జియోఫోన్ యూజర్లకు శుభవార్త!

By: Madhavi Lagishetty

జియో 4జీ ఫీచర్ వాడుతున్న యూజర్లకు గుడ్ న్యూస్. సాఫ్ట్ వేర్ దిగ్గజం గూగుల్ తన అసిస్టెంట్ యాప్ ను జియో 4జీ ఫీచర్ ఫోన్లకు తాజాగా రిలీజ్ చేసింది. దీంతో 4జీ ఫీచర్ ఫోన్లలో ఇఫ్పుడు వినియోగదారులు గూగుల్ అసిస్టెంట్ యాప్ వేసుకోవచ్చు.

జియోఫోన్ యూజర్లకు శుభవార్త!

ఈ అసిస్టెంట్ యాప్ హిందీ, ఇంగ్లీష్ లో కూడా పనిచేస్తుంది. దీనివల్ల వినియోగదారులు హిందీ, ఇంగ్లీష్ లో మాట్లాడినా అసిస్టెంట్ అర్థం చేసుకుంటుంది. ఈ క్రమంలోనే అసిస్టెంట్ యూజర్ అడిగిన ప్రశ్నను బట్టి సమాధానం చెబుతుంది. కానీ అదే సమయంలో ఇతర ప్రాంతీయ భాషల కోసం జియో 4జీ సపోర్టు చేస్తుందో లేదో ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

గూగుల్ ఇండియా ఈవెంట్లో , జియోఫోన్ కోసం గూగుల్ అసిస్టెంట్ను ప్రకటించారు. డెమో సాఫ్ట్ వేర్ సెర్చ్ ఫలితాలను డెలివరీ చేవచ్చని...టెక్ట్స్ మెసేజ్ లను పంపడానికి, మ్యూజిక్ ప్లే చేసుకోవడానికి, ఇంకా వాయిస్ కమాండ్స్ వాడుకోవచ్చని డెమోలో చూపించింది. వీటిన్నంటికీ గూగుల్ అసిస్టెంట్ ను వాడుకోవచ్చు.

జియోఫోన్ కోసం డిజిటల్ అసిస్టెంట్ సేవలను ప్రజలకు అందుబాటులో ఉంచేలా గూగుల్ పనిచేస్తోంది. దీంతో లక్షలాది మంది జియోఫోన్ యూజర్లు గూగుల్ యాక్సెస్ సేవలను పొందవచ్చు. జియోఫోన్ 4జి కనెక్టివిటీ సపోర్టు ఇస్తుంది. అంతేకాదు వినియోగదారులకు ఫీచర్ ఫోన్ ఎక్స్ పీరియన్సు అందిస్తుంది. గూగుల్ అసిస్టెంట్ ఫీచర్ విస్తారమైన డేటాబేస్ నుంచి క్విక్ ఇన్ఫర్మేషన్ అందించడానికి ఉపయోగపడుతుది.

బైకర్స్ కోసం మోటర్ సైకిల్ మోడ్...గూగుల్ మ్యాప్స్ నుంచి కొత్త ఫీచర్!

భారతదేశంలో ఇంటర్నేట్ సేవలను విస్తరించేందుకు కీలకమైన మార్కెట్లలో ఒకటిగా పరిగణించబడుతుంది. దేశంలో గ్రామీణస్థాయి నుంచి పట్టణ ప్రాంతాల వరకు ఇంటర్నేట్ సేవలను విస్తరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

అయితే గూగుల్ ఈ మధ్యే ఆండ్రాయిడ్ ఓరెయో గో ఎడిషన్, గూగుల్ మ్యాప్స్ టూ వీలర్ మోడ్, గూగోగో మరియు ఫైల్స్ గో వంటి అనేక కొత్త ఫీచర్లు, సేవలతో భారతీయుల అవసరాలను తీర్చడానికి ప్రకటించింది. ఈ ఫీచర్లు మరియు సేవలను యాక్సెస్ చేయడం కోసం గూగుల్ సులభం చేస్తుంది.

English summary
Google has announced a special edition version of Google Assistant for JioPhone with support for Hindi and English.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting