యాడ్ పాలసీపై గూగుల్ కఠిన నిర్ణయం,నిబంధనలు తెలుసుకోండి
దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రముఖ సామాజిక మాధ్యమం గూగుల్ కొత్త ప్రకటనల పాలసీని ప్రకటించింది.
దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రముఖ సామాజిక మాధ్యమం గూగుల్ కొత్త ప్రకటనల పాలసీని ప్రకటించింది. ఆన్‌లైన్‌లో వచ్చే రాజకీయ ప్రకటనలపై పూర్తి పారదర్శకత పాటించనున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇకపై ప్రకటనలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందివ్వాలని నిర్ణయించినట్లు పేర్కొంది. ప్రకటనల కోసం అభ్యర్థులు ఈసీ నుండి అనుమతి పత్రాన్ని సమర్పిస్తే వాటిని పరిశీలించి ప్రకటనలకు గూగుల్ అనుమతి ఇస్తుందని సమాచారం. ఫిబ్రవరి 14 నుండి ప్రారంభం కానున్న ఈ పాలసీతో పారదర్శకత కనిపిస్తుందని గూగుల్ భావిస్తోంది. మార్చి నుండి భారత్ కోసం కొత్తగా రాజకీయ ప్రకటనల పారదర్శకత, రాజకీయ ప్రకటనల లైబ్రరీ సేవలను అందించనుంది.

ఇండియా పొలిటికల్ యాడ్స్ ట్రాన్స్‌పరెన్సీ రిపోర్ట్
ఇకపై ప్రకటనలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందివ్వాలని నిర్ణయించినట్లు పేర్కొంది. అలాగే ఆ ప్రకటనలను ఎవరు ఇచ్చారు? దీనికి వారు వెచ్చించిన ఖర్చు ఎంత? వంటి వివరాలను సైతం వెల్లడించనున్నట్లు తెలిపింది. ‘ఇండియా పొలిటికల్ యాడ్స్ ట్రాన్స్‌పరెన్సీ రిపోర్ట్' పేరిట నూతన పాలసీని తీసుకువచ్చినట్లు వెల్లడించింది.

సర్టిఫికెట్లు
దీని ప్రకారం ప్రకటనదారులు ఇకపై తమ ప్రకటనలకు సంబంధించి భారతీయ ఎలక్షన్ కమిషన్ (ఈసీఐ) లేదా ఈసీఐ అధికారులు అనుమతినిస్తూ జారీ చేసిన సర్టిఫికెట్లు తీసుకురావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

గుర్తింపును ధ్రువీకరించిన తర్వాతనే
అలాగే ప్రకటనదారుల గుర్తింపును ధ్రువీకరించిన తర్వాతనే రాజకీయ ప్రకటనలు ఇస్తామని పేర్కొంది. దీనికి సంబంధించిన వెరిఫికేషన్ ప్రక్రియను ఫిబ్రవరి 14 నుంచి మొదలుపెడతామని తెలిపింది. ఈ ప్రకటనలు మార్చి నుంచి అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది.

కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు
త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో ప్రజలను ప్రభావితం చేసేలా ప్రకటనలు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇటీవల కేంద్ర ప్రభుత్వం హెచ్చరించిన విషయం తెలిసిందే.

ఐటీ చట్టంలో పలు సవరణలు
దీనికి సంబంధించి ఐటీ చట్టంలో పలు సవరణలు సైతం చేసింది. దీంతో అప్రమత్తమైన సామాజిక మాధ్యమాలు.. ప్రకటనల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే ట్విటర్, ఫేస్‌బుక్ ప్రకటనల విషయంలో నిబంధనలు విధించగా.. తాజాగా గూగుల్ కూడా ప్రకటనదారులకు నిబంధనలు విధించింది.


Click it and Unblock the Notifications








