హే గూగుల్, టాక్ టూ వాల్‌మార్ట్ , ఫీచర్ గురించి తెలుసా ?
2016లో మార్కెట్ లోకి వచ్చిన గూగుల్ అసిస్టంట్ ఫీచర్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ప్రతి సారి కొత్త ఫీచర్లతో వినియోగదారులను కట్టిపడేకుంటూ వెళుతోంది. ఈ సెర్చ్ గెయింట్ గతేడాది కూడా డూప్లెక్స్ ని సపోర్ట్
2016లో మార్కెట్ లోకి వచ్చిన గూగుల్ అసిస్టంట్ ఫీచర్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ప్రతి సారి కొత్త ఫీచర్లతో వినియోగదారులను కట్టిపడేకుంటూ వెళుతోంది. ఈ సెర్చ్ గెయింట్ గతేడాది కూడా డూప్లెక్స్ ని సపోర్ట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు హ్యూమన్ సౌండింగ్ రోబోట్ వాయిస్ అనుభూతిని పొందుతారు.

ఈ ఫీచర్ వాతావరణంలో మార్పులు, న్యూస్, కాల్స్ అలాగే కాల్ స్క్రీన్ ఫీచర్ వంటి వాటిని చూపిస్తుంది. ఇదిలా ఉంటే వీటితో పాటు గూగుల్ కొత్త ఫీచర్లను ఈ మధ్య యాడ్ చేసింది. గూగుల్ అసిస్టంట్ ద్వారా కిరాణా షాపింగ్ చేసుకునే సౌలభ్యాన్ని తీసుకువస్తోంది. ఈ ఫీచర్ క్రోమ్ ఓఎస్ మీద కూడా పనిచేయనుంది.

వాల్‌మార్ట్ షాపింగ్
ఇకపై గూగుల్ యూజర్లు అసిస్టంటట్ ద్వారా వాల్‌మార్ట్ నుంచి ఏవైనా కిరాణా సరుకులను కొనుగోలు చేయవచ్చు.అయితే ఇది కేవలం యుఎస్ లో ఉన్నవారికి మాత్రమే అందుబాటులో ఉంది. Walmart వాయిస్ ఆర్డర్ ద్వారా కిరాణా సరుకులను కొనుగోలు చేసే విధంగా గూగుల్ అసిస్టంట్ ని డెవలప్ చేయనున్నారు.

హే గూగుల్, టాక్ టూ వాల్‌మార్ట్
ఇకపై యూజర్లు గూగుల్ అసిస్టంట్ నుంచి హే గూగుల్, టాక్ టూ వాల్‌మార్ట్ అనే వాయిస్ కమాండ్ ద్వారా అవసరమైన వాటిని కొనుగోలు చేయవచ్చు. నేరుగా వాల్ మార్ట్ కార్ట్ లోకి మీరు కావాల్సిన ఐటమ్స్ ని యాడ్ చేసకోవచ్చు.

వాల్ మార్ట్ మిషిన్ లెర్నింగ్
యుఎస్ రీటెయిల్ దిగ్గజం వాల్ మార్ట్ ఇందుకోసం machine learning algorithmsను డెవలప్ చేస్తోంది. కస్టమర్లు ఆర్డర్ చేసేవాటిని గుర్తు పట్టే విధంగా దానికి సంబంధించిన సమాచారం వారికి అందించనుంది

మిలియన్ డివైస్ లలో..
కాగా టెక్ గెయింట్ గూగుల్ అభివృద్ధి పరిచిన గూగుల్ అసిస్టంట్ కమాండ్ ఇప్పటికే మిలియన్ డివైస్ ల కన్నా ఎక్కువగానే అందుబాటులో ఉంది. Android smartphones, Apple iPhone, Smart Displays, smartwatches ఇంకా ఇతరమై వాటిని కలుపుకుంటే ఈ సంఖ్య ఇంకా అధికంగా ఉండే అవకాశం ఉంది.

కస్టమర్లు టైం సేవ్
కస్టమర్లు వాయిస్ కమాండ్ టెక్నాలజీని చాలా ఇష్టపడుతున్నారని తద్వారా వారి సమయం సేవ్ అవుతుందని వాల్ మార్ట్ ఓ ప్రకటనలో తెలిపింది. కస్టమర్లు ఐటమ్స్ ని కేవలం వాయిస్ కమాండ్ ద్వారానే సెలక్ట్ చేసుకుంటున్నారని దీని వల్ల వారికి నేరుగా షాపింగ్ చేసే భారం తగ్గిందని కంపెనీ చెబుతోంది.


Click it and Unblock the Notifications








