తుఫాన్ దెబ్బ!

Posted By: Staff

 తుఫాన్ దెబ్బ!

 

శాండీ తుఫాన్ దెబ్బకు గూగుల్ ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆండ్రాయిడ్ కార్యక్రమం రద్దయ్యింది. వివరాల్లకి వెళితే... గూగుల్ అక్టోబర్ 29న తమతమ కొత్త ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ 4.2తో పాటు అనేకు నెక్సస్ ఉత్పత్తులను ఆవిష్కరించేందుకు న్యూయార్క్ నగరంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. తుఫాన్ తీవ్రత నేపధ్యంలో గత శుక్రవారం నుంచే న్యూయార్క్‌లో ఎమర్జన్సీ ప్రకటించారు. ఈ నేపధ్యంలో సోమవారం జరగాల్సిన కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు గూగుల్ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. కార్యక్రమం రద్దుకావటం పలువురు అభిమానులను నిరుత్సాహపరిచింది. గూగుల్ ఈ కార్యక్రమంలో ఎల్‌జీ నెక్సస్ సిరీస్ స్మార్ట్‌ఫోన్, సోనీ నెక్సస్ హ్యాండ్‌సెట్, శామ్‌సంగ్ నెక్సస్ 10 టాబ్లెట్ (32జీబి వేరియంట్),  అసస్ నెక్సస్7 టాబ్లెట్‌లను ఆవిష్కరించనుందని నిన్న మొన్నటి వరకు ప్రచారం జోరుగా సాగింది.

గూగుల్ టాబ్లెట్ రూ.5000కే!

సెర్చ్ ఇంజన్ జెయింట్ గూగుల్ $99 (రూ.5,000 ధర పరధిలో) నెక్సస్ టాబ్లెట్‌ను త్వరలో ఆవిష్కరించనుందని మార్కెట్ వర్గాలు వాడివేడిగా చర్చించుకుంటున్నాయి. ప్రముఖ టెక్ డైలీ డిగీటైమ్స్ ఈ టాబ్లెట్  కంప్యూటర్‌కు సంబంధించి ఆసక్తికర అంశాలను వెలుగులోకి తెచ్చింది. తెలిసిన సమాచారం మేరకు ఈ టాబ్లెట్ 800మెగాహెడ్జ్ క్లాక్ వేగాన్ని కలిగిన సింగిల్ కోర్ ప్రాసెసర్ పై రన్ అవుతుంది. ఈ ప్రాసెసర్‌లను చైనాకు చెందిన వండర్ మీడియా టెక్నాలజీస్ తయారు చేసినట్లు తెలుస్తోంది. అలాగే టాబ్లెట్ స్ర్కీన్ 7 అంగుళాల పరిమాణాన్ని కలిగి ఉంటుది. రిసల్యూషన్1024x 800పిక్సల్స్.

తైవాన్‌కు చెందిన హాన్‌స్టార్ డిస్‌ప్లే టెక్నాలజీస్ ఈ టీఎన్ ప్యానళ్లను సమకూర్చినట్లు డిగీటైమ్స్ పేర్కొంది. తైవాన్‌కు చెందిన క్వాంటా కంప్యూటర్ ద్వారా ఈ టాబ్లెట్‌ల ఉత్పత్తి జరుగుతున్నట్లు తెలుస్తోంది. అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండే ఈ టాబ్లెట్‌ను అక్టోబర్ 29న ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గూగుల్ ఆవిష్కరించనుందని ఈ ఆంగ్ల టెక్ పోర్టల్ వెల్లడించింది. ఆవిష్కరణ కార్యక్రమానికి సంబంధించి గూగుల్ ఇప్పటికే ఆహ్వాన పత్రాలను ఇప్పటిచే పలు మీడియా గ్రూపులకు పంపిందట. గూగుల్ తొలి నెక్సస్ టాబ్లెట్‌ను అసస్ ఉత్ఫత్తి చేసిన విషయం తెలిసిందే. ధర $199 (రూ.10,000!). 8జీబి ఇంకా 16జీబి వర్షన్‌లలో మాత్రమే ఈ టాబ్లెట్ లభ్యమవుతుంది. 32జీబి వర్షన్‌ను గూగుల్ త్వరలో అందుబాటులోకి తేనున్నట్లు సమాచారం

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot