2010వ సంవత్సరానికి నష్టం $3మిలియన్లు: గూగుల్ ఆస్టేలియా

Posted By: Staff

2010వ సంవత్సరానికి నష్టం $3మిలియన్లు: గూగుల్ ఆస్టేలియా

గూగుల్ ఆస్ట్రేలియా కార్పోరేషన్ 2010 క్యాలెండర్ సంవత్సరానికి గాను $3.08 మిలియన్ల నష్టాన్ని మూటగట్టుకున్నట్లు వెల్లడించారు. గూగుల్ ఆస్ట్రేలియా రెవిన్యూ ఆదాయం 2009 సంవత్సరానికిగాను $110.31 మిలియన్ల ఉండగా అది 2010వ సంవత్సరం వచ్చేసరికే $151.39 మిలియన్ డాలర్లుకు చేరింది. కంపెనీ ఆదాయం పెరగడంతో పాటు కంపెనీ ఖర్చులు కూడా బాగా పెరిగాయి. ఇందులో వచ్చినటువంటి మొత్తాన్ని $111.6 మిలియన్లను ఉద్యోగుల జీతభత్యాలకు, $10.53 మిలియన్లను ప్రమోషన్స్, అడ్వర్టైజింగ్ లకు, మిగతా $7.13 మిలియన్లను ట్రావెల్ మరియు ఎంటర్టైన్మెంట్ కోసం వినియోగించడం జరిగింది. దీంతో తక్కువ బడ్జెట్ మాత్రమే మిగలడం జరిగింది.

దీనితో పాటు గూగుల్ ఆస్టేలియా తన సంపాదనలో కొంత భాగాన్ని ఛారిటీలకు ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా $21.3 మిలియన్లను గూగుల్ ఆస్ట్రేలియా ఛారిటీలకు ఇవ్వడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా గూగుల్ ఆస్టేలియా ఆస్టేలియా స్టాక్ ఎక్జేంజ్‌లో నమోదు కాకపోవడం కూడా మరో కారణం అంటున్నారు విశ్లేషకులు. దీంతో కంపెనీ రిపోర్టింగ్ రిక్వైర్‌మెంట్స్ తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటాయని భావిస్తున్నారు. చివరగా గూగుల్ ఆస్ట్రేలియా $151.39లకు రెవిన్యూకు గాను $7.4 మిలియన్లలను టాక్స్‌గా ఆస్టేలియా గవర్నమెంట్‌కు కట్టడం జరిగింది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting