SBI అకౌంట్ ఉన్నవారికి శుభవార్త దసరా కానుకగా మీకోసం బంపర్ ఆఫర్లు
ఈ దసరా పండుగ సంధర్బంగా తన ఖాతా వినియోగదారులకి మరింత దగ్గరయ్యిందుకు స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా డిజిటల్ వేదికను మార్గంగా చేసుకున్నది.
ఈ దసరా పండుగ సంధర్బంగా తన ఖాతా వినియోగదారులకి మరింత దగ్గరయ్యిందుకు స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా డిజిటల్ వేదికను మార్గంగా చేసుకున్నది. ఈ పండుగల సీజన్‌లో డిజిటల్ వేదిక 'Yono ' యాప్ ద్వారా కొనుగోళ్లు జరిపే వినియోగదారులకు స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా అదనపు రాయితీలు, క్యాష్ బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది.

Yono యాప్...
గతేడాది నవంబర్ నెలలో బ్యాంక్ ‘Yono ' యాప్ సేవలను ప్రారంభించింది. యువతరానికి ఈ యాప్ ఎంతో ఆకర్షణీయంగా మారింది. ప్రస్తుతం 30 లక్షల మంది కస్టమర్లు గల Yono యాప్ లో ప్రతి రోజూ 25 వేల మంది వినియోగదారులు చేరుతున్నారని స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ పీకే గుప్తా వివరించారు.

85 ఈ -కామర్స్ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి...
ఈ యాప్‌తో 85 ఈ -కామర్స్ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. కాగిత రహిత బ్యాంకింగ్ సేవలతో పాటు పెట్టుబడులు, ఫైనాన్షియల్ ఉత్పత్తుల కొనుగోళ్లపై వినియోగదారులకు యోనో యాప్ సేవలందిస్తుంది.డిజిటల్ షాపింగ్ వేడుకను అందిస్తున్న తొలి బ్యాంకు తమదేనని ఎస్బీఐ తెలిపింది. క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా అక్టోబర్ 16-21 వరకు కొనుగోళ్లు జరిగే వినియోగదారులకు సంస్థ 10 శాతం వరకు రాయితీ, క్యాష్‌బ్యాక్ అందిస్తామని తెలిపింది.

Yono యాప్ ద్వారా 14 ఈ-కామర్స్ సంస్థల్లో కొనుగోళ్లు జరుపవచ్చు....
Yono ద్వారా 14 ఈ-కామర్స్ సంస్థల్లో కొనుగోళ్లు జరుప వచ్చునని ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ పీకే గుప్తా తెలిపారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ పవర్డ్ మొబైల్ ఫోన్లలో యోనో యాప్ అందుబాటులోకి వస్తుంది. ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, బహుమతులు, నగలు, ఫర్నీచర్, ట్రావెల్, హాస్పిటాలిటీ వంటి రంగాల్లో ఆఫర్లు లభిస్తాయి.

ఈ- కామర్స్ బిజినెస్...
అమెజాన్, జబాంగ్, మింత్రా, కల్యాన్, క్యారట్‌లేన్, పీసీజే, పెప్పర్‌ఫ్లై, ఓయో, టాటాక్లిక్, యాత్ర, ఈజ్‌మైట్రిప్, ఫస్ట్‌క్రై, ఐజీపీ, ఫెర్న్స్ అండ్ పెటల్స్ వంటి టాప్ డిజిటల్ మార్కెట్ వేదికల్లో వినియోగదారులు యోనో షాపింగ్ ఫెస్టివల్ ఆఫర్లు పొందొచ్చు.


Click it and Unblock the Notifications








