UPI యూజర్లకు గుడ్ న్యూస్!! ఆన్‌లైన్ పేమెంట్లకు క్రెడిట్ కార్డ్‌లను లింక్ చేయవచ్చు...

|

ప్రస్తుత ఫాస్ట్ ప్రపంచంలో ఆన్‌లైన్ ద్వారా పేమెంట్స్ చేయడం అధికమవుతున్నది. ముఖ్యంగా UPI ఆధారిత పేమెంట్స్ అధికమవుతున్నది. అయితే ఇప్పుడు వినియోగదారులు తమ UPI అకౌంటులో క్రెడిట్ కార్డ్‌లతో కూడా లింక్ చేయగలరని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ప్రస్తుతం వినియోగదారులు తమ డెబిట్ కార్డ్‌లను ఉపయోగించి UPIతో తమ సేవింగ్స్ మరియు కరెంట్ అకౌంటులను మాత్రమే లింక్ చేయగలరు. UPIని ప్రవేశపెట్టిన తర్వాత అకౌంటుకు క్రెడిట్ కార్డ్‌ను లింక్ చేసే ఎంపిక అందుబాటులోకి రావడంతో UPI ట్యాంకింగ్‌లో ఉన్న క్రెడిట్ కార్డ్ లావాదేవీలకు కూడా ప్రోత్సాహాన్ని అందిస్తుంది. అయితే RBI ప్రారంభంలో రూపే క్రెడిట్ కార్డ్‌లను మాత్రమే UPI అకౌంటులకు లింక్ చేయడానికి అనుమతిస్తుంది. దీనికి సంబందించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

RBI

ఆన్‌లైన్ పేమెంట్స్ యొక్క అభివృద్ధి మరియు నియంత్రణ విధానాలపై RBI ఒక కీలక ప్రకటనను విడుదల చేసింది. ఒక ప్రకటనలో భాగంగా RBI ఇలా పేర్కొంది "PPIల ఇంటర్‌ఆపరేబిలిటీ లావాదేవీలను చేపట్టడానికి UPI పేమెంట్ వ్యవస్థకు PPIల యాక్సెస్‌ను కూడా సులభతరం చేసింది. రీచ్ మరియు యూసేజ్ ని మరింత మెరుగుపరచడానికి UPIకి క్రెడిట్ కార్డ్‌లను లింక్ చేయడానికి అనుమతించాలని ప్రతిపాదించబడింది. రూపే క్రెడిట్ కార్డ్‌లతో ముందుగా ఈ సదుపాయంను ప్రారంభించబడుతుంది. ఈ ఏర్పాటు UPI ప్లాట్‌ఫారమ్ ద్వారా పేమెంట్స్ చేయడంలో వినియోగదారులకు మరిన్ని మార్గాలను మరియు సౌకర్యాన్ని అందిస్తుంది.

సిస్టమ్ డెవలప్‌మెంట్
 

అవసరమైన సిస్టమ్ డెవలప్‌మెంట్ పూర్తయిన తర్వాత కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తామని ఆర్‌బిఐ ప్రకటించింది. అలాగే అవసరమైన అన్ని రకాల సూచనలను NPCI కి విడిగా జారీ చేస్తామని కూడా సెంట్రల్ బ్యాంక్ హామీ ఇచ్చింది. క్రెడిట్ కార్డ్‌లను పరిచయం చేయడం వల్ల వినియోగదారులు తమ క్రెడిట్ లైన్‌ను అవసరమైనప్పుడు ట్యాప్ చేయడానికి అనుమతిస్తుంది. RBI క్రెడిట్ కార్డ్‌ల మద్దతును రూపే కార్డులతో పాటుగా ముందు ముందు వీసా మరియు మాస్టర్ కార్డ్‌లకు కూడా విస్తరిస్తుందని భావిస్తున్నారు. అయితే దీనికి ఇంకా అధికారిక ధృవీకరణ లేదు.

Samsung గెలాక్సీ డివైస్ల కోసం వన్ UI 4.1.1 కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌!! త్వరలో అందుబాటులోకి...Samsung గెలాక్సీ డివైస్ల కోసం వన్ UI 4.1.1 కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌!! త్వరలో అందుబాటులోకి...

UPI ప్లాట్‌ఫారమ్‌

ప్రస్తుతం దాదాపుగా 26 కోట్ల మంది వినియోగదారులు UPI అకౌంటును కలిగి ఉన్నారు. RBI అందించిన తాజా డేటా ప్రకారం UPI ప్లాట్‌ఫారమ్‌లో 5 కోట్ల మంది వ్యాపారులు ఆన్‌బోర్డ్ చేయబడ్డారు. మే 2022 వరకు UPI ద్వారా సుమారు ₹10.40 లక్షల కోట్ల విలువైన 594.63 కోట్ల లావాదేవీలు ప్రాసెస్ చేయబడ్డాయి. వాట్సాప్ సహాయంతో UPI కూడా తన పరిధిని విస్తరిస్తోంది. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఇన్‌స్టంట్ మెసేజింగ్ అప్లికేషన్ ఇప్పుడు UPI పేమెంట్లకు మద్దతును ఇస్తుంది. వినియోగదారులు మెసేజ్లు పంపినంత సులభంగా చాట్ ద్వారా డబ్బును పంపవచ్చు లేదా స్వీకరించవచ్చు.

UPI పేమెంట్స్ చేసేటప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన కొన్ని ప్రాథమిక విషయాలు

UPI పేమెంట్స్ చేసేటప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన కొన్ని ప్రాథమిక విషయాలు

** అపరిచితుల వద్ద ఎట్టిపరిస్థితులలోనూ మీ పిన్‌ను బహిర్గతం చేయరాదు.

** యాంటీ-వైరస్ మరియు బయోమెట్రిక్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసి ఉంచండి.

** తెలియని సోర్స్ నుండి వచ్చే ఇమెయిల్‌లు లేదా లింక్‌లను ఓపెన్ చేయకపోవడం అన్ని వేళల మంచిది.

** మీ వివరాలను మీ బ్యాంక్‌తో ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవడం ఉత్తమం.

** పేమెంట్ చేస్తున్న సమయంలో మీరు విశ్వసించే సురక్షిత WiFi కనెక్షన్‌లను మాత్రమే ఉపయోగించండి.

** మీ ఆర్థిక లావాదేవీలు మరియు బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్‌లను ట్రాక్ చేస్తూ మీ అకౌంటులో అనుమానాస్పద ప్రవర్తనపై నిఘా ఉంచండి.

 

Best Mobiles in India

English summary
Good News For UPI Users: RBI Allows Linked Credit Cards UPI Payments

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X