Home
News

దీపావళి ఆఫర్‌ : రూ.650 ప్లాన్‌ను కేవలం రూ.11 కే పొందవచ్చు.. అక్టోబర్‌ 31 వరకు మాత్రమే..!

Google One Diwali Offer : దీపావళి సందర్భంగా అనేక ఉత్పత్తులపై వివిధ సంస్థలు డిస్కౌంట్‌లను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ఇ-కామర్స్ సంస్థలు గత కొన్ని రోజులుగా ప్రత్యేక సేల్స్‌ నిర్వహిస్తున్నారు. దీంతోపాటు స్మార్ట్‌ఫోన్‌, ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థలు ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్‌లపై ప్రకటన చేస్తున్నాయి. దీపావళి సందర్భంగా గూగుల్‌ స్పెషల్‌ ఆఫర్‌ను ప్రకటన చేసింది. ప్రస్తుత, కొత్త యూజర్లకు కూడా ఈ ఆఫర్‌ వర్తిస్తుంది.

ఏ ప్లాన్‌ అయినా రూ.11 మాత్రమే :
గూగుల్‌ వన్‌ స్టోరేజీపై దీపావళి సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ను అందిస్తోంది. అంటే క్లౌడ్‌ స్టోరేజీపై ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. ఇందులో భాగం కేవలం రూ.11 కే ఏ ప్లాన్‌ను అయినా సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవచ్చు ప్రస్తుతం గూగుల్‌ వన్‌ లైట్‌, బేసిక్‌, స్టాండర్డ్, ప్రీమియం ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి.

Google announced diwali Offer on Google one

అక్టోబర్‌ 31 వరకు మాత్రమే ఆఫర్‌ :
గూగుల్‌ వన్‌ దీపావళి ఆఫర్‌ అక్టోబర్‌ 31 వరకు మాత్రమే ఉంటుంది. అయితే కేవలం మూడు నెలల వరకు మాత్రమే రూ.11 ధరకు ఈ ప్లాన్‌లను సబ్‌స్క్రైబ్‌ చేసుకోవచ్చు. అనంతరం సాధారణ ధరలు అమల్లోకి వస్తాయని గూగుల్‌ తెలిపింది. దీని ద్వారా జీమెయిల్, గూగుల్‌ డ్రైవ్‌, గూగుల్ ఫోటోస్‌లో అదనపు స్టోరేజీని పొందవచ్చు.

నెలవారీ ప్లాన్‌లు :
ప్రస్తుతం గూగుల్‌ వన్‌ లైట్‌ ప్లాన్‌ సాధారణ నెలవారీ ధర రూ.30 గా ఉంది. ఈ ప్లాన్‌లో భాగంగా 30GB స్టోరేజీని అందిస్తోంది. అయితే ఈ దీపావళి ఆఫర్‌లో భాగంగా రూ.11 కే ఈ ప్లాన్‌ను యాక్టివేట్‌ చేసుకోవచ్చు. బేసిక్ ప్లాన్ నెలవారీ ధర రూ.130 గా ఉంది. దీని ద్వారా 100GB స్టోరేజీని పొందవచ్చు. ఈ ప్లాన్‌ను కూడా రూ.11 కే యాక్టివేట్‌ చేసుకోవచ్చు.

గూగుల్‌ వన్‌ స్టాండర్డ్‌ ప్లాన్‌ నెలవారీ ధర రూ.210 గా ఉంది. ఈ ప్లాన్‌లో 200GB స్టోరేజీని పొందవచ్చు. అయితే దీపావళి ఆఫర్‌లో భాగంగా ఈ ప్లాన్‌ను కూడా రూ.11 కే యాక్టివేట్‌ చేసుకోవచ్చు. ప్రీమియం ప్లాన్‌ నెలవారీ రూ.650 గా ఉంది. ఇందులో 2TB వరకు స్టోరేజీని పొందవచ్చు. ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా రూ.11 కే యాక్టివేట్‌ చేసుకోవచ్చు.

వార్షిక ప్లాన్‌లు :
అయితే వార్షిక ప్లాన్‌పైనా దీపావళి ఆఫర్‌ను పొందవచ్చు. ప్రస్తుతం సంవత్సరానికి గూగుల్‌ వన్‌ లైట్‌ ప్లాన్‌ ధర రూ.708 గా ఉంది. ఆఫర్‌లో రూ.479 ధరకే యాక్టివేట్‌ చేసుకోవచ్చు. అదే సంవత్సరానికి గూగుల్ వన్‌ బేసిక్ ప్లాన్‌ ధర రూ.1560 గా ఉంది. అయితే ఆఫర్‌లో రూ.1000 కే లభిస్తుంది.

దీంతోపాటు స్టాండర్డ్ వార్షిక ప్లాన్ ధర రూ.2520 గా ఉంది. దీపావళి ఆఫర్‌లో భాగంగా రూ.1600 ధరకే పొందవచ్చు. అయితే సంవత్సరానికి ప్రీమియం ప్లాన్‌ ధర రూ.7800 గా ఉంది. ఈ ఆఫర్‌లో భాగంగా రూ.4900 కే పొందవచ్చు. దీపావళి ఆఫర్‌ ఈ నెల చివర వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. మరియు మూడు నెలల వరకు మాత్రమే ఈ కొత్త ధరలు అందుబాటులో ఉంటాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Google announced diwali Offer on Google one plans, Offer valid upto October 31
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X