గూగుల్ కొత్త సర్వీసు వాట్ డు యు లవ్?

Posted By: Super

What Do You Love?

కాలిఫోర్నియా: వెబ్ సెర్చ్ ఇంజన్ గెయింట్ రొజురొజుకీ ఓ సరిక్రొత్త టెక్నాలజీ ఫీచర్‌ని ఆవిష్కరిస్తుంది. అందులో భాగంగా మనకు కావాల్సినటువంటి అన్నింటిని ఒకచోటకు తీసుకొనిరావడానికి ప్రయత్నాలు చేస్తుంది. గూగుల్ కొత్త సర్వీస్ 'వాట్ డు యు లవ్' ని త్వరలో ప్రవేశపెట్టనుంది. ఇక గూగుల్ వాట్ డు యు లవ్ ఏమేమి ఆఫర్ చేస్తుందంటే చూడడానికి ఇది గూగుల్ సెర్చ్ ఇంజన్ మాదరే ఇందులో ఓ చిన్న బాక్స్ ఉంటుంది. గూగుల్ యూజర్ ఏదైనా టెస్టు అందులో టైపు చేసినప్పుడు దానికి సంబందించిన సమాచారం గూగుల్ ఇతర ఉపకరణాలు అయినటువంటి గూగుల్ ట్రెండ్స్, గూగుల్ మ్యాప్స్, యూట్యూబ్, ట్రాన్స్ లేట్ వంటి అన్నింటిని శోదించి చివరకు మనకు కావాల్సినటువంటి క్వచ్చన్‌కి సమాధానాన్ని అందిస్తుందన్నమాట.

ఈ విషయాన్ని ప్రముఖ టెక్నాలజీ బ్లాగ్ మాస్బేల్‌లో గూగుల్ వాట్ డు యు లవ్ సుమారుగా 20 వరకు గూగుల్ సర్వీసెస్‌ని అందిస్తుందని తెలిపింది. గూగుల్ డు యు లవ్ ద్వారా వచ్చినటువంటి ఆన్సర్స్‌లో కుడి వైపు చివరి భాగాన చిన్న గూగుల్ బాక్స్ ఉంటుంది. దీనిని గనుక యూజర్స్ క్లిక్ చేసినట్లైతే డైరెక్టుగా సర్వీస్ లోకి వెళ్శడం జరుగుతుంది. ప్రస్తుతానికి గూగుల్ కొన్ని మార్పులు చేర్పులు చేసి త్వరలోనే విడుదల సమయాన్ని గూగుల్ బ్లాగ్‌లో వెల్లడించనున్నారు. మీరు గనుక గూగుల్ డు యు లవ్ సర్వీస్‌ని చూడలనుకుంటే ఈ లింక్‌లో http://www.wdyl.com/# చూడండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot