గూగుల్ రూ. 66 వేల ఆఫర్, మీరు ఏం చేయాలంటే..

Written By:

సెర్చ్ ఇంజిన్ తిరుగులేని స్థానం సంపాదించుకున్న గూగుల్ ఓ కొత్త ఆఫర్ ప్రకటించింది. గూగుల్ యాప్స్‌లో బగ్స్ కనుకున్నవారికి రూ. 1000 డాలర్ల బహుమతిని గిఫ్ట్‌గా అందించనుంది. బగ్స్ సులువుగా కనిపెట్టే వారికి గూగుల్ ఆఫర్ మరింత ఉపయోగపడనుందని గూగుల్ తెలిపింది. మీరు గూగుల్ ప్లే స్టోర్ ఆండ్రాయిడ్‌ యాప్స్‌లో బగ్స్‌ని కనుక్కుని గూగుల్ సంస్థకు సమాచారం ఇస్తే సరిపోతుందట.

భారీ ధరతో సర్ఫేస్ బుక్ 2 సీరిస్ ల్యాపీలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హ్యాకర్ వన్ అనే కంపెనీతో..

గూగుల్ కంపెనీ హ్యాకర్ వన్ అనే కంపెనీతో ఈ డీల్ కుదుర్చుకోవడం ద్వారా కొత్త డెవలపర్లను వెలికితీసేందుకు గూగుల్ శ్రీకారం చుట్టింది.

యాప్‌ ప్రోగ్రామ్స్ చెక్ చేసి బగ్స్ గుర్తించే వారు..

ఆండ్రాయిడ్ యాప్స్‌ రూపొందించే వారితో పాటు యాప్‌ ప్రోగ్రామ్స్ చెక్ చేసి బగ్స్ గుర్తించే వారు తమ నైపుణ్యాన్ని బయటపెట్టేందుకు ఇది సదావకాశమని గూగుల్ ప్లే యాప్స్‌ అండ్‌ గేమ్స్‌ డైరెక్టర్‌ వినీత్ బచ్‌ అన్నారు.

వైరస్‌ల కారణంగా ఎలాంటి నష్టం..

తమ యూజర్లకు వైరస్‌ల కారణంగా ఎలాంటి నష్టం వాటిల్లకూడదని బగ్స్ గుర్తించండి.. రివార్డ్ పొందండి అంటూ కొత్తదనానికి బాటలు వేస్తోంది గూగుల్.

2015లో బగ్స్ రిమూవ్ ప్రోగ్రామ్..

2015లో బగ్స్ రిమూవ్ ప్రోగ్రామ్ మొదటుపెట్టాక ఇప్పటివరకూ వీటి కోసం గూగుల్ 115 మిలియన్ డాలర్లు వెచ్చించినట్లు సంస్థ తెలిపింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Google announces bug bounty. offering $1,000 for finding bugs in Android apps More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot