జీమెయిల్‌ పుట్టి 15 ఏళ్లు అయింది, గిఫ్ట్‌గా నాలుగు కొత్త ఫీచర్లు

టెక్ గెయింట్ గూగుల్ జీమెయిల్ 15వ వసంతంలోకి అడుగుపెట్టింది. వరల్డ్ మోస్ట్ పాపులర్ ఈమెయిల్ సర్వీస్ అయిన గూగుల్ ఏప్రిల్ 1 2004న తొలిసారిగా లైవులోకి వచ్చింది. జీ సూట్ యాప్స్ లో భాగమైన జీమెయిల్ యూజర్లకి ఇప

|

టెక్ గెయింట్ గూగుల్ జీమెయిల్ 15వ వసంతంలోకి అడుగుపెట్టింది. వరల్డ్ మోస్ట్ పాపులర్ ఈమెయిల్ సర్వీస్ అయిన గూగుల్ ఏప్రిల్ 1 2004న తొలిసారిగా లైవులోకి వచ్చింది. జీ సూట్ యాప్స్ లో భాగమైన జీమెయిల్ యూజర్లకి ఇప్పుడు 1జిబి స్టోరేజ్ ని కూడా అందిస్తోంది. జీమెయిల్ అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రయాణం సాగిస్తూ ఇప్పుడు 15 పుట్టినరోజును జరుపుకుంటోంది.

 
జీమెయిల్‌ పుట్టి 15 ఏళ్లు అయింది, గిఫ్ట్‌గా నాలుగు కొత్త ఫీచర్లు

Gmail ను పాల్ బచ్చెయిట్ అనే వ్యక్తి క్రియేట్ చేశారు. అప్పటినుంచి ఇప్పటివరకూ జీమెయిల్ సర్వీసును మిలియన్ల మంది యూజర్లు వాడుతున్నారు. ఈ పుట్టినరోజును పురస్కరించుకుని గూగుల్ 4 కొత్త సర్వీసులను యూజర్ల కోసం ప్రవేశపెట్టింది. అవేంటో ఓ సారి చూద్దాం.

Smart Compose is now smarter

Smart Compose is now smarter

స్మార్ట్ కంపోజ్ లోయూజర్లు వెబ్ లో వారానికి 1 బిలియన్ (వంద కోట్లు) క్యారెక్టర్లు టైప్ చేస్తున్నట్టు గూగుల్ తెలిపింది. ఇటీవల స్మార్ట్ కంపోజ్ ఫీచర్ ను రిలీజ్ కాగా.. తొలుత గూగుల్ ఫిక్సల్ సిరీస్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండగా.. ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజర్ల అందరికి అందుబాటులోకి వచ్చేసింది. స్మార్ట్ కంపోజ్ ఫీచర్ త్వరలో iOS యూజర్లకు కూడా అందుబాటులో రానుంది. ఇప్పటి వరకూ డెస్క్‌టాప్‌ యూజర్లకు పరిచయమున్న ‘స్మార్ట్‌ కంపోజ్‌' ఆప్షన్‌ని ఇప్పుడు మొబైల్‌ యాప్‌లోనూ అందించనుంది.

Now you can schedule delivery of an email

Now you can schedule delivery of an email

షెడ్యూల్ జీమెయిల్ సర్వీసు కూడా యూజర్లకు అందుబాటులోకి వచ్చేసింది. యూజర్లు జీమెయిల్ నుంచి మెయిల్ పంపేటప్పుడు Send బటన్ పై క్లిక్ చేయగానే.. అక్కడ Drop-down మెనూ కనిపిస్తుంది. జీమెయిల్ అందిస్తున్న షెడ్యూల్ ఈమెయిల్ సర్వీసు ఫీచర్ ద్వారా నేరుగా ఈమెయిల్ ను షెడ్యూల్ చేసి పంపవచ్చు. ఇప్పటివరకూ ఇలా షెడ్యూల్ ఈమెయిల్ చేయాలంటే థర్డ్ పార్టీ సర్వీసులతో చేయాల్సి వచ్చేది. ఈ సౌకర్యంతో పంపాల్సిన మెయిల్స్‌ని ముందే షెడ్యూల్‌ చేసి పెట్టుకోవచ్చు. దీంతో మెయిల్‌ కమ్యూనికేషన్‌ని మరింత పటిష్ఠం చేసుకోవచ్చు.

Actionable inbox
 

Actionable inbox

ఈ ఫీచర్ ద్వారా యూజర్లు చాలా త్వరగా మెయిల్ కి రిప్లయి ఇవ్వవచ్చు. కొత్త ట్యాబ్ ఓపెన్ చేయడం కాని అలాగే ఇన్ బాక్స్ ని వదలడం కాని చేయకుండా నేరుగానే మీరు రిప్లయి ఇవ్వవచ్చు.

 

 

 నాలుగు భాషల్లో..

నాలుగు భాషల్లో..

స్మార్ట్ కంపోజ్ ఫీచర్ లో నాలుగు కొత్త లాంగ్వేజీలను గూగుల్ అప్ డేట్ చేసింది. అందులో స్పానీష్, ఫ్రెంచ్, ఇటాలీయన్, పోర్చుగ్రీసు ఉన్నాయి.

15GB వరకు ఉచితంగా స్టోరేజీ

15GB వరకు ఉచితంగా స్టోరేజీ

బిజినెస్, పర్సనల్ జీమెయిల్స్ యూజర్లతో కలిపి మొత్తం జీమెయిల్ సర్వీసునువాడే వారిలో నెలవారీగా 1.5 బిలియన్ల (150 కోట్లు) మంది యాక్టీవ్ యూజర్లు ఉన్నారు. జీమెయిల్ వాడే ఒక్కో యూజర్ కు ప్రారంభంలో స్టోరేజీ కేపాసిటీ ఒక (One Gigabyte) గిగాబైట్ స్టోరేజీ సామర్థ్యం ఉంటుంది. ప్రస్తుతం జీమెయిల్ 15GB వరకు ఉచితంగా స్టోరేజీ అందిస్తోంది.

ఏప్రిల్ 2 నుంచి

ఏప్రిల్ 2 నుంచి

యూజర్లు 50MB వరకు ఈమెయిల్స్, అటాచ్ మెంట్స్ పొందవచ్చు. ఈమెయిల్స్ Send చేయాలంటే.. 25MB వరకు పంపుకోవచ్చు. ఒకవేళ భారీ ఫైల్స్ ను జీమెయిల్ ద్వారా పంపాలంటే మాత్రం గూగుల్ డ్రైవ్ ఉండనే ఉంది. మరోవైపు ఏప్రిల్ 2 నుంచి గూగుల్ అందించే సర్వీసుల్లో ప్రధానమైనవి గూగుల్ ప్లస్ (Google plus), Inbox by Gmail App ఈ రెండు సర్వీసులను గూగుల్ నిలిపివేయనుంది.

Best Mobiles in India

English summary
Google adds for 4 new features to Gmail on its 15th birthday

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X