గోల్డ్ స్మగ్లింగ్ లో కొత్త ఐడియా
దొంగలు లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేసుకుంటున్నారు. పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటూ స్మగ్లింగ్ కు పాల్పడుతున్నారు.
దొంగలు లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేసుకుంటున్నారు. పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటూ స్మగ్లింగ్ కు పాల్పడుతున్నారు. విదేశాల నుంచి బంగారం అక్రమ రవాణా చేయడం చాలా ఈజీ అంటూ తాజాగా జితేంద్ర సోలంకి అనే వ్యక్తి నిరూపించాడు.అయితే బంగారాన్ని అక్రమంగా తరలించబోయి అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన ముంబయిలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది.ఈ సంఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే...

బ్యాంకాక్ నుంచి ముంబై....
జితేంద్ర సోలంకి బ్యాంకాక్ నుంచి ముంబై విమానాశ్రయానికి మొబైల్ ఫ్లిప్‌కవర్లలో బంగారాన్ని తరలించడానికి ప్రయత్నించాడు.

2997 గ్రాముల బంగారం బిస్కెట్లను....
మొబైల్ ఫ్లిప్‌కవర్లలో ఏకంగా 2997 గ్రాముల బంగారం బిస్కెట్లను దాచిపెట్టి సెల్‌ఫోన్‌గా చూపించేందుకు యత్నించాడు. అయితే, అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు సోదాలు చేయడంతో సోలంకి ఘరానా అక్రమ రవాణా ఐడియా బయటపడింది.

బంగారం విలువ రూ.87, 51, 210....
జితేంద్ర నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.87, 51, 210 ఉంటుందని అధికారులు వెల్లడించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇలాంటి ఘటన గతంలో కూడా జరిగింది....
ఇలాంటి ఘటన గతంలో కూడా జరిగింది అయితే ఎల్‌ఈడీ లైట్ బ్యాటరీల లోపలి భాగంలో బంగారం ప్లేట్లను అమర్చి, స్కానింగ్‌కు కూడా దొరకకుండా స్మగ్లింగ్ చేసారు .

బంగారాన్ని స్మగ్లర్లు మందమైన రేకులుగా....
బంగారాన్ని స్మగ్లర్లు మందమైన రేకులుగా మార్చారు. దీన్ని రీ-చార్జబుల్ లాంతర్ లైట్ లోపల ఉండే బ్యాటరీల్లో అమర్చారు. ఆ లైట్‌ను స్కానింగ్ చేసినా గోల్డ్ ఆచూకీ దొరక్కుండా బంగారు రేకుల చుట్టూ నల్లరంగు పొడి ఏర్పాటు చేశారు. ఈ లైట్‌ను గురువారం దుబాయ్ విమానాశ్రయానికి తీసుకువచ్చిన స్మగ్లర్లు హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి అప్పగించారు. అతడికి ఎలాంటి వివరాలు చెప్పకుండా ఆ లైట్‌ను తీసుకుని హైదరాబాద్ వెళ్లాలని, అక్కడ తమ వారు వచ్చి తీసుకుంటారని పంపారు.

ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో వచ్చిన ఈ క్యారియర్....
ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో వచ్చిన ఈ క్యారియర్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అనుమానాస్పదంగా ఉన్న అతన్ని కస్టమ్స్ అధీనంలోని ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బ్యాగ్‌లో ఉన్న ఎల్‌ఈడీ లైట్‌ను పరిశీలించగా.. బ్యాటరీల తీరులో మార్పులు కనిపించాయి. వాటిని పగులగొట్టి చూడగా.. లోపల నల్లటి పొడితో కప్పి ఉంచిన బంగారం రేకులు బయటపడ్డాయి. క్యారియర్‌ను విచారించగా తనకు దాన్ని ఇచ్చిన వారితో పాటు తీసుకునే వారి వివరాలు కూడా తెలియదన్నాడు. దీని వెనుక పెద్ద రాకెట్ ఉండి ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు .


Click it and Unblock the Notifications








