Chrome లో గూగుల్ కొత్త స్క్రీన్ షేరింగ్ అప్‌డేట్ ఫీచర్!!‌ మీ నోటిఫికేషన్‌లు మరింత సేఫ్

|

ప్రపంచం మొత్తం మీద కరోనా కారణంగా ఇప్పటికి చాలా ప్రైవేట్ సంస్థలు తమ ఉద్యోగులను ఇంటి వద్ద నుండి పనిచేయమని కోరుతున్నాయి. ఈ క్రమంలో వీడియో కాలింగ్ వినియోగం మునుపటి కంటే అధికం అయింది. ఇందులో భాగంగా ఉద్యోగులు తమ యొక్క లాప్ టాప్ మరియు డెస్క్ టాప్ యొక్క స్క్రీన్ ను అందరితో షేర్ చేసుకుంటూ ఉంటారు. వెబ్ బ్రౌసింగ్ కోసం అధికంగా వినియోగించే క్రోమ్ కోసం గూగుల్ సంస్థ ఇప్పుడు క్రొత్తగా మరొక ఫీచర్‌ను రూపొందించింది. వినియోగదారులు తమ యొక్క స్క్రీన్‌ను మరొకరితో షేర్ చేస్తున్నప్పుడు వెబ్ పాప్-అప్ నోటిఫికేషన్‌ల యొక్క కంటెంట్‌ను ఇతరులు చూడకుండా ఆటోమ్యాటిక్ గా దాచిపెడుతుంది. గూగుల్ వర్క్‌స్పేస్‌ యొక్క కొత్త అప్‌డేట్‌లో కంపెనీ ఈ విషయాన్ని ప్రకటించింది.

క్రోమ్ స్క్రీన్ షేరింగ్ కొత్త అప్‌డేట్

క్రోమ్ స్క్రీన్ షేరింగ్ కొత్త అప్‌డేట్

క్రోమ్ కోసం గూగుల్ సంస్థ కొత్తగా అందించే అప్‌డేట్‌లో భాగంగా గూగుల్ చాట్, ఇమెయిల్ మరియు ఇతర మూడవ పార్టీ వెబ్‌సైట్ల నుండి వినియోగదారులు నోటిఫికేషన్‌లను మామూలుగానే పొందుతూ ఉంటారు. ఈ నోటిఫికేషన్లను వినియోగదారులు చూడగలుగుతారు కానీ స్క్రీన్ షేరింగ్ సమయంలో పాప్-అప్ నోటిఫికేషన్ యొక్క కంటెంట్ పూర్తిగా దాచబడుతుంది. స్క్రీన్ షేరింగ్ ఆపివేయబడిన తర్వాత మ్యూట్ చేయబడిన అన్ని నోటిఫికేషన్‌లను చూడడానికి వీలుఉంటుంది.

 స్క్రీన్‌ షేర్ ఫీచర్

స్క్రీన్‌ షేర్ ఫీచర్

వినియోగదారులు ప్రస్తుతం అధికంగా వినియోగిస్తున్న వీడియో కాలింగ్ లో తమ యొక్క స్క్రీన్‌ను షేర్ చేస్తున్నప్పుడు తమ యొక్క స్క్రీన్‌లోని ముఖ్యమైన సమాచార పరధ్యానాన్ని నివారించడానికి మరియు గోప్యతను కాపాడటానికి ఈ కొత్త ఫీచర్ ఉపయోగపడుతుంది అని కంపెనీ పేర్కొంది. ప్రస్తుత సమయంలో గతంలో కంటే ఎక్కువగా గూగుల్ మీట్ మరియు ఇతర స్క్రీన్ షేరింగ్ సొల్యూషన్స్ వాడకంపై ఎక్కువ మంది ఆధారపడుతున్నారు. ఈ ఫీచర్ సహాయంతో మీ స్క్రీన్‌ను షేర్ చేస్తున్నప్పుడు మీ యొక్క సున్నితమైన లేదా వ్యక్తిగత సమాచారాన్ని అనుకోకుండా చూపించకుండా నిరోధిస్తుందని గూగుల్ సంస్థ తన యొక్క బ్లాగ్ పోస్ట్ లో పేర్కొంది.

క్రోమ్ వెబ్‌సైట్ లో గూగుల్ కొత్త ఫీచర్

క్రోమ్ వెబ్‌సైట్ లో గూగుల్ కొత్త ఫీచర్

క్రోమ్ వెబ్‌సైట్ లో ఈ కొత్త ఫీచర్ యొక్క నిర్వాహనకు ఎటువంటి నియంత్రణ అవసరం లేదు. ఇది గూగుల్ వర్క్‌స్పేస్ ఎస్సెన్షియల్స్, బిజినెస్ స్టార్టర్, బిజినెస్ స్టాండర్డ్, బిజినెస్ ప్లస్, ఎంటర్‌ప్రైజ్ ఎస్సెన్షియల్స్, ఎంటర్‌ప్రైజ్ స్టాండర్డ్ మరియు ఎంటర్‌ప్రైజ్ ప్లస్ లను వినియోగదారులందరికీ కనిపిస్తుంది. జి సూట్ బేసిక్, బిజినెస్, ఎడ్యుకేషన్, ఎంటర్ప్రైజ్ ఫర్ ఎడ్యుకేషన్ వినియోగదారులతో పాటు వ్యక్తిగత గూగుల్ అకౌంట్లు ఉన్న వినియోగదారులు అందరూ కూడా దీనిని యాక్సెస్ చేయవచ్చు.

Best Mobiles in India

English summary
Google Announced New Screen Sharing Update Feature in Chrome! Your Notifications are Very Safe

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X