ఐబిఎమ్ నుండి 200 హక్కులు: గూగుల్

Posted By:

ఐబిఎమ్ నుండి 200 హక్కులు: గూగుల్

 

సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ రోజు రోజుకీ అంచెలంచెలుగా అభివృద్ది సాధించేందుకు ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా ఇటీవల టెక్నాలజీ గెయింట్ ఐబిఎమ్ నుండి కొన్ని హాక్కులను స్వాధీనం చేసుకుంది. మీడియా రిపోర్ట్స్ ప్రకారం గూగుల్ డిసెంబర్ నెలలో మొత్తం 217 విభాగాలకు సంబంధించి హక్కులను పొందినట్లు సమాచారం.

ఐబిఎమ్ డేటాబేస్ ప్రకారం 217 లో ఇప్పటి వరకు 188 హక్కులు ఇవ్వగా, అతి త్వరలోనే మిగిలిన 29 అప్లికేషన్స్‌కి సంబంధించి హక్కులను అందజేయనున్నారు. ఇప్పటి వరకు మార్కెట్లోకి ఎటువంటి హక్కులను ఇచ్చారనే విషయాన్ని మాత్రం సెర్చ్ ఇంజన్ గూగుల్ అధికారకంగా ప్రకటించ లేదు. మాకు అందిన సమాచారం ప్రకారం డేటా క్యాచింగ్, బ్లేడ్ సర్వర్స్, ప్రజంటేషన్ సాప్ట్‌వేర్, వీడియో కాన్ఫరెన్సింగ్, ఈ మెయిల్ మేనేజ్‌మెంట్ మొదలగున వాటికి సంబంధించి పూర్తి హక్కులను ఐబిఎమ్ నుండి గూగుల్ స్వాధీనం చేసుకుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot