the verge

జీమెయిల్ రీడిజైన్..

జీమెయిల్ రీడిజైన్..

గూగుల్ రానున్న రోజుల్లో జీమెయిల్ రీడిజైన్ చేస్తూ చేయనుందని దీని ద్వారా యూజర్లకు జీమెయిల్ యాక్సెస్ లో మంచి అనుభూతిని పొందుతారని గూగుల్ ప్రతినిధి ఒకరు TechCrunch సైటుకి తెలియజేశారు. కాగా గూగుల్ ఇన్ బాక్స్ ఈమెయిల్ ప్రాజెక్టులో అనేక రకాలైన ఫీచర్లు రాబోతున్నాయని తెలుస్తోంది.

గూగుల్ స్మార్ట్ రిప్లయి..

గూగుల్ స్మార్ట్ రిప్లయి..

గూగుల్ స్మార్ట్ రిప్లయి ప్రధాన ఆకర్షణగా నిలవనుందని తెలుస్తోంది. మీరు మీ జీమెయిల్ నుంచి కాకుండా డెస్క్ టాప్ మీద నుంచే నేరుగా రిప్లయి ఇచ్చే విధంగా గూగుల్ కొత్త ఫీచర్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్లు ఆండ్రాయిడ్ , ఐఓఎస్ యూజర్లు ఇద్దరికీ అందుబాటులో ఉంటాయి.

 Gmail's privacy features

Gmail's privacy features

కాగా గూగుల్ గతేడాది Gmail's privacy featuresని కట్టుదిట్టం చేసిన సంగతి తెలిసిందే. జీమెయిల్ కంటెంట్ ఎవరూ స్కాన్ చేయలేని విధంగా సెక్యూరిటీని తీసుకొచ్చింది. అయితే గూగుల్ నుంచి త్వరలో రానున్న ఫీచర్ల మీద ఎటువంటి స్పష్టత గాని ప్రకటన కాని చేయలేదు. కాగా వచ్చే నెలలో దీనిపై గూగుల్ ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 

 

Best Mobiles in India

English summary
Gmail Is Getting An Upgrade And Redesign, Here Are Six Changes We Know About More news at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X