విలువైన సమాచారం కోసం జగత్‌ని తీసుకున్న గూగుల్

Posted By: Staff

విలువైన సమాచారం కోసం జగత్‌ని తీసుకున్న గూగుల్

శాన్‌ఫ్రాన్సిస్కో: గూగుల్ అమ్ములపోదిలోకి మరో క్రొత్త వెబ్ సైట్ వచ్చి చేరింది.రెస్టారెంట్ రివ్యూలు, హోటల్స్‌లో ముఖ్యపాత్ర పోషిస్తున్న జాగత్ అనే వెబ్ సైట్‌ని గూగుల్ స్వాధీనం చేసుకొవడం జరిగింది. 1979లో ప్రారంభమైన జాగత్ అనతి కాలంలోనే అత్యంత శక్తివంతమైన వెబ్ సైట్‌గా ఎదిగింది. ప్రస్తుతం జాగత్‌లో 3,50,000 సర్వేయర్స్‌తో పాటు కస్టమర్స్ కోసం ప్రత్యేకంగా గైడ్ బుక్స్‌ని రూపోందించింది. ఇటీవల కాలంలో ఆన్ లైన్ రివ్యూల కూడా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

మొబైల్ మార్కెట్లో ఉన్న అన్ని రకాల స్మార్ట్ ఫోన్లకు మొబైల్ అప్లికేషన్స్‌ని కూడా అందిస్తుంది. ఫిబ్రవరిలో యూజర్స్ కోసం ప్రత్యేకంగా కొత్త వెబ్ సైట్‌ని రూపొందించింది. ఈ సందర్బంలో గూగుల్ ప్రతినిధులు మాట్లాడుతూ స్థానిక అంశాలపై మరింత సమర్థవంతమైన సేవలందించేందుకు ఈ వెబ్‌సైట్‌ విలీనం దోహదపడుతుందని భావిస్తున్నట్టు గూగుల్‌ తెలిపింది. 32 సంవత్సరాల క్రితం పాకెట్‌ గైడల నుంచి పయనం ఆరంభించిన జగత్‌ ఇప్పుడు వెబ్‌సైట్‌ రూపంలో లక్షలాది మందికి తక్షణ సేవలందిస్తోంది. తాము పెంచిన బిడ్డ గూగుల్‌ వంటి రక్షణాత్మకమైన చేతుల్లో పడడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని జగత్‌ వెబ్ సైట్ నిర్వాహకులు వ్యాఖ్యానించారు. జగత్‌ని స్వాధీనం చేసుకున్నందుకు గాను గూగల్ కంపెనీ జగత్ నిర్వాకులకు $125M చెల్లించడం జరిగింది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting