మీకు జీమెయిల్ ఉందా..?

By Super
|
Google adds 2.5 GB to Gmail storage


ఆహ్వాన ప్రాతిపదికన, గుగూల్ జీమెయిల్ సర్వీసులను ప్రపంచవ్యాప్తంగా ఎప్రిల్ 1, 2004న ప్రారంభించింది. ఈ ఎనిమిదేళ్ల కాల వ్యవధిలో జీమెయిల్ తన స్టోరేజ్ శాతాన్ని 1జీబి నుంచి 7.5జీబి వరకు క్రమంగా పెంచుకుంటూ వచ్చింది. తాజాగా ఈ స్టోరేజ్ శాతాన్ని మరో 2.5జీబికి పొడిగిస్తూ, జీమెయిల్ టీమ్ ఓ ప్రకటనను జారీ చేసింది. అంటే జీమెయిల్‌లో లభ్యమయ్యే ఉచిత స్టోరేజ్ శాతం 10జీబి అన్నమాట. ఈ ఉచిత స్టోరేజ్ వెసలుబాటు జీమెయిల్ యూజర్లందరికి వర్తిస్తుంది.

ఇటీవలే ఈ దిగ్గజం గుగూల్ డ్రైవ్ పేరిట క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్‌ను ప్రారంభించింది. పెయిడ్ ఖాతా ద్వారా గుగూల్ డ్రైవ్ సర్వీసులను వినియోగించుకునే వారు 25జీబీ స్టోరేజ్‌ను ఉచితంగా పొందవచ్చు. గుగూల్ డ్రైవ్ పెయిడ్ ఆకౌంట్ల ద్వారా 25జీబి నుంచి 1 ట్యాబ్ వరకు స్టోరేజ్ స్పేస్‌ను ఉపయోగించుకోవచ్చు. స్టోరేజి వాడుకకు సంబంధించి కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

రంగంలోకి గుగూల్..?

ఆండ్రాయిడ్ ఆధారిత చవక టాబ్లెట్ కంప్యూటర్లకు ఊహించని స్థాయిలో డిమాండ్ ఏర్పడుతున్న నేపధ్యంలో వ్యాపారాన్ని మరింత విస్తరించే దిశగా గుగూల్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ అంశం పై సంస్థ సీఈవో లారీ పేజ్ స్పందిస్తూ తక్కువ ధరతో విడుదలైన ఆండ్రాయిడ్ పీసీలకు మార్కెట్లో అనూహ్య రీతిలో ఆదరణ లభించటం శుభపరిణామమని, వీటి విస్తరణకు మరింత దృష్టిసారించాల్సి ఉందని వాపోయారు. ప్రస్తుత టాబ్లెట్ మార్కెట్లో చవక ధర ఆండ్రాయిడ్ టాబ్లెట్లను అనేక బ్రాండ్లు విక్రయిస్తున్నాయి.

వీటిలో ఐబెర్రీ ఆక్సస్, ఆకాష్, ఇమాటిక్ ఇగ్లైడ్ ప్రిస్మ్, మెర్క్యురీ ఎమ్ ట్యాబ్ నియో 2, బీఎస్ఎన్ఎల్, వెస్‌ప్రో వంటి బ్రాండ్లు ప్రజలను అంతగా ఆకట్టుకోలేక పోతున్నాయి. ఈ విశ్లేషణలను పరిగణంలోకి తీసుకున్న గుగూల్, నేరుగా తానే రంగంలోకి దిగేందుకు సన్నాహాలు చేసుకుంటుంది. అత్యాధునిక స్పెసిఫికేషన్‌లతో కూడిన టాబ్లెట్ పీసీని రూ.10,000కన్నా తక్కువ ధరకే అందించేందుకు ఈ టెక్ జెయింట్ కసరత్తులు పూర్తి చేస్తుంది. ఈ పీసీలు వచ్చే ఏడాది అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X