Home
News

"గాడ్‌ఫాదర్‌ ఆఫ్‌ AI" గూగుల్‌కు రాజీనామా.. భవిష్యత్‌లో AI ప్రభావంపై ఆందోళన

ఆర్టిఫియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) రంగంలో వేగంగా దూసుకెళ్లాలని ప్లాన్‌ చేస్తున్న గూగుల్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. "గాడ్‌ఫాదర్ ఆఫ్‌ AI " గా పిలవబడే జియోఫ్రీ హింటన్‌ మరో ఇద్దరితో కలిసి గూగుల్‌ను విడారు. అనంతరం భవిష్యత్‌లో AI ప్రభావంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

తాజాగా ఆయన ఓ ఇంటర్య్వూలో ఏఐ టెక్నాలజీ అభివృద్ధి.. దీర్ఘకాలంలో తప్పుడు సమాచార వ్యాప్తి మరియు మానవులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన చెందారు. ఏఐ టెక్నాలజీ సాఫ్ట్‌వేర్‌ కోడింగ్ రాయడం, రన్‌ చేయడం ప్రారంభిస్తే అది చాలా మంది ఉద్యోగాలపై ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. ఏఐ.. మనుషుల కంటే తెలివైనదని, దీనిని కొంతమంది విశ్వసిస్తారని చెప్పారు.

God Father of AI Geoffrey Hinton

సుమారు దశాబ్దానికి పైగా గూగుల్‌లో పనిచేసిన హింటన్‌ తాజాగా తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఏఐ టెక్నాలజీ అభివృద్ధిలో తాను చేసిన కృషికి 2018లో హింటన్‌ టూరింగ్‌ అవార్డును గెల్చుకున్నారు. తన ఇద్దరు విద్యార్థులతో ప్రారంభించిన స్టార్టప్‌ను గూగుల్‌ కొనుగోలు చేసిన తర్వాత హింటన్‌ గూగుల్‌లో చేరాడు. హింటన్‌ విద్యార్థి ఒకరు ప్రస్తుతం ఓపెన్‌ ఏఐలో ప్రధాన శాస్త్రవేత్తగా ఉన్నారు.

తన జీవితంలో చేసిన కొంత పనికి పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నట్లు హింటన్‌ అన్నారు. తానైతే ఏదో ఒక సాకుతో ఓదార్చుకుంటానని, తాను కాకపోతే మరొకరు ఆ పనిచేసేవారని చెప్పారు. మైక్రోసాఫ్ట్‌ ఆధ్వర్యంలోని ఓపెన్ ఏఐ బింగ్ వచ్చేంత వరకు గూగుల్‌ విజయాన్ని చూసి హింటన్‌ ఎంతో సంతోషంగా ఉన్నారని ఓ కథనం పేర్కొంది. అయితే మైక్రోసాఫ్ట్‌ నూతన ఆవిష్కరణ గూగుల్‌ ప్రధాన వ్యాపారాన్ని సవాల్‌ చేసిందని చెప్పినట్లు పేర్కొంది.

అయితే ఇలాంటి పోటీని నిలువరించడం సాధ్యం కాదని హింటన్‌ తెలిపారు. ఇలాంటి పరిస్థితి నకిలీ సమాచార వ్యాప్తికి కారణం కావచ్చన్నారు. అయితే అందులో ఏది నిజమో ఎవరూ చెప్పలేదని హింటన్‌ అన్నారు.

ఏఐ సాంకేతికపై వస్తున్న ఆందోళనలపై గూగుల్ స్పందించింది. తాము బాధ్యతాయుతమైన AI అభివృద్ధికి కట్టుబడి ఉంటామని గూగుల్‌ ప్రధాన శాస్త్రవేత్త జెఫ్‌ డిన్‌ వెల్లడించారు. ఆవిష్కరణల కోసం నిరంతరం శ్రమిస్తు ఉంటామని, అదే సమయంలో అందులో తలెత్తే ప్రమాదాలను అర్థం చేసుకుంటామన్నారు.

ఏఐ అభివృద్ధిపై గూగుల్‌ చేసిన వ్యాఖ్యలపై హింటన్‌ కూడా ఇదే విధంగా స్పందించారు. గూగుల్‌ ఎంతో బాధ్యతాయుతంగా పనిచేసిందని ప్రశంసలు కురిపించారు. ఏఐ ప్రమాదాల గురించి మాట్లాడడానికి గూగుల్‌ను విడిచిపెట్టానని.. అయితే ఇది గూగుల్‌పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఆలోచించలేదని కాడ్‌ మిడ్జ్ ట్వీట్‌ చేశారు. అయితే గూగుల్ ఎంతో బాధ్యతాయుతంగా పనిచేసిందని కితాబిచ్చారు.

గత ఏడాది చివర్లో మైక్రోసాఫ్ట్‌ ఆధారిత స్టార్టప్‌ ఓపెన్‌ ఏఐ చాట్‌ జీపీటీని లాంచ్‌ చేసింది. ఇది ఏఐ సాంకేతిక రంగంలో మరో ముందడుగు అని సాంకేతిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దానికి పోటీగా ఈ సంవత్సరం మార్చి చివరలో గూగుల్‌ తన ఏఐ టూల్‌ బార్డ్‌ను లాంచ్‌ చేసింది.

గూగుల్‌ బార్డ్‌ సాఫ్ట్‌వేర్‌ కోడింగ్‌ రాయగలదని, 20 ప్రోగ్రామింగ్‌ భాషల్లో కోడింగ్‌ రాసేందుకు సాంకేతికే నిపుణులకు సాయం చేయగలదని టెక్ దిగ్గజం వెల్లడించింది. ఏఐ సాంకేతికతపై కొందరు తీవ్ర ఆందోళ వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

More from GizBot

Best Mobiles in India

English summary
God Father of AI Geoffrey Hinton resigns to Google and worried about AI in future
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X