గూగుల్ సింగపూర్ డేటా సెంటర్ పనులు ప్రారంభం..

Posted By: Prashanth

గూగుల్ సింగపూర్ డేటా సెంటర్ పనులు ప్రారంభం..

 

గతంలో వన్ ఇండియా పాఠకులకు గూగుల్ అతి త్వరలో సింగపూర్‌లో డేటా సెంటర్‌ని స్దాపించనున్నట్లు తెలపడం జరిగింది. ఈ న్యూస్‌కి సంబంధించిన మరింత సమాచారం పాఠకులకు క్లుప్తంగా..

ఛానల్ న్యూస్ ఆసియా అందించిన సమాచారం ప్రకారం సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ $120 మిలియన్ డబ్బుతో సింగపూర్‌లో కోనుగోలు చేసిన భూమిలో శంకుస్దాపన పనులకు శ్రీకారం చుట్టింది. సౌత్‌ఈస్ట్ ఆసియాలో గూగుల్ ప్రారంభించదలచుకున్న మొదటి డేటా సెంటర్స్‌లలో సింగపూర్ డేటా సెంటర్ ఒకటి. రెండవది చైనాలో ఉన్న హాంగ్ కాంగ్‌లో కూడా $300 మిలియన్ డబ్బుతో మరో డేటా సెంటర్‌ని ప్రారంభించనున్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే. ఇక పోతే మూడవ డేటా సెంటర్‌‌ని $100 మిలియన్లతో తైవాన్‌లో ప్రారంభించనున్నట్లు తెలిపింది.

ఐతే మొదటగా సింగపూర్‌లో ఉన్న డేటా సెంటర్‌‌ని ప్రారంభించగా, ఆ తర్వాత హాంగ్ కాంగ్‌లో స్దాపించనున్న డేటా సెంటర్ పనులకు శ్రీకారం చుట్టనుంది. సింగపూర్‌లో స్దాపించనున్న ఈ డేటా సెంటర్ 2013వ సంవత్సరానికి అందుబాటులోకి రానుంది. మిగిలిన రెండు డేటా సెంటర్లు డైరెక్టుగా తమయొక్క సర్వీసులను ఆసియాకి అందించనున్నాయి. ఇలా మూడు చోట్ల కొత్త డేటా సెంటర్లను స్దాపించడానికి కారణం గూగుల్ అమెరికా సర్వర్లకు కొంత బడ్డెన తగ్గించడానికేనని అన్నారు.

అంతేకాకుండా ఈ డేటా సెంటర్ల ద్వారా సౌత్‌ఈస్ట్ ఆసియాలో బిజినెస్ కార్యకలాపాలను ముమ్మరంగా విస్తరించుకోవచ్చునని అన్నారు. ప్రత్యేకించి సింగపూర్‌లో డేటా సెంటర్‌ని స్దాపించడానికి కారణం సింగపూర్ అన్ని రకాలుగా అభివృద్ది చెందడమే కాకుండా బిజినెస్ పరంగా అనుకూలంగా ఉండడమేనని అన్నారు.

గూగుల్ తన సింగపూర్‌లో మొదటి సారి ఆఫీసుని 2010వ సంవత్సరంలో ప్రారంభించింది. ఆ తర్వాత కాలంలో గూగుల్ తన ఆఫీసుని సెంట్రల్ బిజినెస్ జిల్లాకి మార్చడమే కాకుండా మరో రెండు చోట్ల(మలేషియా, ధాయ్ లాండ్)లలో కొత్త ఆఫీసులను ప్రారంభించింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot