గూగుల్ ఇండియా ‘గ్రేట్ ఆన్‌లైన్ షాపింగ్ ఫెస్టివల్’

Posted By:

గూగుల్ ఇండియా తన మూడవ ‘‘గ్రేట్ ఆన్‌లైన్ షాపింగ్ ఫెస్టివల్'' (జీఓఎస్ఎఫ్)ను ఆవిష్కరించింది. 2014, డిసెంబర్ 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఈ షాపింగ్ ఫెస్టివల్ జరుగుతుందని గూగుల్ వెల్లడించింది. ఆన్‌లైన్ షాపింగ్‌ను భారత్‌లో మరింత విస్తరింపజేసే క్రమంలో, ఈ 72 గంటల మెగా షాపింగ్ ఫెస్టివల్‌ను పురస్కరించుకుని 450 కంపెనీలు తమ భారీ ధర తగ్గింపు డీల్స్‌ను అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని గూగుల్ వివరించింది.

గూగుల్ ఇండియా ‘గ్రేట్ ఆన్‌లైన్ షాపింగ్ ఫెస్టివల్’

ఈ ఫెస్టివల్‌లో భాగంగా మోటరోలా, హెచ్‌పీ, లెనోవో, కార్బన్ తదితర బ్రాండ్‌లకు సంబంధించి ఎక్స్‌క్లూజివ్ ఆవిష్కరణలు ఉంటాయని గూగుల్ తెలిపింది. మొదటి సారి ఆన్‌లైన్ షాపింగ్‌లో పాల్గొంటున్న వారిని దృష్టిలో ఉంచుకుని భారీ డిస్కౌంట్‌లతో కూడిన స్పెషల్ సెక్షన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఈ సెక్షన్‌లో భారీ ధర తగ్గింపుతో వస్తువులను ఆఫర్ చేస్తామని, రవాణా చార్జీలు (డెలివరీ చార్జీలు) ఉచితమని అంతేకాకుండా వస్తువు అందిన తరువాతనే నగదు చెల్లించే సదుపాయన్ని కూడా ప్రవేశపెడుతున్నట్లు గూగుల్ ఇండియా పేర్కొంది.

ఈ షాపింగ్ ఫెస్టివల్‌ను పురస్కరించుకుని ఈ నెల 25 నుంచి వచ్చే నెల 8 వరకు ప్రత్యేకమైన పోటీని నిర్వహిస్తున్నామని, ఈ పోటీల్లో గెలుపొందిన వారు 14 నిమిషాల పాటు ఉచితంగా రూ.2.5 లక్షల విలువైన షాపింగ్‌ను చేసుకోవచ్చని గూగుల్ తెలిపింది. విదేశాల్లో నిర్వహించే సెబర్ మండే ఆన్‌లైన్ షాపింగ్ ఫెస్టివల్‌ను భారత్‌లో గ్రేట్ ఆన్‌లైన్ షాపింగ్ ఫెస్టివల్ పేరుతో నిర్వహిస్తున్నట్లు గూగుల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ రాజన్ ఆనందన్ తెలిపారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Google announces the Great Online Shopping Festival 2014 from 11th to 12th December. Read more in Telugu Gizbot.....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot