మీ ఇంటికి ఎవరొచ్చారో తెలుసుకోవచ్చు

Posted By:

గోద్రెజ్ సెక్యూరిటీ సొల్యూషన్స్ ‘సీత్రూ 7' పేరుతో సరికొత్త వీడియో డోర్ ఫోన్‌ను ఆవిష్కరించింది. ఈ డివైస్‌ను ఇంట్లోని ల్యాండ్ లైన్ ఫోన్ కనెక్షన్‌కు అనుసంధానించటం ద్వారా ఇంటికి ఎవరు వచ్చారో తెలుసుకోవచ్చు. 7 అంగుళాల తెరను కలిగి ఉండే ఈ వీడియో డోర్ ఫోన్ ధర రూ.18,999.

 మీ ఇంటికి ఎవరొచ్చారో తెలుసుకోవచ్చు

వీడియో డోర్ ఫోన్ అమర్చిన ఇంటికి ఎవరైనా వచ్చినట్లయితే ఇంట్లో వాళ్లు ఉన్నా లేకున్నా వారి సెల్‌ఫోన్‌కు కాల్ వెళుతుంది. దీంతో వచ్చిన వారితో మాట్లాడవచ్చు. ఈ డివైస్‌ను 3 మానిటర్‌లతో పాటు సీసీ కెమెరాలకు కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంటర్‌కామ్ సదుపాయం ఉంది. ఫోన్ వద్దకు వెళ్లి మాట్లాడవల్సిన పనిలేకుండా ఫోన్‌లోని దృశ్యాలను అనుసంధానించుకున్న టీవీలో చూడవచ్చు. సందర్శకులు చిత్రాలు, వారి కదలికలను రికార్డ్ చేయవచ్చు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Godrej introduces video door phone with calling facility at Rs 18999. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot