జియోఫోన్ నెక్స్ట్‌ను కేవలం రూ.4,499 ధరకే పొందే సువర్ణ అవకాశం!! మిస్ అవ్వకండి...

|

రిలయన్స్ రిటైల్ సంస్థ ఇండియాలో టెలికాం రంగంలో ఊహించని అభివృద్ధి చెందిన తరువాత తన యొక్క వినియోగదారులను 4G సేవలను ఉపయోగించడానికి ప్రోత్సహించడానికి జియోఫోన్ ను కూడా తక్కువ ధరలోనే విడుదల చేసింది. అయితే దాని తరువాత దాని కొనసాగింపుగా జియోఫోన్ నెక్స్ట్‌ను విడుదల చేసింది. ఇప్పుడు ఈ జియోఫోన్ నెక్స్ట్‌ను ఎక్సచేంజ్ ఆఫర్‌లలో భాగంగా కేవలం రూ.4,499 ధర వద్దకే అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ పరిమిత కాలం వరకు మాత్రమే ఉంటాయి అని గమనించండి. ఎక్సచేంజ్ విభాగంలో పాత డివైస్ లలో 4G స్మార్ట్‌ఫోన్‌లు, ఫీచర్ ఫోన్‌లు లేదా ఇతర ఫంక్షనల్ స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించవచ్చు.

 

జియోఫోన్ నెక్స్ట్‌

ఎవరైనా వినియోగదారులు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను ఉపయోగించకపోతే కనుక వారు జియోఫోన్ నెక్స్ట్‌ను రూ.6,499 ధర వద్ద పొందవచ్చు. వినియోగదారులు నెలకు రూ.2,500 ముందస్తుగా చెల్లించే ఫైనాన్సింగ్ ఎంపికలు కూడా ఉన్నాయి. ఇందులో రూ. 501 ప్రాసెసింగ్ రుసుము కూడా ఉంటుంది. ఈ ప్లాన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

8K వీడియో స్ట్రీమింగ్ కోసం అనువైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు...8K వీడియో స్ట్రీమింగ్ కోసం అనువైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు...

జియోఫోన్ నెక్స్ట్ స్పెసిఫికేషన్స్
 

జియోఫోన్ నెక్స్ట్ స్పెసిఫికేషన్స్

జియోఫోన్ నెక్స్ట్ స్మార్ట్‌ఫోన్ బడ్జెట్ విభాగంలో లభిస్తూ 'వాయిస్ అసిస్టెంట్', 'రీడ్ అలౌడ్' మరియు 'ట్రాన్స్‌లేట్' వంటి వాటికి మద్దతుగా వస్తుంది. ఈ బడ్జెట్ 4G స్మార్ట్‌ఫోన్ 5.45-అంగుళాల మల్టీటచ్ HD+ (720×1440 పిక్సెల్‌లు) డిస్‌ప్లేతో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో వస్తుంది. ఇది డ్యూయల్ 4G సిమ్ స్లాట్ లను కలిగి ఉండి 3500mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే 13MP సెన్సార్‌తో వెనుక భాగంలో ఒకే ఒక సింగిల్ కెమెరాను మరియు ముందు భాగంలో సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం 8MP సెన్సార్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

ఐఫోన్ SE 3ని పాత ఐఫోన్ మోడల్ ధరకే రూ.16,000 తగ్గింపుతో ఫ్లిప్‌కార్ట్లో పొందవచ్చు!! కానీ...ఐఫోన్ SE 3ని పాత ఐఫోన్ మోడల్ ధరకే రూ.16,000 తగ్గింపుతో ఫ్లిప్‌కార్ట్లో పొందవచ్చు!! కానీ...

జియోఫోన్ నెక్స్ట్ స్మార్ట్‌ఫోన్

జియోఫోన్ నెక్స్ట్ స్మార్ట్‌ఫోన్ యొక్క ముఖ్యామైన అంశాలలో ఒకటి దాని యొక్క OS. ప్రగతి OS అనే పేరుతో లభించే ఇది భారతీయ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని భారతదేశంలో అభివృద్ధి చేయబడింది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 215 SoCతో పాటు 2GB వరకు RAM మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందించబడింది. JioPhone నెక్స్ట్ వినియోగదారులు మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజీని 512GB వరకు విస్తరించుకోవడానికి అనుమతిస్తుంది. జియోఫోన్ నెక్స్ట్ స్మార్ట్‌ఫోన్ ఇండియాలో గత ఏడాది చివర్లో ప్రారంభించబడింది. దాని అధిక ధర కారణంగా విశ్లేషకులను మరియు వినియోగదారులను పెద్దగా ఆకట్టుకోలేదు. కాలింగ్ మరియు డేటా ప్లాన్‌లతో కూడిన ఫైనాన్సింగ్ ఎంపికలు స్మార్ట్‌ఫోన్ ధరను రూ.14,000 స్థాయిలకు తీసుకువెళ్లాయి. ఇది ఏ విధంగానూ సరసమైనది కాదు. ఈ స్మార్ట్‌ఫోన్‌ 10 భాషల సపోర్ట్‌తో పాటు ట్రాన్స్‌లేట్ నౌ, నియర్ బై షేర్ మరియు రీడ్ ఎలౌడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంకా, బ్లూటూత్ 4.1, డ్యూయల్-సిమ్ సపోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, Wi-Fi మరియు మైక్రో-USB పోర్ట్‌తో సహా కనెక్టివిటీ ఫీచర్‌లతో వస్తుంది. 3500mAh బ్యాటరీ ఛార్జింగ్ మద్దతుతో స్మార్ట్‌ఫోన్‌కు శక్తినిస్తుంది.

Best Mobiles in India

English summary
Golden Opportunity to Get Jiophone Next Phone Smartphone at Rs.4,499 on Exchange Offers

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X