ఫైనాన్సియల్ సర్వీసెస్ కోసం గూగుల్ ఎడ్వైజర్ గురించి తెలుసుకోవాల్సిందే

Posted By: Super

ఫైనాన్సియల్ సర్వీసెస్ కోసం గూగుల్ ఎడ్వైజర్ గురించి తెలుసుకోవాల్సిందే

టెక్నాలజీ విషయంలో గూగుల్‌ది అందేవేసిన చేయి. ముఖ్యంగా యూజర్స్ కోసం తనదైన శైలిలో తన సర్వీసెస్‌ని అందజేస్తుంది. అలాంటి టెక్నాలజీ గెయింట్ గూగుల్ కొత్తగా తన సర్వీసెస్‌ని ఫైనాన్సియల్ సెక్టార్‌కి విస్తరించునుంది. దీనికోసం ప్రత్యేకంగా గూగుల్ కంపెనీ గూగుల్ ఎడ్వైజర్ అనే వెబ్‌సైట్‌ని రూపోందించడం జరిగింది. ఈ వెబ్ సైట్ ద్వారా గూగుల్ ఫైనాన్సియల్ ప్రోడక్స్‌కు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి సూచీలను మీకు అందివ్వడం జరుగుతుంది.

ఇది మాత్రమే కాకుండా గూగుల్ ఎడ్వైజర్ మీకు ఎటువంటి సమాచారం అందివ్వనుందంటే మోర్ట్ గేజ్, క్రెడిట్ కార్డ్, సిడి, చెకింగ్ అండ్ సేవింగ్ ఎకౌంట్స్ గురించిన సమాచారం తెలియజేయనుంది. గూగుల్ ఎడ్వైజర్ ప్రోడక్ట్ మేనేజర్ సైమన్ ఆర్స్‌కాట్ మాట్లాడుతూ మేము రూపోందించినటువంటి ఆఫర్స్ లిస్ట్, మీ క్రైటీరియాకు ఇవి ఎంత వరకు సరిపోతాయో దాని గురించిన సమాచారం, రేట్స్ త్వరలోనే తెలియజేయడం జరుగుతుంది. దీని రూపోందించడం వెనుక మఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే ఫైనాన్సియల్ సర్వీసెస్‌ని తేలిక చేయడం కోసమే‌నని అని అన్నారు. ఇది మాత్రమే కాకుండా ఫైనాన్సియల్ సర్వీసెస్ కోసం యూజర్స్ ఎటువంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతోనే దీనిని రూపోందించడం జరిగిందని అన్నారు.

గూగుల్ ఎడ్వైజర్ అందించేవి ఏమిటంటే:

వేగం: మీరు ఏదైనా మార్పుకు సిద్దపడినట్లైతే దానికి సంబంధించినటువంటి అప్ డేట్స్ వెంటనే జరగడం. అన్ని ఆఫ్షన్స్ ఒకే చోట ఉండడం వల్ల వేరే వాటితో బేరీజు వేసుకోవడం తేలిక.

నమ్మకం: గూగుల్ నమ్మకానికి పెట్టింది పేరు.

ఆధీనం: తక్కువ ఎమౌంట్‌కి సంబంధించినటువంటి ఆఫర్స్ మీకు అందుబాటులో ఉంటాయి. దీంతో మీరు ఎంతవరుకు షేర్ చెయ్యగలుగుతారో అంతవరకు మాత్రమే చేసుకునే అవకాశం అందుబాటులో ఉంది. ఏదైనా నిర్ణయం తీసుకునే వరకు మీకు సంబంధించిన పర్సనల్ ఇన్పర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు.

ప్రస్తుతానికి గూగుల్ ఎడ్వైజర్ కేవలం యునైటెడ్ స్టేట్స్‌లో మాత్రమే ఉంది. త్వరలోనే దీనిని మిగతా దేశాలకు విస్తరించనున్నారని సమాచారం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot