చైనా యాప్‌ టిక్ టాక్‌కి దిమ్మతిరిగే షాకిచ్చిన గూగుల్

సోషల్ మీడియా సంచలనం రేపుతున్న చైనా యాప్ ​ 'టిక్ టాక్'కు గూగుల్ నుంచి షాక్‌ తగిలింది. ఇటీవల మద్రాస్‌ హైకోర్టు బ్యాన్‌, సుప్రీం ఆదేశాలు, కేంద్ర ప్రభుత్వం చర్యల నేపథ్యంలో టిక్‌ టాక్‌ యాప్‌ను గూగుల్ ప్లే

|

సోషల్ మీడియా సంచలనం రేపుతున్న చైనా యాప్ ​ 'టిక్ టాక్'కు గూగుల్ నుంచి షాక్‌ తగిలింది. ఇటీవల మద్రాస్‌ హైకోర్టు బ్యాన్‌, సుప్రీం ఆదేశాలు, కేంద్ర ప్రభుత్వం చర్యల నేపథ్యంలో టిక్‌ టాక్‌ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి బ్యాన్ చేసింది. ఈ విషయాన్ని రాయిటర్స్‌ రిపోర్ట్‌ చేసింది.

 
భారతదేశంలో 250కు పైగా ఉద్యోగులను

టిక్‌టాక్‌ డౌన్‌లోడ్లను నిషేధించాలనే కోర్టు ఆదేశాలకు అనుగుణంగా గూగుల్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం భారతదేశంలో గూగుల్ ప్లే స్టోర్‌లో టిక్‌ టాక్‌ అందుబాటులో లేదు. అయితే ఆపిల్‌ స్టోర్‌లో అందుబాటులో ఉంది.

యాప్‌ నిషేధంపై స్టే

యాప్‌ నిషేధంపై స్టే

టిక్‌ టాక్‌ యాప్‌ నిషేధంపై స్టే విధించాలంటూ చైనాకు చెందిన బైటెన్స్ టెక్నాలజీ అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించిన కొన్ని గంటల తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది. అయితే బ్యాన్ వ్యవహారంపై గూగుల్‌, ఆపిల్‌ అధికారికంగా ఇంకా ఎటువంటి స్పంద ఇవ్వలేదు.

బైటెన్స్ టెక్నాలజీ అభ్యర్థను

బైటెన్స్ టెక్నాలజీ అభ్యర్థను

ఏప్రిల్‌ 3నాటి మద్రాస్‌ కోర్టుతీర్పును సవాల్‌ చేస్తూ చైనాకు చెందిన బైటెన్స్ టెక్నాలజీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కింది కోర్టు తీర్పును సమర్ధించిన చీఫ్ జస్టిస్ రంజన్ గోగొయ్ నేతృత్వంలోని కమిటీ తదుపరి విచారణను ఈ నెల( ఏప్రిల్) 22కి వాయిదా వేసింది.

నష్టాలేంటో లిఖిత వివరణ
 

నష్టాలేంటో లిఖిత వివరణ

మద్రాస్ హైకోర్టు విధించిన నిషేదం అప్పటి వరకూ కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో పాటు గూగుల్, ఆపిల్ సంస్థలను టిక్ టాక్ వాడకంలో ఉండడం వల్ల నష్టాలేంటో లిఖిత వివరణ ఇవ్వాలని ఆదేశించింది. యాప్ స్టోర్ల నుంచి టిక్ టాక్‍‌ను తొలగించాలని పేర్కొంది.

టీనేజర్‌లు, యువతపై

టీనేజర్‌లు, యువతపై

టిక్ టాక్‌ను తమిళనాడులో నిషేదించాలన్న అభ్యర్థన సమర్దించిన మద్రాస్‌ హైకోర్టు యాప్‌పై నిషేధాన్ని విధించింది. అలాగే గూగుల్, ఆపిల్ స్టోర్లలో ప్రమాదకరమైన యాప్‌ను తొలగించాలని కేంద్రాన్ని కోరింది. టిక్ టాక్, హలో యాప్‌లు దేశవ్యాప్తంగా టీనేజర్‌లు, యువతపై దుష్ర్పభావాన్ని చూపిస్తున్నయని పేర్కొంది. దీనికి అనుకూలంగానే సుప్రీం కూడా తీర్పునివ్వడంతో గూగుల్‌ ఈ చర్యకు తీసుకున్నట్టు సమాచారం.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మూడవస్థానాన్ని

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మూడవస్థానాన్ని

ఇదిలా ఉంటే కొద్ది రోజుల ముందే టిక్ టాక్‌లో అభ్యంతరకర వీడియోలు ఉన్నాయంటూ ఫిర్యాదు అందడంతో టిక్ టాక్ 6 మిలియన్ వీడియోలను తొలగించింది. కాగా ఈ యాప్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మూడవస్థానాన్ని ఆక్రమించింది. మొదటి రెండు స్థానాల్లో గూగుల్, ఆపిల్ ఉన్నాయి.

240 మిలియన్లకంటే ఎక్కువసార్లు

240 మిలియన్లకంటే ఎక్కువసార్లు

సెన్సార్ టవర్ ఫిబ్రవరిలో అందించిన సమాచారం ప్రకారం ఇదిభారతదేశంలో 240 మిలియన్లకంటే ఎక్కువసార్లు డౌన్‌లోడ్‌ అయింది. 30 మిలియన్ల కంటే ఎక్కువమంది వినియోగదారులు 2019 జనవరిలో ఈ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేశారట. గత ఏడాది ఇదే నెలలో పోలిస్తే ఇది 12 రెట్లు ఎక్కువ.

 

 

భారతదేశంలో 250కు పైగా ఉద్యోగులను

భారతదేశంలో 250కు పైగా ఉద్యోగులను

అంతేకాదు భారతదేశంలో 250కు పైగా ఉద్యోగులను నియమించుకున్న ఈ సంస్థ తన వ్యాపార విస్తరణ కోసం ఎక్కువ పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందట. మరోవైపు ఇప్పటికే అమెరికా, బ్రిటన్‌, హాంకాంగ్, ఇండోనేషియా దేశాల్లో దీనిపై పూర్తి నిషేధం అమల్లో ఉంది.

Best Mobiles in India

English summary
TikTok app: Google blocks Chinese app TikTok in India after court order

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X