ఆండ్రాయిడ్ వేర్‌కు Oreo 8.0 అప్‌డేట్

|
Xiaomi Mi A1 First Impressions

స్మార్ట్‌వాచెస్ ఇంకా ఇతర వేరబుల్స్ కోసం అభివృద్ది చేసిన Android Wearకు సంబంధించి సరికొత్త బేటా ప్రోగ్రామ్‌ను గూగుల్ లాంచ్ చేసింది. ఈ బేటా ప్రోగ్రామ్‌ను Android Oreo 8.0 ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా గూగల్ అభివృద్ది చేసింది. ఆసక్తిగల యూజర్లు ఎల్‌జీ వాచ్ స్పోర్ట్ స్మార్ట్‌వాచ్ ద్వారా ఈ బేటా ప్రోగ్రామ్‌ను టెస్ట్ చేయవచ్చు. ప్రస్తుతానికి ఎల్‌జీ స్మార్ట్‌వాచ్‌కు మాత్రమే ఈ అప్‌డేట్‌ను అందుబాటులో ఉంచటం జరిగింది.

 
Google announces new Oreo-based Android Wear beta


ఈ బేటా ప్రోగ్రామ్‌ను ఇప్పటికే పరీక్షించి చూసిన ఆండ్రాయిడ్ డెవలపర్స్ బ్లాగ్ పలు ఆసక్తికర వివరాలను రివీల్ చేసింది. ఈ లేటెస్ట్ ఆండ్రాయిడ్ వేర్‌కు సంబంధించిన బెటా ప్రోగ్రామ్‌లో ఓ ప్రత్యేకమైన యాప్ నోటిఫికేషన్ ఛానల్ ఉంటుంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు కావల్సిన యాప్‌ను బ్లాక్ లేదా మ్యూట్ చేసే వీలుంటుంది. అంతేకాకుండా నోటిఫికేషన్స్‌ను స్మార్ట్‌వాచ్ పై కావల్సిన విధంగా యాక్సెస్ చేసుకునే వీలుంటుంది.

స్మార్ట్‌వాచ్‌కు ఎటువంటి అలర్ట్స్ రావాలి అనే దాని పై యూజర్ తనకు నచ్చిన విధంగా కాన్ఫిగర్ చేసుకునే వీలుంటుంది. ఈ అప్‌డేట్‌లో భాగంగా స్మార్ట్‌వాచ్‌కు సంబంధించిన బ్యాటరీ లైఫ్‌ను మరింతగా మెరుగుపరిచే క్రమంలో బ్యాక్‌గ్రౌండ్ లోకేషన్ చెక్‌లకు సంబంధించి ఫ్రీక్వెన్సీని కూడా గూగుల్ తగ్గించే ప్రయత్నం చేసింది. ఎల్‌జీ స్పోర్ట్ స్మార్ట్‌వాచ్ అందుబాటులో లేని వారు ఈ బేటా ప్రోగ్రామ్‌ను Android Emulator ద్వారా పరీక్షించే వీలుంటుంది.

 

Android Wear అంటే ఏంటి..?

ఆండ్రాయిడ్ వేర్ (Android Wear) అనేది గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంకు సంబంధించి ఓ ప్రత్యేకమైన వర్షన్. ఈ వర్షన్‌ను స్మార్ట్ వాచెస్ అలానే ఇతర వేరబుల్స్ కోసం గూగుల్ అభివృద్ధి చేసింది. ఆండ్రాయిడ్ వేర్ సాప్ట్‌వేర్ పై రన్ అయ్యే స్మార్ట్‌వాచ్‌లను ఆండ్రాయిడ్ 4.3 లేదా ఆ పై వర్షన్‌తో బూట్ అయ్యే స్మార్ట్‌ఫోన్‌లకు గూగుల్ పెయిరంగ్ అప్లికేషన్ ద్వారా కనెక్ట్ చేసినట్లయితే గూగల్ అసిస్టెంట్ టెక్నాలజీతో పాటు మొబైల్ నోటిఫికేషన్స్ స్మార్ట్‌వాచ్‌లోకి ఇంటిగ్రేట్ కాబడతాయి. తద్వాార స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన అన్ని లావాదేవాలను స్మార్ట్‌వాచ్ ద్వారానే నిర్వహించుకునే వీలుంటుంది.

అమెజాన్ ప్రైమ్ యూజర్లకు భారీ షాక్, అదీ భారత్‌లో !అమెజాన్ ప్రైమ్ యూజర్లకు భారీ షాక్, అదీ భారత్‌లో !

ఆండ్రాయిడ్ వేర్ ఆపరేటింగ్ సిస్టం.. బ్లుటూత్‌తో పాటు వై-ఫై, 3జీ ఇంకా ఎల్టీఈ కనెక్టువిటీలను సపోర్ట్ చేస్తుంది. మోటరోలా, సామ్‌సంగ్, సోనీ, ఎల్‌జీ వంటి కంపెనీటు ఆండ్రాయిడ్ వేర్ ఆధారిత స్మార్ట్‌వాచ్‌లను ఇప్పటికే మార్కెట్లో లాంచ్ చేసాయి. 2015 గణాంకాల ప్రకారం ప్రపంచ స్మార్ట్‌వాచ్ మార్కెట్లో ఆండ్రాయిడ్ వేర్ 10% మార్కెట్ వాటాను కలిగి ఉంది.

ఆధునిక యువతకు ఈ స్మార్ట్‌వాచ్‌లు మరింత ట్రెండీగా అనిపిస్తాయి. స్మార్ట్‌వాచ్‌లను స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకుని ఎక్స్‌టెన్షన్‌గా వాడుకోవచ్చు. అంటే ఫోన్‌కు వచ్చిన కాల్స్, మెసేజెస్ ఇంకా ఇతర నోటిపికేషన్‌ల తాలుకా వివరాలను ఎంచక్కా చేతికున్న వాచ్‌లోనే చూసుకోవచ్చు.

Best Mobiles in India

Read more about:
English summary
According to Google, the update is "mainly a technical upgrade to APU 26 with enhancements to background limits and notification channels."

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X