ప్రారంభమైన గూగుల్ రెండవ ఎడిషన్ ఆన్‌లైన్ షాపింగ్ ఫెస్టివల్

|

ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ తన రెండవ ఎడిషన్ గ్రేట్ ఆన్‌లైన్ షాపింగ్ ఫెస్టివల్ (జీఎస్ఓఎఫ్)ను బుధవారం ప్రారంభించింది. 72 గంటలు అంటే మూడు రోజుల పాటు సాగే ఈ ఫెస్టివల్‌లో ఇండియాకు చెందిన ప్రముఖ ఇ-కామర్స్ సంస్థలు ఒకే చోటకు చేరి తమ ఉత్పత్తులను ప్రత్యేక రాయితీల పై విక్రయించటం జరుగుతుంది.

ప్రారంభమైన గూగుల్ రెండవ ఎడిషన్ ఆన్‌లైన్ షాపింగ్ ఫెస్టివల్

డిసెంబర్ 11 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించే ఈ మెగా ఫెస్టివల్‌లో 2 కోట్ల మంది భారతీయులు ఇంటర్నెట్ ద్వారా షాపింగ్ చేసే అవకాశముందని గూగుల్ ఇండియా భావిస్తోంది. మొదటి ఎడిషన్ గ్రేట్ ఆన్‌లైన్ షాపింగ్ ఫెస్టివల్‌కు నెటిజనుల నుంచి అనూహ్యమైన స్పందన లభించిందని, రెండవ ఎడిషన్ గ్రేట్ ఆన్‌లైన్ షాపింగ్ ఫెస్టివల్ మెగా షాపింగ్ బొనాంజాతో స్వాగతం పలుకుతొందని గూగుల్ ఇండియా వైస్ పెసిడెంట్ ఇంకా మేనేజింగ్ డైరెక్టర్ రాజన్ ఆనందన్ తెలిపారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఈ రెండవ ఎడిషన్ గ్రేట్ ఆన్‌లైన్ షాపింగ్ ఫెస్టివల్‌లో భాగంగా అన్ని విభాగాలకు చెందిన 200 ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లు తమ ఉత్పత్తులను 20 నుంచి 80 శాతం వరకు రాయితీతో విక్రయిస్తాయి. టెక్నాలజీ, ఫ్యాషన్, ఫర్నిచర్, బ్యూటీ, హెల్త్ తదితర విభాగాలకు సంబంధించిన ఉత్పత్తులు ఇక్కడ ప్రత్యేక రాయితీ పై లభ్యమవుతాయి. నెటిజనులు ఈ షాపింగ్ ఫెస్టివల్‌‍లో పాల్గోని వివిధ బ్రాండ్‌‍లు స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్‌లు ఇంకా ల్యాప్‌టాప్‌లను ప్రత్యేక రాయితీ పై సొంతం చేసుకోవచ్చు.

గూగుల్ రెండవ ఎడిషన్ గ్రేట్ ఆన్‌లైన్ షాపింగ్ ఫెస్టివల్ (జీఎస్ఓఎఫ్)లోకి వెళ్లేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X