గూగుల్,ఫేస్‌బుక్‌ల మధ్య చిచ్చు, పెట్టింది ఓ పిల్లాడు !

Written By:

పిల్లాడి కోసం రెండు దిగ్గజాల మధ్య పోరు మొదలైంది. 21 ఏళ్ల కుర్రాడి కోసం గూగుల్, ఫేస్‌బుక్ పోటీపడుతున్నాయి. మాకంటే మాకంటూ ఆ పిల్లాడిని బతిమాలుకుంటున్నాయి. ఇంతకీఆపిల్లాడు ఎవరు..అతని కోసం ఎందుకు అంతలా అవి కొట్టుకుంటున్నాయి. వాచ్ దిస్ స్టోరీ.

మరో విజయం దిశగా ఇస్రో, ప్రతి భారతీయుడు తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మైఖేల్ సేమాన్ అనే 21 ఏళ్ల యువకుడి కోసం..

ఇక్కడ కనబడుతున్న మైఖేల్ సేమాన్ అనే 21 ఏళ్ల యువకుడి కోసం గూగుల్-ఫేస్ బుక్ రెండూ తన్నుకుంటున్నాయి. అంటే... అతడి కోసం పోటీపడుతున్నాయి.

ఫేస్‌బుక్ ఇంటర్నిషిప్ పేరుతో..

ఇతడిని 17 ఏళ్ల వయసున్నప్పుడు ఫేస్‌బుక్ ఇంటర్నిషిప్ పేరుతో ఉద్యోగంలోకి తీసుకుంది. ఆ తర్వాత అతడికి 18 ఏళ్లు నిండటంతో ఫుల్ టైమ్ ఇంజినీరింగ్ ఉద్యోగంలో కూర్చోబెట్టింది.

ఫేస్‌బుక్‌కు కట్ కొట్టి గూగుల్ కంపెనీకి జంప్

21 ఏళ్లు నిండగానే అతగాడు కాస్తా ఫేస్‌బుక్‌కు కట్ కొట్టి గూగుల్ కంపెనీకి జంప్ అయ్యాడు. గూగుల్ కంపెనీలో పనిచేస్తున్న ప్రొడక్షన్ మేనేజర్లలో సేమాన్ అత్యంత పిన్నవయస్కుడు.

సుందర్ పిచాయ్ తర్వాతి స్థానం అతడిదే

ప్రస్తుతం ఇతడు గూగుల్ సెర్చ్ ఇంజిన్లో వాయిస్ డేటా బేస్ సర్వీస్ కోసం పనిచేస్తున్నాడు. ఇతడి టెక్నికల్ స్కిల్స్ చూసినవారు సుందర్ పిచాయ్ తర్వాతి స్థానం అతడిదే అంటున్నారు.

లైఫ్‌స్టేజ్' యాప్ క్రియేట్

ఇదిలావుంటే ఫేస్‌బుక్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నప్పుడు సేమాన్ ‘లైఫ్‌స్టేజ్' యాప్ క్రియేట్ చేశాడు. ఇది 21 అంతకంటే తక్కువ వయసున్న వారిని ఉద్దేశించి గతేడాది అందుబాటులోకి తెచ్చారు.

సెల్ఫీలు, వీడియోలను

ఈ యాప్ ద్వారా ప్రైవేటు మెసేజ్‌లను నేరుగా పంపించడం కాకుండా సెల్ఫీలు, వీడియోలను క్లాస్‌మేట్లకు షేర్ చేసుకోవచ్చు.

ప్రైవసీ సమస్యలు ఎక్కువగా వుండటంతో

ప్రైవసీ సమస్యలు ఎక్కువగా వుండటంతో దీనిని వాడేందుకు ఎవరూ ఉత్సాహం చూపించలేదు. దాంతో ఈ యాప్‌ను ఈ నెల 4న తన యాప్ స్టోర్ నుంచి ఫేస్ బుక్ తొలగించింది.

అతడి కోసం...

అయితే సేమాన్ సృష్టించిన మరికొన్ని యాప్‌లు అద్భుతాలను సృష్టిస్తాయని చెప్పుకుంటున్నారు. అతడి కోసం ఫేస్‌బుక్ సీఈఓ జుకర్ బర్గ్ తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడని సమాచారం.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Google and Facebook are fighting over this 21 year old Read More At Gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot