లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ కాబోతోన్న Go edition యాప్స్

సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ తన గో ఎడిషన్ (Go edition) యాప్స్ అలానే సర్వీసెస్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ కానున్నాయి.

|

సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ తన గో ఎడిషన్ (Go edition) యాప్స్ అలానే సర్వీసెస్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ కానున్నాయి. ఈ లేటెస్ట్ అప్‌డేట్‌లో భాగంగా సరికొత్త ఫీచర్లు గోఎడిషన్ సర్వీసెస్‌లో యాడ్ కాబోతున్నాయి. ఆండ్రాయిడ్ అథారిటీ రిపోర్ట్ చేసిన కథనం ప్రకారం యూట్యూబ్ గో, మ్యాప్స్ గో ఇంకా గూగుల్ గో యాప్‌లను కొత్త లుక్‌తో అప్‌డేట్‌ చేయబోతోంది. రాబోతోన్న లేటెస్ట్ అప్‌డేట్‌లో భాగంగా యూట్యూబ్ గో యాప్ నుంచి in .yt file ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకున్న వీడియోలను ఫోన్ గ్యాలరీ యాప్‌లో బ్రౌజ్ చేసుకునే వీలుంటుంది. అయితే వీటిని ప్లే చేసేందుకు యూట్యూబ్ గో యాప్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ ఫీచర్ ఇంకా లైవ్‌లోకి రాలేదు. 2018 చివరి నాటికి ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని గూగుల్ చెబుతోంది.

 

దిగ్గజాలకు వన్‌ప్లస్ షాక్, ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో రారాజు !దిగ్గజాలకు వన్‌ప్లస్ షాక్, ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో రారాజు !

50కు పైగా భాషల్లో టర్న్ బై టర్న్ నేవిగేషన్ వాయిస్ గైడెన్స్...

50కు పైగా భాషల్లో టర్న్ బై టర్న్ నేవిగేషన్ వాయిస్ గైడెన్స్...

గూగుల్ మ్యాప్స్ విషయానికి వచ్చేసరికి గతంలో మిస్ అయిన టర్న్ బై టర్న్ నేవిగేషన్ వాయిస్ గైడెన్స్ కొత్త అప్‌డేట్‌లో భాగంగా యాడ్ కాబోతోంది. ఈ వాయిస్ గైడెన్స్ 50కు పైగా భాషల్లో అందుబాటులో ఉంటుంది. ఈ నేవిగేషన్ టూల్‌కు నచ్చిన భాషను యాడ్ చేసుకోవాలనుకునే యూజర్లు గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి మాన్యువల్‌గా ఆ ప్రొసీజర్‌ను పూర్తి చేయవల్సి ఉంటుంది.

8 భాషల్లో ఈ రీడ్ - అవుట్ లౌడ్ ఫీచర్...

8 భాషల్లో ఈ రీడ్ - అవుట్ లౌడ్ ఫీచర్...

గూగుల్ గో యాప్ విషయానికి వచ్చేసరికి తాజా అప్‌డేట్‌లో భాగంగా read-out loud అనే ఫీచర్ ఈ యాప్ లో యాడ్ కాబోతోంది. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవటం ద్వారా గూగులో గో యాప్ పేజీలను బెగ్గరగా, అర్థవంతంగా చదివి వినిపిస్తుంది. 28 భాషల్లో ఈ రీడ్ - అవుట్ లౌడ్ ఫీచర్ అందుబాటులో ఉంటుంది.

ప్రత్యేకించి ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం...
 

ప్రత్యేకించి ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం...

ఆండ్రాయిడ్ గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టంను ప్రత్యేకించి ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం గూగుల్ అభివృద్ధి చేసింది. ఈ వెర్షన్‌నే ఆండ్రాయిడ్ ఓరియో (గో ఎడిషన్) అని కూడా పిలుస్తున్నారు. 512 ఎంబి ర్యామ్‌తో వచ్చే ఎంట్రీలెవల్ స్మార్ట్‌ఫోన్‌లను కూడా ఈ ఆపరేటింగ్ సిస్టం సపోర్ట్ చేస్తుంది. ఈ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యే స్మార్ట్‌ఫోన్‌లలో గూగుల్ ప్లే స్టోర్‌తో పాటు ఇతర గూగుల్ యాప్స్ ఇన్‌బిల్ట్‌గా పొందుపరచబడి ఉంటాయి.

తక్కువ స్టోరేజ్ స్పేస్‌ను ఆక్రమించుకుంటాయి...

తక్కువ స్టోరేజ్ స్పేస్‌ను ఆక్రమించుకుంటాయి...

ఆండ్రాయిడ్ గో ఆపరేటింగ్ సిస్టంను ఉద్దేశించి పలు ప్రత్యేకమైన యాప్‌లను గూగుల్ అందుబాటులోకి తీసుకువచ్చింది. గూగుల్ గో, గూగుల్ అసిస్టెంట్ గో, యూట్యూబ్ గో, గూగుల్ మ్యాప్స్ గో, జీమెయిల్ గో, జీబోర్డ్, గో, ఫైల్స్ గో పేర్లతో లాంచ్ అయిన ఈ యాప్స్ తక్కువ స్టోరేజ్ స్పేస్‌ను ఆక్రమించుకుంటాయి.

Best Mobiles in India

English summary
The lightweight-version of Google apps and services, popularly called Go editions are reportedly getting new features in their latest updates.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X