Just In
- 9 min ago
Amazon ఫైర్ టీవీ స్టిక్ తో పాటు Gaming కంట్రోలర్ కూడా ! ఆఫర్ వివరాలు చూడండి.
- 38 min ago
ఇక అప్పటితో Windows 8.1 ఓఎస్ యూజర్లకు సపోర్ట్ ఉండదు!
- 2 hrs ago
తమ ఫోన్ల గురించి, తప్పుడు యాడ్ లు ప్రచారం చేసినందుకు రూ.75 కోట్లు జరిమానా !
- 17 hrs ago
భారత్‌లో Realme (Tech Life Watch R100) స్మార్ట్ వాచ్ విడుదల..
Don't Miss
- Sports
Venkatesh Iyer: ఓపెనర్‌గా అతనే సమర్థుడు: టీమిండియా మాజీ ప్లేయర్
- News
బొమ్మను పెళ్ళాడిన మహిళ; మరో బుజ్జిబొమ్మ సంతానంగా.. ఈ స్టోరీ చదివితే షాకవ్వటం పక్కా!!
- Automobiles
రైడింగ్‌కి మీరు సిద్దమేనా.. మార్కెట్లో కొత్త 'కవాసకి నింజా 400' విడుదలైంది: వివరాలు
- Movies
శృతి మించిన యాంకర్ స్రవంతి గ్లామర్ ట్రీట్: ఉల్లిపొర లాంటి డ్రెస్‌లో అలా అందాల కనువిందు!
- Lifestyle
Today Rasi Phalalu :ఓ రాశి వారు ఈరోజు వైవాహిక జీవితంలో జాగ్రత్తగా ఉండాలి..!
- Finance
20,000 డాలర్లకు పైన బిట్ కాయిన్, 12000 డాలర్ల దిగువన ఎథేర్
- Travel
ట్రెక్కింగ్ ప్రియుల స్వర్గధామం.. జీవ్‌ధన్ ఫోర్ట్!
Google మొదటి ఫోల్డబుల్ పిక్సెల్ ఫోన్ లాంచ్ మరింత ఆలస్యం కానున్నది!!
US ఆధారిత సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ తన మొదటి ఫోల్డబుల్ ఫోన్ 'పిక్సెల్ ఫోల్డ్'ని 2022 ఈ సంవత్సరం లాంచ్ చేస్తుందని భావించారు. అయితే ఇప్పుడు గూగుల్ యొక్క ఈ ఫోల్డబుల్ పిక్సెల్ ఫోన్ ఈ సంవత్సరం లాంచ్ కావడం లేదని మరియు వచ్చే ఏడాది 2023 సంవత్సరంలో లాంచ్ కానున్నట్లు కొన్ని నివేదికలు కొత్తగా రిపోర్టుని విడుదల చేసాయి. గూగుల్ బ్రాండ్ నుంచి వచ్చే మొదటి ఫోల్డబుల్ పిక్సెల్ ఫోన్ మీద అనేక అంచనాలు ఉన్నాయి. గూగుల్ సంస్థ అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేయనున్న మొట్టమొదటి ఫోల్డబుల్ ఫోన్ కావడంతో గొప్ప ఆఫర్లను అందించవచ్చు అని భావించబడింది. హార్డ్‌వేర్ పరంగా LTPO మరియు 120Hz వరకు వేరియబుల్ రిఫ్రెష్‌తో గెలాక్సీ Z ఫోల్డ్ 3 పరిమాణంలో పిక్సెల్ ఫోల్డ్ ఫోన్ ఉంటుందని అంచనా వేయబడింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఆండ్రాయిడ్ 12 ఆప్టిమైజ్ వెర్షన్ ఆండ్రాయిడ్ 12L తో రన్ అయ్యే టాబ్లెట్లు, ఫోల్డబుల్లు మరియు క్రోమ్ OS డివైస్‌లను విడుదల చేయనున్నట్లు గూగుల్ కంపెనీ ఇటీవల ప్రకటించింది. సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ మాదిరిగానే ఫోల్డ్ చేసే విధంగా గూగుల్ పిక్సెల్ ఫోన్ 7.6-అంగుళాల స్క్రీన్ పరిమాణంతో లభించవచ్చని సూచించబడింది. ఫోల్డబుల్ పిక్సెల్ ఏ రకమైన ఫోల్డింగ్ సిస్టమ్‌ను అవలంబించనుందనే దానిని ధృవీకరించలేదు కానీ ఇది నిలువుగా ఫోల్డ్ చేసే అవకాశం ఉన్నట్లు పుకార్లు సూచిస్తున్నాయి.

శామ్సంగ్ OLED డిస్ప్లేలతో వచ్చే కొత్త డివైస్‌లు ఈ సంవత్సరంలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉందని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. ఇదే కనుక నిజమయితే కనుక ఫోల్డబుల్ పిక్సెల్ ఫోన్ కూడా ఈ సంవత్సరం చివరి నాటికి వస్తుందని మేము ఆశిస్తున్నాము. ఈ సంవత్సరం 'మేడ్ బై గూగుల్' ఈవెంట్లో పిక్సెల్ 5a లేదా పిక్సెల్ 6లతో పాటుగా ఫోల్డబుల్ పిక్సెల్ ఫోన్ కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఫోల్డబుల్ పిక్సెల్ ఫోన్‌కు సంబంధించిన ఇతర వివరాలు తెలియవు. దీనిని 'పాస్‌పోర్ట్' అనే నామంతో మునుపటి లీక్‌లు సూచిస్తున్నాయి. గూగుల్ ఇటీవల తన స్మార్ట్ఫోన్ల కోసం మిడ్-రేంజ్ మార్గాన్ని అవలంబిస్తున్నందున ఫోల్డబుల్ పిక్సెల్ ఫోన్ మిడ్-రేంజ్ స్పెక్స్‌తో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే మేము ఇటీవల చూసిన ఫోల్డబుల్ పరికరాల ధరల పథకాన్ని పరిగణనలోకి తీసుకుంటే భారీ ధర ట్యాగ్‌తో వస్తుంది.

Apple ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్
డిస్ప్లే సప్లై చైన్ కన్సల్టెంట్స్ (DSCC) విశ్లేషకుడు రాస్ యంగ్ నివేదిక ప్రకారం ఆపిల్ సంస్థ యొక్క ఫోల్డబుల్ ఐఫోన్ కూడా 2025 నాటికి లాంచ్ చేసే అవకాశం ఉంది. ఆలస్యానికి కారణం కంపెనీ ఆల్-స్క్రీన్ ఫోల్డబుల్ మ్యాక్‌బుక్స్‌పై పని చేయడానికి తన దృష్టిని మార్చడం. దీనికి ముందు ఫోల్డబుల్ ఐఫోన్ 2023 లేదా 2024లో వస్తుందని భావించారు. ఆపిల్ ప్రస్తుతం 20-అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లే గురించి సరఫరాదారులతో చర్చలు జరుపుతోంది. కంపెనీ ఫోల్డబుల్ మ్యాక్‌బుక్స్‌లో పని చేయడానికి ప్లాన్ చేస్తుందంటే ఇది అర్ధమే. ఫోల్డబుల్ ఫారమ్‌లలో ఉపయోగించబడుతుందని భావిస్తున్నారు. ఈ మ్యాక్‌బుక్ మోడల్‌లు 2026 లేదా 2027లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
-
54,535
-
1,19,900
-
54,999
-
86,999
-
49,975
-
49,990
-
20,999
-
1,04,999
-
44,999
-
64,999
-
20,699
-
49,999
-
11,499
-
54,999
-
7,999
-
8,980
-
17,091
-
10,999
-
34,999
-
39,600
-
25,750
-
33,590
-
27,760
-
44,425
-
13,780
-
1,25,000
-
45,990
-
1,35,000
-
82,999
-
17,999