జీవితాంతం జియో కాల్స్ ఉచితం.?, తెర వెనక భారీ ప్లాన్

జియో ఆఫర్ చేస్తున్న ఉచిత కాల్స్ అలానే ఉచిత డేటా గతకొద్ది రోజులుగా దేశ టెలికం మార్కెట్లో పెను సంచలనం రేపుతున్నాయి. జియో రాకతో ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా, బీఎస్ఎన్ఎల్ వంటి కంపెనీలు దిగిరాక తప్పలేదు.

జీవితాంతం జియో కాల్స్ ఉచితం.?, తెర వెనక భారీ ప్లాన్

Read More : జియో 4జీని ఏడాది పాటు ఉచితంగా పొందటం ఎలా..?

జియోను ధీటుగా ఎదుర్కొనే క్రమంలో ఈ ఆకర్షణీయమైన డేటా ప్యాక్‌లను మార్కెట్లో ఆఫర్ చేస్తున్నాయి. ప్రస్తుత ఇంటర్‌కనెక్ట్ యూసేజ్ ఛార్జీలు విలువ కాల్‌కు 14 పైసులుగా ఉండగా కస్టమర్‌లకు ఉచిత కాల్స్ ఎలా ఆఫర్ చేస్తున్నారని ట్రాయ్ ఇటీవల జియోను ప్రశ్నించింది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వ్యాపార ఎత్తుగడలో భాగంగా..

జియో తన వ్యాపార ఎత్తుగడలో భాగంగా యూజర్లకు మరింత చేరువయ్యే క్రమంలో ఇంటర్‌కనెక్ట్ యూసేజ్ ఛార్జీలను భరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

డిజిటల్ ఇకోసిస్టం..

భారత్‌లో పూర్తిస్థాయి డిజిటల్ ఇకోసిస్టంను నెలకొల్పేందుకు తొలి ప్రయత్నంలో భాగంగా ఉచిత కాల్స్‌తో పాటు ఉచిత 4జీ డేటాను జియో అందించే ప్రయత్నం చేస్తోంది.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

భవిష్యత్‌లో మరిన్ని ఆవిష్కరణలు..

రిలయన్స్ జియో తన డిజిటల్ ఇకో సిస్టంకు ఒక విజన్‌ను తీసుకువచ్చే క్రమంలో
భవిష్యత్‌లో మరిన్ని ఆవిష్కరణలకు అందుబాటులోకి తీసుకురాబోతున్న పలు విప్లవాత్మక ఆవిష్కరణల వివరాలను ఇప్పుడు చూద్దాం.

సాధారణ కారును స్మార్ట్ కారులా మార్చేసే వ్యవస్థ..

ఓ సాధారణ కారును స్మార్ట్ కారులా మార్చేసే సొల్యూషన్స్ తన డిజిటల్ ఇకో సిస్టంలో భాగంగా రిలయన్స్ జియో అందుబాటులోకి తీసుకువచ్చే అవాకశం ఉంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆన్ ద బోర్డ్ డయగ్నస్టిక్..

రానున్న నెలల్లో రిలయన్స్ జియో ఆన్ ద బోర్డ్ డయగ్నస్టిక్ ఆధారిత డివైస్‌ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. హాట్ స్పాట్‌లా వ్యవహిరించే ఈ డివైస్ ఏక కాలంలో 10 డివైస్‌లకు ఇంటర్నెట్‌ను సమకూరుస్తుంది.

జియో కార్‌కనెక్ట్ మొబైల్ యాప్‌

ఆన్ ద బోర్డ్ డయగ్నస్టిక్‌తో పాటుగా జియో కార్‌కనెక్ట్ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ యాప్ ద్వారా కారు ఓనర్లు కారుకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని రియల్ టైమ్‌లో పొందవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రిమోట్ లోకేషన్.. ట్రాకర్..

ఈ యాప్ ద్వారా రిమోట్ లోకేషన్, ట్రాకర్, రిమోట్ లాక్ - అన్‌లాక్, పవర్ విండోస్, హెడ్‌లైట్ ఆన్-ఆఫ్ వంటి ఫీచర్లను ఎనేబుల్ చేసుకోవచ్చు.

డిజిటల్ స్మార్ట్‌హోమ్

వీటితో పాటు జియో డిజిటల్ స్మార్ట్‌హోమ్ సొల్యూషన్‌లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. హెల్త్, ఎడ్యుకేషన్, ఎంటర్‌టైన్‌మెంట్ విభాగాల్లో కూడా విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చేందుకు జియో సన్నాహాలు చేస్తుంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Good News for Jio Users: Calls Will Remain Free for Life. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot