Home
News

భారత్‌లో అందుబాటులోకి గూగుల్ Bard AI.. ప్రత్యేకతలు ఏంటంటే..?

భారత్‌లో వినియోగదారులకు గూగుల్‌ గుడ్‌న్యూస్ చెప్పంది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న గూగుల్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టూల్ బార్డ్‌ అందుబాటులోకి వచ్చింది. బుధవారం జరిగిన గూగుల్‌ I/O 2023లో ఈ విషయాన్ని టెక్‌ దిగ్గజం గూగుల్‌ వెల్లడించింది.

భారత్‌లోని వినియోగదారులు బార్డ్‌ AI చాట్‌బోట్‌ను వినియోగించుకోవచ్చని వెల్లడించింది. ఇందుకోసం గూగుల్‌ బార్డ్‌ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలని సూచించింది. భారత్‌తోపాటు మరో 180 దేశాల్లో బర్డ్‌ AI అందుబాటులోకి రానుందని తెలిపింది.

Google Bard

గత సంవత్సరం చివరలో మైక్రోసాఫ్ట్‌ స్టార్టప్‌ ఓపెన్‌ ఏఐ.. ChatGPTని లాంచ్ చేసింది. దీన్ని ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో ఓ మైలురాయిగా నిపుణులు అభిప్రాయపడతారు. ఈ ఏడాది మార్చిలో గూగుల్‌ కూడా తన AI టూల్‌ బార్డ్‌ను లాంచ్‌ చేసింది. అయితే బార్డ్‌ ఇప్పటి వరకు యూకే, అమెరికాలోనే అందుబాటులో ఉండేది. ఇప్పటి నుంచి భారత్‌ సహా చాలా దేశాల్లో అందుబాటులోకి వచ్చింది.

గూగుల్‌ బార్డ్‌ ఏఐ చాట్‌బోట్‌ను bard.google.com నుంచి లాగిన్‌ కావచ్చని సంస్థ తెలిపింది. ఇందులోకి లాగిన్‌ కాగానే చాట్‌బోట్‌ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉందని చూపిస్తుంది. పేజీ కుడివైపున గూగుల్‌ బార్డ్‌ను ప్రయత్నించండి "try Bard" అనే బటన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేయాల్సి ఉంటుంది. బార్డ్‌ను యాక్సెస్‌ చేసేందుకు ప్రైవసీ అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది.

అనంతరం గూగుల్‌ బార్డ్‌ AI అన్ని సందర్భాల్లో సరైన సమాధానాలు ఇవ్వలేదు. మరియు వినియోగదారుల ఫీడ్‌బ్యాక్‌తో మరింత మెరుగైన ఫలితాలు ఇవ్వగలదు అంటూ మరో ట్యాబ్‌ కనిపిస్తుంది. ఆ ట్యాబ్‌లో కొనసాగించండి అనే బటన్‌ను క్లిక్‌ చేసి ముందుకు వెళ్సాల్సి ఉంటుంది.

AI బార్డ్‌ అందుబాటులోకి వచ్చినా, ఇప్పటికీ తప్పుడు సమాధానాలు వచ్చే అవకాశం ఉందని గూగుల్‌ తెలిపింది. ప్రస్తుతానికి ఈ చాట్‌బోట్‌ ప్రయోగాత్మకమైనదని వెల్లడించింది. బార్డ్‌లో వచ్చే సమాధానాలను ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలని స్పష్టం చేసింది.

అయితే మైక్రోసాఫ్ట్‌ ఆధ్వర్యంలో వచ్చిన ChatGPTకి, గూగుల్‌ లాంచ్‌ చేసిన Bard AIకి కొన్ని అంశాల్లో భారీ వ్యత్యాసం ఉంది. 2021 సెప్టెంబర్‌ నాటికి అందుబాటులో ఉన్న డేటాను విశ్లేషించి మాత్రమే చాట్‌జీపీటీ సమాధానాలు ఇస్తుంది.

అదే గూగుల్‌ చాట్‌బోట్‌ మాత్రం తాజా సమాచారాన్ని ఉపయోగించుకొని సమాధానాలు ఇస్తుంది. గూగుల్‌ బార్డ్ ఒక ప్రశ్నకు అనేక డ్రాఫ్ట్‌లను అందించగలదు. వాటిలో ఒకదానికి వినియోగదారుడు ఎంచుకోవచ్చు. అదే చాట్‌జీపీటీ ఒకేసారి సమాధానం ఇస్తుంది. అయితే ChatGPT, Bard రెండింటికి కొత్తగా అప్‌డేట్లు రావడం ప్రారంభం అయితే టెక్ దిగ్గజాల ఏఐ టూల్‌లకు సముచిత స్థానం దక్కే అవకాశం ఉంటుంది.

ఇప్పటికే బార్డ్‌ ఏఐ 20 ప్రోగ్రామింగ్ భాషల్లో కోడింగ్ రాయగలదని గూగుల్ తెలిపింది. ఇందులో Java, C++, Python సహా మరిన్ని సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామింగ్ భాషలు ఉన్నట్లు వెల్లడించింది. AIతో పనిచేసే గూగుల్ బార్డ్ కోడింగ్‌ రాయడం సహా వాటి గురించి స్పష్టంగా వివరించగలదని స్పష్టంచేసింది. దీనితో పాటు కోడ్‌ను ఆప్టిమైజ్ చేయగలదని, మరియు మరింత కచ్చితత్వంతో పనిచేయగలదని గూగుల్ వివరించింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగంలో మరింత వేగంగా దూసుకెళ్లేందుకు గూగుల్‌ ప్లాన్‌ చేస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Google Bard introduced in india and know biggest Difference between Bard and ChatGPT
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X