ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. టోల్ ట్యాక్స్ కష్టాలు ఇక మర్చిపోవచ్చు.. కొత్త స్మార్ట్ కార్డులు వచ్చేస్తున్నాయ్!
Smart cards for tolls: జాతీయ రహదారులపై రోజూ ప్రయాణించే వారికి అదిరిపోయే శుభవార్త. టోల్ గేట్ల దగ్గర చెల్లింపులు సులువుగా, వేగంగా జరిగిపోయేలా కేంద్ర ప్రభుత్వం సరికొత్త ప్లాన్ తీసుకొస్తోంది. అదేంటంటే, నెలవారీ టోల్ ట్యాక్స్ స్మార్ట్ కార్డు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ ఆలోచనను సమర్థిస్తున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే, ఈ పథకం త్వరలోనే దేశవ్యాప్తంగా ప్రారంభం కానుంది. అంటే టోల్ గేట్ల దగ్గర గంటల తరబడి వెయిట్ చేసే కష్టాలకు చెక్ పెట్టొచ్చు.
* ఈ స్మార్ట్ కార్డు ఎలా పనిచేస్తుంది
రిపోర్ట్స్ ప్రకారం, ఈ కొత్త స్మార్ట్ కార్డు దేశంలోని అన్ని టోల్ బూత్‌లలోనూ చెల్లుబాటు అవుతుంది. అంతేకాదు, ఈ కార్డు ఉన్నవాళ్లకు టోల్ ఛార్జీలలో డిస్కౌంట్లు కూడా లభిస్తాయట. అంటే ప్రయాణాలు మరింత చౌకగా మారతాయన్నమాట. హైవేలపై నిత్యం తిరిగే కమర్షియల్ వెహికల్స్ వాళ్లకు ఈ కార్డు నిజంగా చాలా ఉపయోగపడుతుంది.

అయితే, కార్డు లేనివాళ్లు మామూలు టోల్ ఫీజులే కట్టాలా లేక వాళ్లకి కూడా ఏమైనా డిస్కౌంట్లు ఉంటాయా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. మంత్లీ టోల్ ట్యాక్స్ స్మార్ట్ కార్డు అందుబాటులోకి వస్తే అందరూ వాటికి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. ఉన్న కొంతమంది కోసం డిస్కౌంట్లు ఇవ్వకపోవచ్చు, ఎప్పుడో ఒకసారి ప్రయాణించేవారికి భారం.
* స్మార్ట్ కార్డుతో బోలెడు లాభాలు..
నిపుణుల ప్రకారం, ఈ స్మార్ట్ కార్డు సిస్టమ్ రెగ్యులర్‌గా ప్రయాణం చేసేవాళ్ల లైఫ్‌స్టైల్‌నే మార్చేస్తుంది. దీనివల్ల చాలా ఉపయోగాలున్నాయి. టోల్ గేట్ల దగ్గర క్యూలు తగ్గిపోతాయి, పేమెంట్లు ఈజీగా చేసుకోవచ్చు. కమర్షియల్ వెహికల్స్ వాళ్లకు లాంగ్ రూట్లలో డబ్బులు బాగా ఆదా అవుతాయి. రోజువారీ ప్రయాణికులకు డిస్కౌంట్లు వస్తాయి కాబట్టి, టోల్ ట్యాక్స్ భారమూ తగ్గుతుంది.
* ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూపులు..
ప్రస్తుతం ప్రభుత్వం ఈ ప్లాన్‌పై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఒకసారి గ్రీన్ సిగ్నల్ వచ్చేస్తే, కోట్లాది మంది ప్రయాణికులకు టోల్ ట్యాక్స్ కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. స్మార్ట్ కార్డులు అందుబాటులోకి వస్తే టోల్ గేట్ల దగ్గర సీన్ మారిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
* జీఎన్‌ఎస్‌ఎస్ టెక్నాలజీతో టోల్ వసూల్
కేంద్ర ప్రభుత్వం మరో అదిరిపోయే టెక్నాలజీతో కూడా టోల్ వసూలు చేయాలని చూస్తోంది. అదే గ్లోబల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (GNSS). ఈ సిస్టమ్ ద్వారా వెహికల్స్‌ను ట్రాక్ చేసి, హైవేలపై ఎంత దూరం ప్రయాణిస్తే అంత టోల్ ఛార్జ్ చేస్తారు. అంటే, మీరు ఎంత దూరం వెళ్తే అంత డబ్బులే కట్టాలి.
* జీఎన్‌ఎస్‌ఎస్‌లోనూ స్మార్ట్ కార్డు ఫీచర్..
దేశవ్యాప్తంగా GNSS సిస్టమ్ పూర్తిగా అమలు చేయడానికి టైమ్ పడుతుందని NHAI అధికారులు చెబుతున్నారు. ఈ సిస్టమ్‌లో వెహికల్స్‌కు ఒక చిన్న డివైజ్ పెడతారు. అది టోల్ ఛార్జీలను ఆటోమేటిక్‌గా లెక్కిస్తుంది. అంతేకాదు, GNSS సిస్టమ్‌లో కూడా స్మార్ట్ కార్డు ఫీచర్ ఉంటుందట. అంటే రెగ్యులర్‌గా ప్రయాణించేవాళ్లు నెలవారీ పాస్‌లు కూడా తీసుకోవచ్చు.
* స్మార్ట్ కార్డుతో అందరికీ ప్రయోజనం
స్మార్ట్ కార్డు లేనివాళ్లు పాత పద్ధతిలోనే టోల్ కట్టాలా లేక వాళ్లకు కూడా ఏమైనా డిస్కౌంట్స్ ఇస్తారా అనే విషయంపై రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కానీ, రెగ్యులర్‌గా హైవేలపై తిరిగేవాళ్లకు మాత్రం ఈ స్కీమ్ ద్వారా టోల్ ట్యాక్స్ విషయంలో పెద్ద రిలీఫ్ రావడం ఖాయం.


Click it and Unblock the Notifications








