Home
News

అదిరిపోయే న్యూస్.. గంటల రీసెర్చ్‌ని నిమిషాల్లో పూర్తి చేసెయ్యొచ్చు.. ‘చాట్‌జీపీటీ డీప్ రీసెర్చ్’ టూల్ వచ్చేసిం

ChatGPT Deep Research: రీసెర్చ్ చేయడం మీ పనా? అయితే ఇకపై సమాచారం కోసం గంటల తరబడి వెతకక్కర్లేదు. ఓపెన్ఏఐ సరికొత్త ఫీచర్‌తో మీ ముందుకొచ్చింది. దాని పేరే 'డీప్ రీసెర్చ్'. ఇది చాట్‌జీపీటీ లేటెస్ట్ టెక్నాలజీ. పేరుకు తగ్గట్టే ఇది లోతుగా రీసెర్చ్ చేసి రిపోర్టులు రెడీ చేస్తుంది. ఒక రీసెర్చ్ అనలిస్ట్ ఎలాగైతే పనిచేస్తారో, అచ్చం అలానే ఈ టూల్ కూడా పనిచేస్తుంది. వందల కొద్దీ ఆన్‌లైన్ సోర్స్‌లను క్షణాల్లో జల్లెడ పడుతుంది.

అడిగిన ప్రశ్నకు నిమిషాల్లోనే సమాధానం ఇస్తుంది. వెబ్‌సైట్లలోనే కాదు, పీడీఎఫ్‌లు, స్ప్రెడ్‌షీట్లు వంటి ఫైళ్లను కూడా అప్‌లోడ్ చేసి విశ్లేషించగలదు. ప్రశ్న అడిగిన వెంటనే, చాట్‌జీపీటీ తన పని మొదలుపెడుతుంది. 5-30 నిమిషాల్లో రీసెర్చ్ చేసి మీకు రిపోర్ట్ ఇస్తుంది. అంతేకాదు, పక్కనే ఒక ప్యానెల్‌లో అది ఏయే సోర్స్‌లను వాడుతుందో కూడా చూపిస్తుంది.

Good News  ChatGPT s Deep Research Tool Lets You Research Hundreds of Online Sources in Minutes

* కొత్త జ్ఞానం కోసం డీప్ రీసెర్చ్..

ఈ డీప్ రీసెర్చ్ ముఖ్య ఉద్దేశం సమాచారాన్ని చాలా త్వరగా సేకరించడమే. దీని ద్వారా కొత్త విషయాలను కూడా కనుక్కోవచ్చు అంటున్నారు నిపుణులు. ఓపెన్ఏఐ చీఫ్ రీసెర్చ్ ఆఫీసర్ మార్క్ చెన్ మాట్లాడుతూ.. "మా కంపెనీ లక్ష్యం ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI)ని సృష్టించడం." అని అన్నారు.

"ఈ డీప్ రీసెర్చ్ ఆ దిశగా ఒక ముందడుగు. ఇది సొంతంగా కొత్త విషయాలను తెలుసుకోగలదు" అని చెప్పారు. అయితే ఈ టూల్‌లో కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. ఒక్కోసారి చాట్‌జీపీటీ తప్పులు చేయొచ్చు. తప్పుడు సమాచారం ఇవ్వడం, నిజమైన ఫాక్ట్‌లకు, రూమర్లకు మధ్య తేడాను గుర్తించలేకపోవడం వంటి సమస్యలు ఉండొచ్చు.

కొన్నిసార్లు ఫార్మాటింగ్ కూడా సరిగ్గా ఉండకపోవచ్చు. అయితే, భయపడాల్సిన అవసరం లేదు. ఈ టూల్‌ను ఎక్కువ మంది వాడే కొద్దీ ఈ సమస్యలన్నీ మెరుగుపడతాయని ఓపెన్ఏఐ సంస్థ చెబుతోంది. ఇప్పుడే ఈ టూల్ వాడాలనుకుంటే డీప్ రీసెర్చ్ టూల్ ఇచ్చిన సమాచారాన్ని ఒకటికి రెండుసార్లు మానువల్ గా చెక్ చేసుకోవాలి.

* గూగుల్ జెమినీ అడ్వాన్స్‌డ్‌ vs చాట్‌జీపీటీ డీప్ రీసెర్చ్

ఇలాంటి ఫీచర్‌నే గూగుల్ కూడా అందిస్తోంది. దాని పేరు జెమిని అడ్వాన్స్‌డ్. ఇది కూడా AI టూల్. రీసెర్చ్ చేయడం, సమాచారాన్ని విశ్లేషించడం వంటి పనులు చేస్తుంది. గూగుల్ దీని కోసం నెలకు 20 డాలర్ల (దాదాపు రూ.1,742) సబ్‌స్క్రిప్షన్ ఛార్జ్ చేస్తోంది. కానీ, ఓపెన్ఏఐ డీప్ రీసెర్చ్ కోసం నెలకు ఏకంగా 200 డాలర్లు (సుమారు రూ.17,426) వసూలు చేస్తోంది.

ఎందుకంత తేడా అంటే.. ఈ రీసెర్చ్ ప్రాసెస్ చాలా కంప్యూటింగ్-ఇంటెన్సివ్ అట. అంటే, ఇది సమర్థవంతంగా పనిచేయడానికి చాలా రిసోర్స్‌లు కావాలి. అందుకే ఓపెన్ఏఐ యూజర్లకు నెలకు 100 ప్రశ్నల లిమిట్ పెట్టింది. వీటిలో ఏది ఎంచుకోవాలనేది వారి అవసరాలు, బడ్జెట్‌ను బట్టి ఆధారపడి ఉంటుంది.

* త్వరలో తక్కువ ధరకే డీప్ రీసెర్చ్..

గుడ్ న్యూస్ ఏంటంటే.. ఓపెన్AI డీప్ రీసెర్చ్ చౌకైన వెర్షన్‌ను కూడా తీసుకొస్తోంది. దీని కోసం చిన్న మోడల్‌ను ఉపయోగిస్తారు. దీనివల్ల ఖర్చులు తగ్గుతాయి. అప్పుడు యూజర్లు ఎక్కువ ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. సేఫ్టీ టెస్టింగ్ తర్వాత, వచ్చే నెలలో చాట్‌జీపీటీ ప్లస్ యూజర్లకు కూడా ఈ టూల్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.

అయితే, యూకే, స్విట్జర్లాండ్, యూరోపియన్ ఎకనామిక్ ఏరియా (EEA)లోని యూజర్లు మాత్రం కొంచెం వెయిట్ చేయాలి. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో ఈ టూల్ ఇంకా అందుబాటులో లేదు. భారతీయులకు కూడా ఇది త్వరలో అందుబాటులోకి రావచ్చు. దీని సహాయంతో ఏ టాపిక్ పైనైనా రీసెర్చ్ చేసి పూర్తి స్థాయిలో జ్ఞానాన్ని పెంచుకోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
ChatGPT launched Deep Research, an AI tool that analyzes hundreds of online sources in minutes to generate reports. It saves time, uncovers knowledge, and aims for AGI. Currently expensive, a cheaper version is coming soon.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X