జీమెయిల్‌ను బ్లాక్ చేయడం వల్ల చైనాని నిందిస్తున్న గూగుల్ కంపెనీ

By Super
|
జీమెయిల్‌ను బ్లాక్ చేయడం వల్ల చైనాని నిందిస్తున్న గూగుల్ కంపెనీ
బిజీంగ్: ప్రపంచంలో కెల్లా అత్యంత పవర్ పుల్ సెర్చ్ ఇంజన్ గూగుల్‌ని చైనీస్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ బ్లాక్ చేయడం పట్ల్ గూగుల్ కంపెనీ చైనాని నిందిస్తుంది. ఇది మాత్రమే కాకుండా గూగుల్‌కి బాగా పాపులర్ అయినటువంటి జిమెయిల్‌ని కూడా చైనా నిలిపివేయడం జరిగింది. దీంతో గూగుల్ కంపెనీకి సంబంధించినటువంటి అపీషియల్స్ కోంతమంది దీనిపై స్పందించారు. చైనా ప్రభుత్వం జీమెయిల్‌ని చైనాలో ఉన్నటువంటి యూజర్స్ కు యాక్సెస్‌ చేయకుండా ఉండేవిధంగా కొన్ని ప్రాబ్లమ్స్‌ని క్రియేట్ చేస్తుందని ఆరోపించారు.

చైనాలో ఉన్నటువంటి యూజర్స్ యాక్సెస్ చేయలేకపోవడంతో మా వైపు ఏమైనా టెక్నికల్ ఇష్యూలు ఏమైనా ఉన్నాయోమోనని చెక్ చేయడం కూడా జరిగింది. కానీ మా వైపు నుండి ఎటువంటి టెక్నకల్ ఇష్యూ లేనప్పటికీ, చైనా ప్రభుత్వం కావాలనే దీనిని బ్లాగు చేసి ఉంటుందని అనుకుంటున్నాం అని అన్నారు. జనవరి 2010నుండి చైనా యూజర్స్ నుండి మేము ఇలాంటి కంప్లైంట్స్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుందని అన్నారు. వారి యొక్క కంప్లైంట్స్ పరిశీలించిన మీదట వారు వారి యొక్క జీమెయిల్‌ని యాక్సెస్ చేసుకోలేకపోవడం లేదా మెయిల్స్ పంపిస్తున్నప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చేవి లాంటివి ఎక్కువగా ఉన్నాయని అన్నారు.

 

గతంలో చైనా ప్రభుత్వం కొన్ని కారణాల వల్ల గూగుల్ సెర్చ్ ఇంజన్, యూ ట్యూబ్, ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి వెబ్ సైట్ల మీద ఆంక్షలు పెట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో జాస్మైన్ రివల్యుషన్ సందర్బంగా చైనా ప్రభుత్వం ఎక్కువ మంది పోలీసులను, వెబ్ సెన్సార్‌ను దేశంలో వేరు వేరు ప్రాంతాలలో ఉంచిన సంగతి తెలిసిందే.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X