వన్ ఇండియా పాఠకులకు ఈరోజు గూగుల్ డూడుల్ ప్రత్యేకం

Posted By: Super

వన్ ఇండియా పాఠకులకు ఈరోజు గూగుల్ డూడుల్ ప్రత్యేకం

బెంగుళూరు: ప్రముఖు సెలబ్రిటీల గుర్తుగా వారిని మరోమారు స్మరించుకునేందుకు గాను సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కార్యక్రమం 'గూగుల్ డూడుల్'. గతంలో వన్ ఇండియా తెలుగు చాలా మంది ప్రముఖుల గూగుల్ డూడుల్స్ అందించిన విషయం తెలిసిందే. ఈరోజు నవంబర్ 30(బుధవారం) మీకొసం ప్రత్యేకంగా మరో గూగుల్ డూడుల్‌ని అందించడానికి సిద్దంగా ఉన్నాం..

సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ నవంబర్ 30న ప్రముఖ అమెరికా రచయిత మార్క్ తైవాన్ 176వ పుట్టినరోజు సందర్బంగా ఆయనను మరోసారి స్మరించుకుందాం.. మార్క్ తైవాన్ రచించిన ప్రముఖ పాపులర్ నవల 'ద అడ్వంచర్స్ ఆఫ్ టామ్ సాయర్' లో ఫేమస్ సీన్స్‌ని సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ డూడుల్‌గా ఆవిష్కరించింది. గూగుల్ ఆవిష్కరించిన డూడుల్‌లో టామ్ అతని ప్రాణ స్నేహితుడు పెయింట్ జాబ్‌లో వేరు వేరు పనులను చేస్తున్నట్లు ఈరోజు డూడుల్ ఉంది.

ఇక మార్క్ తైవాన్ గురించి మాట్లాడుకుంటే అమెరికన్ గొప్ప రచయిత మాత్రమే కాకుండా మంచి సాహిత్యం ఉన్న వ్యక్తి. తాను రచించినటువంటి రెండు గొప్ప నవలలు 'ద అడ్వంచర్స్ ఆఫ్ టామ్ సాయర్', 'ద అడ్వంచర్స్ ఆఫ్ హాకిల్‌బెర్రీ ఫిన్' అమెరికా చరిత్రలో ఆల్ టైమ్ రికార్డు నవలలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాయి. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జనాభాకి మార్క్ తైవాన్ యొక్క సాహిత్యాన్ని తెలిసేలా చేశాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot