క్రిస్‌మస్‌కి ఆండ్రాయిడ్ అదిరిపోయింది..?

Posted By:

క్రిస్‌మస్‌కి ఆండ్రాయిడ్ అదిరిపోయింది..?

 

సెర్చ్ ఇంజన్ గెయింట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనతి కాలంలో ఎంతో ప్రాచుర్యాన్ని పొందిన విషయం తెలిసిందే. ఇటీవలే గూగుల్ ఆండ్రాయిడ్ హెడ్ ఆండీ రూబెన్ మాట్లాడుతూ ప్రతి రోజుకీ ప్రపంచ వ్యాప్తంగా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ యాక్టివేషన్స్ 700,000 మిలియన్ల అవుతున్నట్లు ప్రకటించారు. ఐతే ఇంగ్లీషు వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పండుగ క్రిస్‌మస్ రోజున మాత్రం 3.7 మిలియన్ ఆండ్రాయిడ్ యాక్టివేషన్స్ జరిగినట్లు ఆండీ రూబెన్ వెల్లడించారు.

ఇకపోతే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఓపెన్ సోర్స్ మొబైల్ ప్లాట్‌ఫామ్ అన్న విషయం అందరికి తెలిసిందే. క్రిస్‌మస్ రోజున 3.7 మిలియన్ ఆండ్రాయిడ్ యాక్టివేషన్స్ అయిన విషయాన్ని రూబెన్ గూగుల్ ప్లస్ ద్వారా ప్రపంచానికి తెలిపారు. గూగుల్ ప్లస్‌లో ఆండీ రూబెన్ “There were 3.7M Android activations on 12/24 and 12/25. Congrats team-Android!” పోస్ట్ చేశారు.

గత 16 నెలలుగా గమనించినట్లేతే ఆండ్రాయిడ్ మార్కెట్ అభివృద్ది చాలా బేషుగ్గా ఉంది. 2010వ సంవత్సరంలో ఒక్కో రోజుకీ 200,000 మిలియన్ల యాక్టివేషన్స్ ఉండగా, అదే జూన్ నెలలో 500, 000 మిలియన్ల యాక్టివేషన్స్‌కి రాగా, అదే సంవత్సరం డిసెంబర్ నెలలో 700, 000 మిలియన్లకు చేరుకున్నాయి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting