వేల మంది ఉద్యోగులను తొలగించి, CEO కి రూ.1854 కోట్లు ముట్టచెప్పిన గూగుల్!
అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం మరియు సంస్థ విలువ ప్రకారం ప్రపంచంలోని టాప్-5 కంపెనీలలో ఒకటిగా ఉన్న గూగుల్ Inc, తమ ఉద్యోగుల ప్రయోజనాలను క్రమంగా తగ్గిస్తోంది.కొన్ని సంవత్సరాల క్రితం తాము ఆస్వాదిస్తున్న అనేక ప్రయోజనాలను టెక్ దిగ్గజం ఎలా నిలిపివేసిందో గూగుల్ ఉద్యోగులు వెల్లడించారు.
ఆర్థిక సంక్షోభం కారణంగా జనవరి 20న, గూగుల్ యొక్క CEO ప్రపంచవ్యాప్తంగా దాదాపు 12,000 మందిని తొలగించబడతారని ఉద్యోగులకు ఒక లేఖలో ధృవీకరించారు. ఈ సంఖ్య ఉద్యోగులలో 6 శాతానికి పైగా ఉంటుంది. ఒక వైపు ఉద్యోగులను తొలగిస్తున్న ఈ సమయం లో సీఈఓ సుందర్ పిచాయ్ 2022లో సుమారు $226 మిలియన్ల (సుమారు రూ. 1,854 కోట్లు) పరిహారం అందుకున్నారనే వార్త సంచలనం సృష్టిస్తోంది.

అవును, శుక్రవారం విడుదల చేసిన సెక్యూరిటీస్ ఫైలింగ్ నివేదిక ప్రకారం, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ 2022లో సుమారు $226 మిలియన్ల (సుమారు రూ. 1,854 కోట్లు) మొత్తం పరిహారం అందుకున్నారు. ఈ సంఖ్య ఆల్ఫాబెట్ ఉద్యోగులు సరాసరి సంపాదించే మధ్యస్థ వేతనం కంటే 800 రెట్లు ఎక్కువగా ఉండటం విశేషం.
సుందర్ పిచాయ్ కు అందిన ఈ పరిహారంలో దాదాపు 218 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1,788 కోట్లు) విలువైన స్టాక్ అవార్డులు ఉన్నాయని కంపెనీ దాఖలు చేసింది. ఆల్ఫాబెట్ ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలను తగ్గించడంతో ఇప్పుడు ఈ వార్త అందరి దృష్టిని ఆకర్షించింది. జనవరి 2022లో, మౌంటెన్ వ్యూ ఆధారిత కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 12,000 ఉద్యోగులను తొలగించే ప్రణాళికలను ప్రకటించింది, ఇది దాని శ్రామిక శక్తిలో 6 శాతానికి సమానం.
పిచాయ్ మరియు ఆల్ఫాబెట్ మధ్యస్థ ఉద్యోగి మధ్య అధిక వేతన వ్యత్యాసం ఆదాయ అసమానత మరియు న్యాయమైన పరిహారం పద్ధతుల గురించి ఆందోళనలకు దారితీసింది. కంపెనీ తన ఉద్యోగుల సంక్షేమం కంటే ఎగ్జిక్యూటివ్ వేతనానికి ప్రాధాన్యత ఇస్తుందని కొందరు విమర్శించారు. ఇటీవలి నెలల్లో, ఆల్ఫాబెట్ యొక్క వివిధ కార్యాలయాలలో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల తొలగింపులకు వ్యతిరేకంగా అనేక ఆంగతనాలు జరిగాయి.
ఈ నెల ఏప్రిల్ ప్రారంభంలో, లండన్‌లోని వందలాది మంది గూగుల్ ఉద్యోగులు,సంస్థ యొక్క ఉద్యోగాలను తగ్గించే నిర్ణయాన్ని నిరసిస్తూ వాకౌట్ చేశారు. అదేవిధంగా, మార్చి 2022లో, 200 మంది కార్మికులను ప్రభావితం చేసిన తొలగింపుల ప్రకటన తర్వాత గూగుల్ యొక్క జ్యూరిచ్ కార్యాలయాల ఉద్యోగులు వాకౌట్ చేశారు. ఈ సంఘటనలు కంపెనీ ఉద్యోగాల కోతలను నిర్వహించడంపై ఆల్ఫాబెట్ ఉద్యోగులలో పెరుగుతున్న అశాంతిని హైలైట్ చేశాయి.
అంతే కాక, ప్రముఖ నివేదికల ప్రకారం,గూగుల్ సంస్థ తన కాస్ట్ కటింగ్ పనిలో భాగంగా గూగుల్ తన కేఫ్ తెరిచే ఉంచే సమయాన్ని కూడా తగ్గించుకుంటుంది. ల్యాప్‌టాప్‌లతో సహా పరికరాల రీప్లేస్‌మెంట్ వ్యవధిని కూడా కంపెనీ పొడిగించింది. తాత్కాలికంగా కొన్ని ప్రయోజనాలను తొలగించింది. వీటిలో ఉచిత మసాజ్ మరియు క్యాంపస్ షటిల్ బస్సులు మరియు ఫిట్‌నెస్ సెంటర్‌లను మూసివేసినట్లు తెలుస్తోంది.
ఆహారంతో పాటు, గూగుల్ యొక్క ఉద్యోగుల ప్రయాణాలపై ఖర్చును కూడా తగ్గించుకుంటోంది. దానిని ముఖ్యమైన పర్యటనలకు దీన్ని మాత్రమే పరిమితం చేసింది.


Click it and Unblock the Notifications