ఈ పనిమనిషిని ఓ పట్టు పట్టాల్సిందే!

Posted By: Staff

 ఈ పనిమనిషిని ఓ పట్టు పట్టాల్సిందే!

ధగధగా మెరిసిపోతున్న ఈ వాక్యూమ్ క్లీనర్ కుబేరుల కోసమే. ఎందుకంటే..? దీని ధర రూ.5.5 కోట్లు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాక్యూమ్ క్లీనర్. గో వాక్యూమ్.కామ్ సంస్థ దీన్ని 24 కేరట్ల బంగారంతో తయారుచేసింది. ఇలాంటివాటిని ఆ సంస్థ కేవలం 100 మాత్రమే తయారుచేసింది. దీన్ని చూస్తే.. ఎంత డబ్బున్నోళ్తైనా పనోళ్లను పక్కనబెట్టి కొంతసేపైనా ఈ వాక్యూమ్ క్లీనర్‌ను చేతపట్టి ఇంటిని క్లీన్ చెయ్యాల్సిందే.

తప్పించుకునే ప్రసక్తే లేదు..?

జైలు నుంచి కరుడు గట్టిన ఖైదీ పరార్.., అధికారుల తీరు పై అనుమానాలు.. తరచూ మీడియాలో వినిపిస్తున్న కథనాలు ఇవే. జైళ్ల బధ్రతను సాంకేతికత సాయంతో మరింత కట్టుదిట్టం చేస్తూ సరికొత్త యాంత్రిక వ్యవస్థను నిపుణులు సృష్టించారు. ఖైదీల కదిలకలను అనునిత్యం మానిటర్ చేసే యాంత్రిక రోబోలను వీరు రూపొందించారు. ఈ మరమనిషిలో నిక్షిప్తం చైసిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఇంకా ఇన్-బుల్ట్ 3డి కెమెరా వ్యవస్థ కారాగార ప్రాంగణాన్ని అనువనువునా జల్లెడ పడుతుంది. దక్షిణకొరియాలోని పొహాంగ్‌లో ఈ రోబోట్ సేవలను పరీక్షిస్తున్నారు. ఆసియన్ ఫోరమ్ ఆప్ కరెక్సన్స్, మ్యానుఫాక్షర్ ఎస్ఎమ్ఈఎస్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ 5 అడుగుల రోబోట్‌ను రూపొందించారు. 3డి కెమెరా, వైర్‌లెస్ టెక్నాలజీ, హ్యూమన్ బిహేవియర్, ఎమోషన్ ట్రాకింగ్ టెక్నాలజీ వంటి పరిజ్ఞానాన్ని ఈ మర యంత్రంలో అమర్చారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting