జర్నలిస్టులకు గూగుల్ ఉచిత శిక్షణ,పేరు నమోదు,చివరి తేదీ వివరాలు ఇవే !

|

టెక్నాలజీ దిగ్గజం గూగుల్ జర్నలిస్టుల గుడ్ న్యూస్ చెప్పింది. ఇండియాలో ఉన్న జర్నలిస్టులకు సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ ఉచితంగా ట్రెయినింగ్ ఇచ్చేందుకు సిద్ధమైంది.పుట్టలు పుట్టలుగా పుట్టుకొస్తున్న వెబ్‌సైట్లకు తోడు, సోషల్ మీడియాలోనూ తప్పుడు సమాచారం, తప్పుడు వార్తలు బాగా ప్రచారమవుతున్న నేపథ్యంలో సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ తప్పుడు సమాచారం, వార్తలు జనాలకు ఇబ్బందులను తెచ్చిపెడుతుండటంతో వీటిని అరికట్టేందుకు నడుం బిగించినట్లు తెలుస్తోంది.

 

Airtelకు దిమ్మతిరిగే షాకిచ్చిన కస్టమర్లు,మత విద్వేషపు వివాదం !Airtelకు దిమ్మతిరిగే షాకిచ్చిన కస్టమర్లు,మత విద్వేషపు వివాదం !

దేశంలో ఉన్న జర్నలిస్టులకు..

దేశంలో ఉన్న జర్నలిస్టులకు..

తప్పుడు వార్తలను తెలుసుకునేందుకు, మరింత నాణ్యమైన సమాచారాన్ని ప్రజలకు అందించాలనే ఉద్దేశ్యంతో గూగుల్ దేశంలో ఉన్న జర్నలిస్టులకు ఉచితంగా ట్రెయినింగ్ ఇవ్వాలని సంకల్పించింది.

'గూగుల్ న్యూస్ ఇనిషియేటివ్

'గూగుల్ న్యూస్ ఇనిషియేటివ్

'గూగుల్ న్యూస్ ఇనిషియేటివ్' పేరిట దేశంలో ఉన్న జర్నలిస్టులకు గూగుల్ ప్రత్యేక వర్క్‌షాపుల్లో ట్రెయినింగ్ ఇవ్వనుంది. మరో ఏడాదిలోగా మొత్తం 8వేల మందికి ఈ ట్రెయినింగ్ ఇవ్వనున్నారు.

7 భాషల్లో..

7 భాషల్లో..

ఇంగ్లిష్, హిందీ, కన్నడ, తమిళం, తెలుగు, మరాఠీ, బెంగాలీ భాషలకు చెందిన జర్నలిస్టులకు ట్రెయినింగ్ ఇస్తారు. ట్రెయినింగ్‌లో భాగంగా జర్నలిస్టులకు ఉచిత రవాణా, భోజన సదుపాయాలతోపాటు స్టయిఫండ్ కూడా ఇస్తారు.

https://goo.gl/Ttur3b అనే వెబ్‌సైట్‌
 

https://goo.gl/Ttur3b అనే వెబ్‌సైట్‌

ఈ భాషలకు చెందిన ఔత్సాహికులైన జర్నలిస్టులు https://goo.gl/Ttur3b అనే వెబ్‌సైట్‌ను సందర్శించి అందులో ఉండే దరఖాస్తు ఫాంలో వివరాలను నింపి ట్రెయినింగ్ పొందేందుకు ఫాంను సబ్‌మిట్ చేయవచ్చు.

గడువు తేదీలు

గడువు తేదీలు

ఇందుకు గాను ఇంగ్లిష్‌కు జూలై 5వ తేదీ వకు, హిందీ, కన్నడ, తమిళ్ జర్నలిస్టులకు జూలై 15వ తేదీ వరకు గడువిచ్చారు. అలాగే తెలుగు, మరాఠీ, బెంగాలీ భాషలకు చెందిన జర్నలిస్టులకు సెప్టెంబర్ 15వ తేదీ వరకు గడువు విధించారు.

మొదటి దశలో మొత్తం 200 మంది జర్నలిస్టులకు

మొదటి దశలో మొత్తం 200 మంది జర్నలిస్టులకు

ఆ గడువులోగా ట్రెయినింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. అందులో అర్హత ఉన్నవారిని ఎంపిక చేసి ఉచితంగా ట్రెయినింగ్ ఇస్తారు. ట్రెయినింగ్ మొదటి దశలో మొత్తం 200 మంది జర్నలిస్టులకు శిక్షణనిస్తారు.

 పలు రకాల నూతన తరహా సాఫ్ట్‌వేర్ల గురించి..

పలు రకాల నూతన తరహా సాఫ్ట్‌వేర్ల గురించి..

ఇక ట్రెయినింగ్ సమయంలో జర్నలిస్టులకు పలు రకాల నూతన తరహా సాఫ్ట్‌వేర్ల గురించి అవగాహన కల్పిస్తారు. వార్తలను ఎలా సేకరించాలి, నకిలీ వార్తలు, సమాచారాన్ని ఎలా గుర్తించాలి అనే విషయాలపై జర్నలిస్టులకు అవగాహన కల్పిస్తారు.

శిక్షణ తరగతులు జరగనున్న తేదీలు

శిక్షణ తరగతులు జరగనున్న తేదీలు

శిక్షణ తరగతులు జరగనున్న తేదీలు, ప్రదేశాల వివరాలు ఇలా ఉన్నాయి.

1. ఇంగ్లిష్ - జూలై 20 నుంచి ఆగస్టు 3 వరకు - గురుగ్రామ్ - దరఖాస్తుకు చివరి తేదీ జూలై 5

2. హిందీ - ఆగస్టు 20 నుంచి 24 వరకు - గురుగ్రామ్ - దరఖాస్తుకు చివరి తేదీ జూలై 15

3. కన్నడ - ఆగస్టు 27 నుంచి 31 వరకు - బెంగళూరు - దరఖాస్తుకు చివరి తేదీ జూలై 15

4. తమిళం - సెప్టెంబర్ 17 నుంచి 22 వరకు - చెన్నై - దరఖాస్తుకు చివరి తేదీ జూలై 15

5. తెలుగు - నవంబర్ 19 నుంచి 22 వరకు - హైదరాబాద్ - దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 15

6. మరాఠీ - డిసెంబర్ 3 నుంచి 7 వరకు - ముంబై - దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 15

7. బెంగాలీ - జనవరి 15 నుంచి 19వ తేదీ వరకు - కోల్‌కతా - దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 15

Best Mobiles in India

English summary
Google India Announces Training Programme For 8,000 Journalists on Fact-Checking More New at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X