ప్రపంచంలో అత్తుత్తమ కంపెనీగా గూగుల్

Posted By: Staff

ప్రపంచంలో అత్తుత్తమ కంపెనీగా గూగుల్

 

న్యూయార్క్: ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ కంపెనీలలో పనిచేసేందుకు సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ ఉత్తమ కంపెనీ అని ఫార్చ్యూన్ మ్యాగజైన్ పేర్కొంది. 2012 ఏడాదిలో 100 బెస్ట్ కంపెనీల జాబితాలో గూగుల్ అగ్రస్థానంలో నిలిచిందని ఫార్చ్యూన్ తెలిపింది. వర్క్ కల్చర్ మొదలుకుని ఉచిత ఆహారం దాకా ఉద్యోగులకి కల్పించే సదుపాయాలన్నింటి విషయాల్లోనూ గూగుల్ ఉత్తమంగా ఉందని ఫార్చ్యూన్ ఇటీవల విడుదల చేసింది.

గూగుల్ తర్వాత రెండవ స్దానాన్ని బోస్టన్ కన్సెల్టింగ్ గ్రూప్ నిలిచింది. ఆ తర్వాత స్దానాలలో మెర్సిడెస్ బెంజ్, డ్రీమ్ వర్క్ యానిమేషన్, గోల్డ్‌మాన్ సాచెస్, సాప్ట్ వేర్ మేకర్ ఎడోబ్, ఇంటెల్, మైక్రోసాప్ట్ మొదలగునవి ఉన్నాయి. ఇది ఇలా ఉంటే సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ గూగుల్ ప్లస్ రోజు రోజుకీ అభివృద్ది చెందుతూ 90 మిలియన్ యూజర్స్‌కు చేరుకుంది. ఈ విషయాన్నని సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా గూగుల్ సిఈవో లారీ పేజి తన సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్‌లో తెలిపాడు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని లారీ పేజి గూగుల్ నాల్గవ త్రైమాసిక ఫలితాలతో పాటు ప్రెస్ రిలిజ్‌లో పేర్కోన్నారు.

గూగుల్ ప్లస్, ఆండ్రాయిడ్, జీ మెయిల్‌ల అభివృద్ది రోజు రోజుకీ పెరగడమే కాకుండా, అతి తక్కువ కాలంలో ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపుని తెచ్చుకున్నాయని అన్నారు. గూగుల్ అప్లికేషన్స్ యూజర్స్‌తో ప్రెండ్లీ రిలేషన్‌షిప్‌ని కలిగి ఉండడంతో పాటు, యూజర్స్‌కి వండర్ పుల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించడంలో ముందుంటాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot