జూలై 9న ఇంటర్‌నెట్ బంద్ తప్పదా..?

Posted By: Prashanth

జూలై 9న ఇంటర్‌నెట్ బంద్ తప్పదా..?

 

వాషింగ్టన్: జూలై 9న నెటిజనులు విశ్రాంతి తీసుకోవల్సిందేనా..?, ఆ రోజంతా ఇంటర్నెట్ బంద్ తప్పదా..?, ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠరేపుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం ఇంకా సస్పెన్స్ లోనే ఉంది. ఏదేమైనా జూలై9న ఇంటర్నెట్ బంద్ కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని గగూల్ హెచ్చరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంప్యూటర్లలోకి హానికర వైరస్ ను పంపించేందుకు ఆన్ లైన్ ప్రకటనల స్కామ్ ను అంతర్జాతీయంగా కరుడుగట్టిన హ్యాకర్ల బృందం నడిపిస్తుందని,ఈ వైరస్ కారణంగా జూలై9న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాల సేవలు నిలిచిపోయే ఆస్కారముందని గుగూల్ స్పష్టం చేసింది.

హ్యాకర్ల కుట్రను తిప్పికొట్టే క్రమంలో ప్రభుత్వ కంప్యూటర్లు వైరస్ భారిన పడకుండా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్ బిఐ) సేప్టీనెట్ ను నెలకొల్పింది. ఈ వ్యవస్థ సేవలు జూలై9 నుంచి నిలిచిపోనున్నాయి. ఈ నేపధ్యంలో నెట్ యూజర్లకు అవగాహన కల్పించేందుకు గాను గూగుల్ కంకణం కట్టుకుంది. ఈ వైరస్ వచ్చిన కంప్యూటర్లలో గూగుల్ సెర్చి పేజీని తెరవగానే పైభాగంలో ఒక ప్రత్యేకమైన సందేశం కనిపిస్తుంది. ఇలా నేరుగా వైరస్ వచ్చిన కంప్యూటర్లకే సందేశాలు పంపడం, అది కూడా వారికి ఇష్టమైన భాషలో పంపడం వల్ల ఫలితం ఉంటుందని గూగుల్ సెక్యూరిటీ ఇంజనీర్ డామియన్ మెన్షర్ తమ బ్లాగ్‌లో రాశారు. ఈ వైరస్ వల్ల వెబ్ బ్రౌజింగ్ బాగా ఆలస్యం అవుతుంది. దీంతో అసలు వైరస్ వచ్చినట్లు కూడా గుర్తించే అవకాశం తక్కువని నిపుణులు చెబుతున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot