Just In
- 14 hrs ago
స్పామ్ కాల్లతో విసిగిపోయారా? అయితే ఇలా బ్లాక్ చేయండి...
- 15 hrs ago
44-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఫీచర్లతో వివో Y75 కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది!! ధరలు, ఫీచర్స్ ఇవిగో
- 16 hrs ago
Disney+ Hotstar సబ్స్క్రిప్షన్ మూడు నెలల వాలిడిటీను కేవలం రూ.151 ధరకే పొందవచ్చు!!
- 18 hrs ago
Netflix లో కిడ్స్ కోసం కొత్త మిస్టరీ బాక్స్ ఫీచర్స్!!
Don't Miss
- News
చేరికల కోసం పోటీపడుతున్న తెలంగాణా రాజకీయ పార్టీలు.. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఎవరివ్యూహం వారిదే!!
- Movies
మరోసారి హాట్ వీడియో వదిలిన విష్ణుప్రియ: టాప్‌ను పైకి లేపేసి అందాల జాతర
- Lifestyle
Today Rasi Phalalu :ఓ రాశి వారు రియల్ ఎస్టేట్ వ్యాపార నిర్ణయాల్లో తొందరపడొద్దు..
- Sports
అశ్‘విన్’ అసామాన్య బ్యాటింగ్.. చెన్నై నుంచి విజయాన్ని లాక్కున్నాడు
- Finance
ఈ ఏడాది నిఫ్టీకి ఇదే సెకండ్ బిగ్గెస్ట్ గెయిన్, రూ.5 లక్షల కోట్ల సంపద పెరిగింది
- Automobiles
నా భార్య కోసం XUV700 బుక్ చేశా.. డెలివరీ కోసం నేను కూడా క్యూలో వెయిట్ చేస్తున్నా: ఆనంద్ మహీంద్రా
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మైక్రోసాఫ్ట్, గూగుల్ కంపెనీల భారతీయ CEOలను వరించిన పద్మభూషణ్ పురస్కారం...
ఈ రిపబ్లిక్ డే సందర్భంగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్‌లకు ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డును అందజేయనున్నారు. భారతీయ సంతతికి చెందిన ఈ ఇద్దరూ ప్రపంచంలో టెక్ పరిశ్రమలో పేరుగాంచిన టెక్ సంస్థలకు CEOలుగా బాధ్యతలను అందిస్తున్నారు. అంతేకాకుండా ప్రపంచంలోని అత్యంత ప్రముఖమైన CEOల పేర్లలో వీరు ఇరువురు జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు.

భారత ప్రభుత్వం నేడు 73వ రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డులు అందజేసే అవార్డు గ్రహీతల పూర్తి జాబితాను ప్రకటించిన తర్వాత నాదెళ్ల మరియు పిచాయ్ ఈ అవార్డును అందుకుంటున్నట్లు మంగళవారం వెల్లడించారు. ఈ ఏడాది 17 మంది పద్మభూషణ్ అవార్డు గ్రహీతల్లో టెక్ మేధావులు ఇద్దరూ ఉన్నారు. ఇందులో సీరమ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ సైరస్ పూనావాలా మరియు భారత్ బయోటెక్ యొక్క కృష్ణ ఎల్లా మరియు సుచిత్రా ఎల్లా కూడా ఉన్నారు.

పద్మభూషణ్ అవార్డు అనేది భారతదేశంలో భారతరత్న మరియు పద్మవిభూషణ్ తర్వాత అందుకునే మూడవ అత్యున్నత పౌర పురస్కారం. పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనే మూడు విభాగాల్లో పద్మ అవార్డులను ప్రదానం చేస్తారు. కళ, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్ మరియు ఇంజినీరింగ్, వాణిజ్యం మరియు పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం మరియు విద్య, క్రీడలు మరియు పౌర సర్వీసులతో సహా వివిధ రంగాలలో విశేష సేవలందించిన ప్రతిభావంతులకు "పద్మ" గౌరవాలు ప్రతి ఏటా అందించబడతాయి. భారతీయ సంతతికి చెందిన వ్యాపార కార్యనిర్వాహకులు ఇద్దరూ "వాణిజ్యం మరియు పరిశ్రమ" విభాగంలో అందిస్తున్న వారి యొక్క సహకారాలను గుర్తించి భారత ప్రభుత్వం పద్మ అవార్డులతో గౌరవించనున్నారు.

భారతదేశపు మొట్టమొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ దివంగత జనరల్ బిపిన్ రావత్‌కు కూడా ఈ సంవత్సరం పద్మవిభూషణ్ అవార్డు లభించింది. ఈ సంవత్సరం పద్మ అవార్డుల గ్రహీత జాబితాలో ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా, గాయకుడు సోనూ నిగమ్ కూడా ఉన్నారు. వీరితో పాటుగా మరొక 107 మంది ప్రముఖులకు పద్మశ్రీ అవార్డును ప్రదానం చేస్తున్నారు. వీటన్నింటితో సహా మొత్తం 128 మంది వ్యక్తులకు పద్మ అవార్డులను నేడు వార్షిక సంప్రదాయాలకు అనుగుణంగా భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా అవార్డులను పొందనున్నారు.

వృత్తిపరంగా విజయవంతం కావడానికి Google CEO చిట్కాలు
స్పోర్ట్స్ పట్ల ప్రేమ
ఎల్లప్పుడూ చదువులు మరియు సాంకేతిక విషయాలతో ముడిపడి ఉండే సుందర్ పిచాయ్‌కి క్రీడలంటే కూడా చాలా ఇష్టం. ఫుట్‌బాల్ మరియు చెస్‌తో పాటుగా అతను క్రికెట్ ఆడటానికి ఇష్టపడతాడు. పాఠశాలలో చదువుకునే సమయంలో క్రికెట్ జట్టు ఛాంపియన్‌లో ఒకరు కావడం విశేషం.
వృత్తి మరియు వ్యక్తిగత జీవితం వేరు
తన ఖాళీ సమయంలో పుస్తకాలను ఎక్కువగా చదవడానికి ఇష్టపడతాను అని తెలిపారు. అందువల్ల త్వరగా ఇంటికి చేరుకుంటాను అని తెలిపారు. తన వృత్తిపరమైన మరియు వ్యక్తిగత జీవితాన్ని విడిగా ఉంచాలని విశ్వసిస్తాను కావున తన కార్యాలయ పనికి సంబందించిన విషయాలను తన ఇంటికి తీసుకెళ్లను అని తెలిపారు. తనను పరీక్షించడం కోసం తన ఇంట్లో 20 నుండి 30 ఫోన్లు ఉన్నాయని పేర్కొన్నాడు.
ఉదయాన్నే ప్రారంభించడం
ఉదయం ఎంత బాగా ప్రారంభమైతే రోజు అంత బాగా జరుగుతుందని తాను నమ్ముతాను అని తెలిపారు. అందువలన తను ఉదయం 6:30 లేదా 7:00 మధ్య అల్పాహారం చేయడం, వార్తాపత్రిక చదవడం మరియు ది వాల్ స్ట్రీట్ జర్నల్ వార్తాపత్రిక మరియు న్యూయార్క్ టైమ్స్ యొక్క హార్డ్ కాపీని డిజిటల్‌గా చదవడం ద్వారా తన రోజు ప్రారంభమవుతుంది అని తెలిపారు. తన అల్పాహారంగా టోస్ట్ మరియు గుడ్లతో టీ తాగుతాను అని తెలిపారు.
ముందుగా ఆలోచించడం
మీ వర్తమానంలో మీరు చేసే ప్రతి పని మీ భవిష్యత్తును నేరుగా ప్రభావితం చేస్తుందని ఆయన చెప్పారు. కాబట్టి ఎల్లప్పుడూ వినూత్నంగా ఉండండి ఎందుకంటే ఈ ప్రపంచం భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ముందుకు సాగుతుంది. ఈ రోజు ఆండ్రాయిడ్ బాగా ప్రాచుర్యం పొందింది. కానీ సుందర్ పిచాయ్ చాలా కాలం క్రితం దీనిని రూపొందించారు. మీరు భవిష్యత్తును ఊహించినప్పుడు మీరు ఇతర వ్యక్తుల కంటే ఒక అడుగు ముందుంటారు.
-
54,535
-
1,19,900
-
54,999
-
86,999
-
49,975
-
49,990
-
20,999
-
1,04,999
-
44,999
-
64,999
-
20,699
-
49,999
-
11,499
-
54,999
-
7,999
-
8,980
-
17,091
-
10,999
-
34,999
-
39,600
-
25,750
-
33,590
-
27,760
-
44,425
-
13,780
-
1,25,000
-
45,990
-
1,35,000
-
82,999
-
17,999