'గూగుల్ ప్లస్' కొత్త రూపం సూపర్..!

Posted By: Staff

'గూగుల్ ప్లస్' కొత్త రూపం సూపర్..!

 

మీరు గనుక రోజూ సోషల్ మీడియాని రెగ్యులర్‌గా ఉపయోగిస్తున్నట్లైతే సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ ప్లస్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'గూగుల్ ప్లస్' లో మార్పుని గమనించే ఉంటారు. గూగుల్ ప్లస్‌లో వచ్చిన మార్పులు ఏంటనీ అనుకుంటున్నారా... గూగుల్ ప్లస్ షేరింగ్ బటన్. గతంలో మీరు గనుక చూసినట్లైతే బ్లూ, తెలుపు ప్లస్ బటన్‌ని ఇప్పుడు పూర్తిగా... ఎరుపు రంగులోకి మారిపోయింది. క్రిందనున్న చిత్రంలో ఈ మార్పుని మీరు గమనించవచ్చు.

ఈ విషయాన్ని డెవలపర్స్ బ్లాగులో గూగుల్ అధికారకంగా తెలిపింది. సోషల్ మీడియాలో ఎప్పుడైతే మీరు గూగుల్ ప్లస్ బటన్‌పై క్లిక్ చేయగానే బటన్ ఎరుపు కలర్‌ని సంతరించుకుంటుంది. సొంతంగా బ్లాగులు, వెబ్ సైట్స్ కలిగిన వినియోగదారులు కొత్త గూగుల్ ప్లస్ బటన్‌ని ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలోనని వర్రీ కావాల్సిన కావాల్సిన పని లేదు.  ఈ మార్పులు ఆటోమ్యాటిక్‌గా అప్ గ్రేడ్ అవుతాయి. 'గూగుల్ కాన్పిగరేషన్ టూల్(http://www.google.com/webmasters/+1/button/)' లో వివిధ గూగుల్ ప్లస్ బటన్స్‌ని మీరు చూడొచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot