గూగుల్ అసిస్టెంట్ నుంచి ఆండ్రాయిడ్ మెసేజ్‌లు

సెర్చ్ గెయింట్ గూగుల్ గూగుల్ అసిస్టెంట్ ఫీచర్ ను త్వరలో ఆండ్రాయిడ్ మెసేజ్ లుగా త్వరలో తీసుకువస్తోంది. దీని ద్వారా యూజర్లు ఆండ్రాయిడ్ మెసేజ్ లను పంపుకోవచ్చు. అలాగే మెసేజ్ లు చదువుకోవచ్చు. ఈ ఫీచర్ ని సప

|

సెర్చ్ గెయింట్ గూగుల్ గూగుల్ అసిస్టెంట్ ఫీచర్ ను త్వరలో ఆండ్రాయిడ్ మెసేజ్ లుగా త్వరలో తీసుకువస్తోంది. దీని ద్వారా యూజర్లు ఆండ్రాయిడ్ మెసేజ్ లను పంపుకోవచ్చు. అలాగే మెసేజ్ లు చదువుకోవచ్చు. ఈ ఫీచర్ ని సపోర్ట్ చేసే విధంగా గూగుల్ అసిస్టెంట్ ని తీసుకురానుంది. యూజర్లు ఉపయోగించే గూగుల్ అసిస్టెంట్ ఫీచర్లో ఓ బటన్ ని పొందుపరుస్తారు. ఆ బటన్ ద్వారా యూజర్లు స్మార్ట్ రిప్లయి ఇచ్చుకోవచ్చు.

గూగుల్ అసిస్టెంట్ నుంచి ఆండ్రాయిడ్ మెసేజ్‌లు

అలాగే ఆ బటన్ ని ట్యాప్ చేస్తే యూజర్లకు ఓ ప్రశ్నను సంధిస్తుంది. దానికి మీరు నేరుగా టెక్ట్స్ మెసేజ్ ద్వారా సమాధానం ఇవ్వవచ్చు. అయితే ఈ ఫీచర్ కేవలం ఇంగ్లీష్ వర్సన్ లో మాత్రమే అందుబాటులో ఉంది.

ఎలా పనిచేస్తుంది

ఎలా పనిచేస్తుంది

గూగుల్ అసిస్టెంట్ ఫీచర్ మీరు పంపిన మెసేజ్ లను సరిగా అర్థం చేసుకోలేదని కూడా మీరు వర్రీ కానవసరం లేదు. దానికి రిలేటెడ్ గా మీకు కావాలసిన సమాచారాన్ని అందిస్తుంది. గూగుల్ అసిస్టెంట్ ఫీచర్ పంపే సలహాల ద్వారా మీరు ఆ సమాచారాన్ని ఈజీగా తెలుసుకోవచ్చు.

రెస్టారెంట్ కోసం సెర్చ్ చేస్తే..

రెస్టారెంట్ కోసం సెర్చ్ చేస్తే..

మీరు రెస్టారెంట్ కోసం సెర్చ్ చేస్తే దానికి సంబంధించిన కొన్ని పుడ్ రిలేటెడ్ ఎమోజీలను మీకు పంపిస్తుంది. వాటిలో మీకు నచ్చినది సెలక్ట్ చేసుకుంటే మీకు నచ్చిన రెస్టారెంట్ వివరాలను మీకు అందిస్తుంది.

కొత్త ఫీచర్లను అందించే ప్రయత్నంలో గూగుల్

కొత్త ఫీచర్లను అందించే ప్రయత్నంలో గూగుల్

ఇదిలా ఉంటే గూగుల్ కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. గూగుల్ అసిస్టెంట్ ఫీచర్లో ఆండ్రాయిడ్ మెసేజ్ లను పంపుకునేందుకు బటన్ ని తీసుకువచ్చేందుకు రెడీ అయింది. ఇదిలా ఉంటే ఫీచర్ ఫోన్లలో కూడా గూగుల్ అసిస్టెంట్ ఫీచర్ ని తీసుకురానున్నట్లు గూగుల్ తెలిపిన సంగతి అందరికీ విదితమే. KaiOS ద్వారా ఇది రన్ అవుతుంది. Reliance JioPhone and the JioPhone 2లకు ఈ ఫీచర్ సపోర్ట్ చేస్తోంది.

అల్లో లో షట్ డౌన్

అల్లో లో షట్ డౌన్

ఇదిలా ఉంటే గూగుల్ వీడియో కాలింగ్ యాప్ అల్లోలో మెసేజ్ ఫీచర్ ని తీసివేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఫీచర్ అందులో వచ్చే నెల నుంచి పూర్తిగా షట్ డౌన్ అవుతోంది. ఇందులో భాగంగానే ఆండ్రాయిడ్ మెసేజ్ లు SMS, MMS and RCSలు సపోర్ట్ చేసే విధంగా గూగుల్ అసిస్టెంట్ ఫీచర్ ని తీసుకొస్తుందనే వార్తలు వస్తున్నాయి.

Best Mobiles in India

English summary
Google Assistant is coming to Android Messages soon

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X