Just In
- 2 hrs ago
Jio నుంచి రెండు కొత్త రీచార్జి ప్లాన్లు! ప్లాన్ల వివరాలు చూడండి!
- 1 day ago
Apple ఫోన్లు ,ల్యాప్ టాప్ లు ,ఇతర గాడ్జెట్లపై భారీ ఆఫర్లు! ఆఫర్ల వివరాలు!
- 1 day ago
కొత్త OnePlus 11R తయారీ ఇండియాలోనే! లాంచ్ కూడా త్వరలోనే!
- 1 day ago
WhatsApp లో కొత్త ఫీచర్ ! వాయిస్ రికార్డింగ్ ను స్టేటస్ లు గా మార్చుకోండి!
Don't Miss
- News
bomb: ఆ విమానంలో బాంబు ఉంది, రష్యా నుంచి గోవాకు వస్తున్న విమానం ఉజ్జకిస్తాన్ లో ల్యాండింగ్ !
- Lifestyle
ప్రాణహాని కలిగించే బ్యాక్టీరియా వల్ల ఎలాంటి వ్యాధులు వస్తాయో తెలుసా?
- Automobiles
సిట్రోయెన్ eC3 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & పర్ఫామెన్స్
- Finance
Stock Market: దూసుకెళ్తున్న అమీర్ ఖాన్, రణబీర్ కపూర్ పెట్టుబడి పెట్టిన స్టాక్..
- Sports
INDvsAUS : ఆస్ట్రేలియా సిరీస్‌లో సర్ఫరాజ్‌ను ఆడించాల్సిందే.. ఎందుకంటే?
- Movies
Mission Majnu Review భారత్, పాక్ మధ్య అణు వార్ నేపథ్యంగా.. డిఫరెంట్ పాత్రలో రష్మిక మందన్న!
- Travel
భాగ్యనగరంలో ప్రశాంతతకు చిరునామా.. మక్కా మసీదు!
గూగుల్ ఒక్కసారిగా ఆగిపోతే,వేరే ఆప్సన్లు ఏంటో తెలుసుకోండి
ఎవరికైనా ఏదైనా అవసరమొచ్చి ఆన్ లైన్ లో వెతకాలంటే ముందుగా ఏ వెబ్ సెర్చ్ ఇంజిన్ లోకి వెళతారు. ఎవరైనా సరే సెర్చ్ చేయాలంటే సిస్టం ముందు కూర్చుని ఠపీమని ముందుగా గూగుల్ టైప్ చేస్తారు.టెక్నాలజీ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ అంతలా పాపులర్ అయింది. మరి ఒక్కసారిగా గూగుల్ ఆగిపోతే పరిస్థితి ఏంటి, ఎప్పుడైనా ఊహించారు..వేరే ఆప్సన్లు ఏమైనా ఉన్నాయా అని ఆలోచించారా.. ఒక్క గూగుల్ మాత్రమేనా ఉండేది ఇంక ఏమి లేవా అంటే ఎందుకు లేవు ఇంకా చాలానే ఉన్నాయి..ఇవి యూజర్లకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పడు సమర్థవంతంగా గూగుల్ కన్నా ఫాస్ట్ గా సేవలను అందిస్తున్నాయి. మరి గూగుల్ ఆగిపోతే మీరు తక్షణం చేయాల్సిన పనులు, వెతకాల్సిన సెర్చ్ ఇంజిన్లపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

బింగ్ (www.bing.com)
సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు చెందిన సెర్చ్ ఇంజినే 'బింగ్'. మైక్రోసాఫ్ట్‌కు సంబంధించిన అన్ని డివైస్‌లలోనూ ఈ సెర్చ్‌ను డిఫాల్ట్‌గా అందిస్తున్నారు. గూగుల్ లాగే ఇది కూడా ఏ అంశానికి చెందిన సమాచారాన్నయినా సరే క్షణాల్లోనే సెర్చ్ చేసి మనకు అందజేస్తుంది.

యాహూ (search.yahoo.com)
గూగుల్, బింగ్‌ల తరువాత యూజర్లు ఎక్కువగా వాడుతున్న సెర్చ్ ఇంజిన్ 'యాహూ'. మార్కెట్‌లో దీనికి 9.57 షేర్ ఉంది. పైన పేర్కొన్న వాటిలాగే ఇది కూడా పనిచేస్తుంది.

బైదు (www.baidu.com)
చైనాకు సెర్చ్ ఇంజిన్ కంపెనీ 'బైదు'. జనవరి 1, 2000వ సంవత్సరం నుంచి ఇది అందుబాటులోకి వచ్చింది. వెబ్‌సైట్లకు చెందిన సమాచారం, ఆడియో ఫైల్స్, ఫొటోల వంటి వాటిని దీని ద్వారా వెతకవచ్చు.

ఏఓఎల్ (www.aol.com)
ప్రపంచంలో అత్యధిక శాతం మంది యూజర్లు వాడుతున్న సెర్చ్ ఇంజిన్లలో ఇది కూడా ఒకటి. మార్కెట్‌లో దీని వాటా 0.59 శాతం మాత్రమే. 1983లో కంట్రోల్ వీడియో కార్పొరేషన్‌గా తొలుత దీన్ని ప్రారంభించారు. అనంతరం 1991లో 'అమెరికా ఆన్‌లైన్'గా మార్పు చెందింది. అన్ని సెర్చ్ ఇంజిన్లలాగే ఇది కూడా పనిచేస్తుంది.

ఆస్క్ (www.ask.com)
ఇంతకు ముందున్న 'ఆస్క్ జీవ్స్' సంస్థే 'ఆస్క్'గా మారి యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ఇందులో సెర్చ్ రిజల్ట్స్ 'ప్రశ్న - సమాధానం' మోడల్‌లో వస్తాయి. 1995లో దీన్ని స్థాపించారు.

ఎగ్జయిట్ (msxml.excite.com)
ఐఏసీ సెర్చ్ అండ్ మీడియాకు చెందిన సెర్చ్ ఇంజినే 'ఎగ్జయిట్'. దీని ద్వారా యూజర్లు కేవలం సెర్చ్ సమాచారాన్నే కాకుండా ఈ-మెయిల్, వార్తలు, ఇన్‌స్టాంట్ మెసేజింగ్, వాతావరణ స్థితిగతులను గురించి తెలుసుకోవచ్చు.

డక్ డక్ గో (duckduckgo.com)
ఇంటర్నెట్ యూజర్లకు మరింత ప్రైవసీని కల్పించడమే లక్ష్యంగా ఈ సెర్చ్ ఇంజిన్ పనిచేస్తుంది. ఇతర సెర్చ్ ఇంజిన్‌లతో కలిసి ఇది యూజర్లకు నాణ్యమైన సెర్చ్ సమాచారాన్ని అందజేస్తుంది. 2008లో ఇది ప్రారంభమైంది.

వోల్‌ఫ్రమ్ ఆల్ఫా (www.wolframalpha.com)
ఇది ఇతర సెర్చ్ ఇంజిన్‌ల మాదిరిగా డాక్యుమెంట్స్ లేదా వెబ్ పేజీలకు చెందిన రిజల్ట్స్‌ను ఇవ్వదు. దీన్ని ఆయా అంశాలకు చెందిన గణనలకు ఉపయోగిస్తారు. అందుకే దీన్ని 'కంప్యూటేషనల్ సెర్చ్ ఇంజిన్' అని పిలుస్తారు. మ్యాథమాటికా సంస్థ దీన్ని 2009లో ప్రారంభించింది.

యాండెక్స్ (www.yandex.com)
రష్యాలో దీన్ని ఎక్కువగా వాడుతున్నారు. ఇది రష్యాకు చెందిన కంపెనీయే కావడం గమనార్హం. 1997లో దీన్ని ప్రారంభించారు. సాధారణ సెర్చ్ ఇంజిన్లలాగే ఇది కూడా పనిచేస్తుంది. కేవలం రష్యా దేశంలోనే కాకుండా ఉక్రెయిన్, కజకిస్థాన్, బెలారస్, టర్కీలలోనూ దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

లైకోస్ (www.lycos.com)
సెర్చ్ ఇంజిన్ రంగంలో 'లైకోస్' తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. 1994లో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ-మెయిల్, వెబ్ హోస్టింగ్, సోషల్ నెట్‌వర్కింగ్, ఎంటర్‌టెయిన్‌మెంట్ వంటి సమాచారాన్ని ఇది సెర్చ్ రిజల్ట్స్‌తోపాటు అందిస్తుంది.

చాచా (www.chacha.com)
2006లో 'చాచా' సెర్చ్ ఇంజిన్‌ను ప్రారంభించారు. పైన పేర్కొన్న ఆస్క్ లాగే ఇందులో లభించే సెర్చ్ రిజల్ట్స్ కూడా ప్రశ్న - సమాధానం మోడల్‌లోనే ఉంటాయి. యూజర్లు వేసే ప్రశ్నలకు ఇది రియల్ టైమ్‌లో సమాధానాలిస్తుంది.

గూగుల్ ( www. google.com)
గూగుల్ గురించి మీ అందరికీ తెలిసిందే..ప్రపంచమంతా ఇప్పుడు దీన్నే వాడుతున్నారు
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470